newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

హైకోర్టు కోసం మూడుముక్కలాట.. సైలెంట్ మోడ్లో సీఎం!

29-09-201929-09-2019 07:43:00 IST
2019-09-29T02:13:00.650Z29-09-2019 2019-09-29T02:12:56.247Z - - 08-12-2019

హైకోర్టు కోసం మూడుముక్కలాట.. సైలెంట్ మోడ్లో సీఎం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం నవ్యఆంధ్ర రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కోసం రాష్ట్రంలో మూడు ముక్కలాట కొనసాగుతుంది. ఏపీ శాశ్వత హైకోర్టును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరుతూ విశాఖలోని న్యాయవాదులు విధులు బహిష్కరించి పలుచోట్ల నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. తమ డిమాండ్ పట్ల ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే రిలే నిరాహార దీక్షలకు దిగుతామని బార్ అసోసియేషన్ల నాయకులు హెచ్చరించారు. విశాఖలో హైకోర్టు డిమాండ్ ఇప్పుడు చేస్తున్నదేమీ కాదు..

తెలంగాణ నుండి ఏపీని విడదీశాక ఈ హైకోర్టు వివాదం మొదలైంది. రాష్ట్రం విడిపోవడానికి ముందు శ్రీకృష్ణ కమిటీ, రాష్ట్రం విడిపోయాక రాజధాని ఏర్పాటు కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరాకృష్ణ కమిటీ సమయంలో ఈ డిమాండును అక్కడి నేతలు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు గట్టిగానే వినిపించాయి. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కూడా నాలుగు నెలలలో నాలుగుసార్లు ఈ డిమాండ్ వినిపించడం విశేషం.

విశాఖలో హైకోర్టు డిమాండ్ రాకముందే వెనుకబడిన రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తే అన్ని విధాలా ఆ ప్రాంతం అభివృద్ధి చెంది న్యాయం జరుగుతుందని అక్కడి వాళ్ళు డిమాండ్ వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు కర్నూలులో హైకోర్టు ఉండేది కనుక ఇప్పుడు కూడా అక్కడే ఏర్పాటు చేయడమే న్యాయమని ఆ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కర్నూలులోని రాజ్ విహార్ సెంటర్ లో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో దీక్ష చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండగా ఇప్పటికే రాజధానిని కోల్పోయిన తాము హైకోర్టును ఏర్పాటు చేయకపోతే సహించేదిలేదని హెచ్చరిస్తున్నారు.

ఏ కమిటీ ఎన్ని చెప్పినా.. ఆ నివేదికలలో ఏం చెప్పినా గత టీడీపీ ప్రభుత్వం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేసేసింది. తాత్కాలిక భవనంలో కోర్టును ఏర్పాటు చేసినా శాశ్వత భవనానికి కూడా అంకురార్పణ చేసేసింది. ఇప్పుడు అన్ని కార్యకలాపాలు అమరావతి నుండే జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం హైకోర్టు ఉన్న అమరావతి ప్రాంతంలో కూడా అదే పరిస్థితి.

నేలపాడులోని హైకోర్టును యధాతథంగా కొనసాగించాలంటూ గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు న్యాయవాదుల సారథ్యంలో ఏర్పాటైన అయిదు జిల్లాల బార్ అసోసియేషన్ల సమాఖ్య ఇదివరకే విధులను బహిష్కరించి వెనక్కి తగ్గబోమని హెచ్చరించింది. హైకోర్టు తరలింపుపై వస్తున్న వార్తలను మమ్మల్ని కలవరపెడుతున్నాయంటున్న ఇక్కడి ప్రజలు తరలింపుకు ఏ మాత్రం అంగీకరించేది లేదని హెచ్చరిస్తున్నారు.

ఇలా రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల న్యాయవాదులు, ప్రజాసంఘాలు, ప్రజలు ఎవరికి వారు తమ ప్రాంతంలో హైకోర్టు అని ఆందోళనకు దిగుతున్నా ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై నోరు మెదపడం లేదు. ఆ మాటకొస్తే అసలు ఒకపక్క అమరావతిలో హైకోర్టు ఏర్పాటు జరిగిపోయినా ఇంకా మా ప్రాంతంలో ఉండాలని ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్ళు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఆ డిమాండ్ వచ్చే అవకాశమిచ్చింది ఎవరు? అంటే ఇక్కడ మళ్ళీ అందరి చూపు ఆ ప్రభుత్వంపైనే.

ప్రభుత్వంలోని పెద్దలు అమరావతి తరలింపుపై వ్యాఖ్యలు చేయడంతో మిగతా రెండు ప్రాంతాల వారు తమ ప్రాంతానికి హైకోర్టు రావాలని డిమాండ్లు మొదలుపెట్టారు. అసలే రాజధాని బోసిపోతుంటే ఉన్న హైకోర్టు కూడా పోతే తమ పరిస్థితి ఏంటని అమరావతి ప్రాంత ప్రజలు, న్యాయవాదులు తరలింపు సహించేంది లేదని డిమాండ్ మొదలుపెట్టారు. అయితే మూడు ప్రాంతాల వాళ్ళు నిరసనలు, ఆందోళనలను మించి నిరాహార దీక్షల వరకు వెళ్లినా సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం సైలెంట్ మోడ్లోనే ఉండిపోయారు. ఇక ప్రభుత్వ పెద్దలు కూడా హైకోర్టు అంశంపై నోరుమెదపడం లేదు. సైలెన్స్ ప్లీజ్ యువర్ హానర్.. బట్ ఎన్నాళ్లీ మూడు ముక్కలాట!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle