newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

27-05-202027-05-2020 06:37:31 IST
Updated On 27-05-2020 09:31:26 ISTUpdated On 27-05-20202020-05-27T01:07:31.175Z27-05-2020 2020-05-27T01:07:29.350Z - 2020-05-27T04:01:26.244Z - 27-05-2020

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ హైకోర్టు చరిత్రలో మరో కీలక అంశం చోటుచేసుకుంది. వివిధ కేసులలో ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇచ్చినందుకు గాను అధికార పార్టీ నేతలు ఏకంగా హైకోర్టు న్యాయమూర్తులపై పెద్ద ఎత్తున ఆరోపణలకు దిగారు. ఏకంగా పార్టీ అధికారిక ఛానెళ్లలో కోర్టు తీర్పులపైనే డిబేట్లు పెట్టి న్యాముర్తులు కూడా ప్రతిపక్ష పార్టీలకు ప్రభావితమయ్యారు అనేలా ఎమ్మెల్యేలతో సహా వైసీపీ నేతలు విస్తృతంగా వ్యాఖ్యలు చేశారు.

ఇక సోషల్ మీడియాలో అయితే హైకోర్టు న్యాయమూర్తులను సైతం టీడీపీ అధినేత చంద్రబాబు మ్యానేజ్ చేశారు అనేలా పెద్ద ఎత్తున విషప్రచారం జరిగింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన హైకోర్టు సుమోటాగా స్వీకరించి మొత్తం 49 మంది అధికార పార్టీ నేతలకు నోటీసులు పంపింది. అధికార పార్టీ నేతలు చంద్రబాబు మ్యానేజ్ చేశారు.. జగన్మోహన్ రెడ్డి మ్యానేజ్ చేయలేకపోతున్నారు అనేలా మాట్లాడుతున్నారు అనుకున్నారే కానీ అది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను కించపరచడం అనేది మర్చిపోయారు.

Andhra Pradesh High Court Issues Contempt Of Court Notice To 49 ...

అందుకు పర్యవసానంగా హైకోర్టు చరిత్రలో అరుదుగా జరిగే కీలక ఘటాన్ని భారత ప్రజలు చూడాల్సి వచ్చింది. హైకోర్టు తీర్పులపై చర్చించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. క్రింది కోర్టు తీర్పుపై సంతృప్తి చెందకపోతే పైకోర్టుకి వెళ్ళవచ్చు. కోర్టు తీర్పును క్లాజులు వారీగా విశ్లేషించవచ్చు. చివరికి కోర్టు తీర్పులపై కూడా అసంతృప్తిని వెల్లడించవచ్చు. కానీ న్యాయమూర్తులు ప్రలోభాలకు గురయ్యారనేలా మాట్లాడడం ఆ రాజ్యాంగాన్నే అవమానించడం.

ప్రస్తుతం నోటీసులు అందుకున్న 49 మంది చేసిన అతిపెద్ద పొరపాటు అదే. అందులో ముఖ్యంగా నోటీసులు అందుకున్న వారిలో ముందువరసలో ఉన్న ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ లాంటి వాళ్ళైతే మరీ అతిగా వ్యాఖ్యానించారని చెప్పాల్సి వస్తుంది. నందిగం సురేష్ హైకోర్టు కూడా మరోప్రతిపక్షంగా మారిందంటే.. ఆమంచి ఏకంగా కరోనా లేకపోతే దీక్షకు కూడా దిగేవాడిని అంటూ వ్యాఖ్యానించారు.

డాక్టర్ సుధాకర్ కేసు ఒక పెట్టీ కేసని.. హైకోర్టు కావాలనే ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తుందని ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. నిజానికి డాక్టర్ సుధాకర్ కేసు తొలినాళ్ళలో మాస్కులు లేవని ఆరోపించిన రోజునే జగన్ ప్రభుత్వం వదిలేసి ఉంటె అది చిన్న కేసు అయ్యేది. డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన రోజున పై అధికారులు ఆ విషయాన్నీ ఖండించి డాక్టర్ మీద తిరిగి ఆరోపణలు చేసుంటే అది ఇంతవరకు వచ్చేది కాదు.

కానీ ఎక్కడో ఒక డాక్టర్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏకంగా మంత్రులే మీడియా ముందుకొచ్చి డాక్టరును చంద్రబాబు మనిషిగా ముద్రవేయడం.. అక్కడ నుండి కక్ష్యపూరితంగా తనని టార్గెట్ చేయడం.. నడిరోడ్డుపై అర్ధనగ్నంగా ఒక వైద్యుడి పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించడం వెరసి అది జాతీయస్థాయిని మించి అంతర్జాతీయ మీడియాలో కూడా వార్తయి కూర్చుంది.

పైగా హైకోర్టు తొలి విచారణలో విశాఖ మేజిస్ట్రేట్ వాగ్మూలం.. డాక్టర్ పరిస్థితిపై ప్రభుత్వ నివేదిక సమయంలో కూడా ప్రభుత్వంపై అంత సీరియస్ వ్యవహారంలో లేదు. కానీ ఎంతకీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వెనకేసుకు రావడం.. చివరికి డాక్టర్ తల్లిని కూడా కొడుకును కలవనియ్యవకపోవడం వంటి ఘటనలతో కేసును సిబిఐకి అప్పగించేసింది. ఇక్కడ ప్రభుత్వం నిజాయతీగా ఉండి ఉంటే ఏ విచారణకైనా భయపడాల్సిన పనిలేదు.

అయితే, హైకోర్టు ఎప్పుడైతే సిబిఐ అన్నదో అధికార పార్టీలో అలజడి మొదలైంది. ఎవరికి వారు ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే క్రమంలో న్యాయమూర్తులను ఆక్షేపించడం మొదలుపెట్టారు. ప్రజలలో ముందు నుండే హైకోర్టుకు ప్రభుత్వంపై కక్ష అనేలా నమ్మకాన్ని కలిగించేందుకు పూనుకున్నట్లుగా కనిపించింది. చివరికి అది ఇలా మలుపు తిరిగి హైకోర్టు చరిత్రలోనే తనను ఆరోపించిన వ్యక్తులకు ఆ హైకోర్టే నోటీసులు పంపేవరకు వెళ్ళింది. మరి ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు ఉన్నాయో ఏమో!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle