newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

హైకోర్టుకు చేరిన ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం

16-11-201916-11-2019 17:04:47 IST
2019-11-16T11:34:47.598Z16-11-2019 2019-11-16T11:34:45.120Z - - 09-12-2019

హైకోర్టుకు చేరిన ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికింకా రాజధాని లేదు. విభజన జరిగి ఆరేళ్ళు గడిచినా రాష్ట్రానికి రాజధాని లేకపోడం ఏపీ ప్రజల దౌర్భాగ్యమే. ఈ మధ్యనే కేంద్రప్రభుత్వం విడుదల చేసిన సరికొత్త మ్యాప్ లో దేశంలోని అన్ని రాష్ట్రాలు.. వాటి రాజధానులు గుర్తించినా ఏపీకి అమరావతిని రాజధానిగా గుర్తించలేదు. అందుకు కేంద్రం చెప్పిన సాకులు ఇక్కడ అప్రస్తుతం.

గత ఐదేళ్లలో చంద్రబాబు సర్కార్ అమరావతిని రాజధానిగా చూపించి ప్రపంచస్థాయి ప్రణాళికలతో బేస్ మెంట్ వేసింది. అందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగింది. తాత్కాలిక భవనాలలో అక్కడి నుండే పాలన మొదలుపెట్టిన చంద్రబాబు శాశ్వత భవనాలను కూడా చివరి రెండేళ్లలో మొదలుపెట్టి కొంతమేర నిర్మాణం జరిగేలా చూశారు.

కాగా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వైసీపీ రాజధాని మీద అనుమానాలను ఓపెన్ గా చెప్పేసి తామో నిపుణుల కమిటీని నియమించామని ఆ కమిటీ చెప్పిన చోటే రాజధాని ఉంటుందని తెగేసి చెప్పారు. అందుకు ఓ సామజిక వంశాన్ని జోడించి కుల రాజధానిగా ముద్రవేసి ఓ వర్గం ప్రజానీకాన్ని నోళ్లు మూయించే ప్రయత్నం కూడా జరిగిపోయింది. ఫలితంగా ఇప్పుడు కథ మళ్ళీ మొదటికే వచ్చింది.

ఇప్పటివరకు అమరావతిలో జరిగిన పనులు, నిర్మాణాలు, ఖర్చు చేసిన నిధులు వాటి సంగతి మాకెందుకు అంటున్న ఈ ప్రభుత్వం కమిటీ నివేదిక రానివ్వండి అంటూ సాగతీస్తూనే ఉంది. ఫలితంగా ఏపీ రాజధాని ఎక్కడో కనీసం కాగితాలలో కూడా రాసుకోలేని పరిస్థితి. ప్రభుత్వం ఇన్నాళ్లు చేసిన ఈ ప్రకటనలు, అనుమానాలు, కమిటీలతో ప్రజలు అయోమయంలో ఉండగా ఇప్పుడు రాజధాని కేసు హైకోర్టుకు చేరింది.

ప్రభుత్వం నియమించిన కమిటీని చట్టవిరుద్దమంటూ రాజధానికి స్వచ్ఛదంగా భూములిచ్చిన రైతులు హైకోర్టులో వరస పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు కూడా ఆ పిటిషన్లను విచారణకు స్వీకరించింది. అసలే కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా అసలు హైకోర్టు ఎక్కడన్నదానిపై కూడా వివాదాన్ని సాగతీస్తున్న ప్రభుత్వం మీద హైకోర్టు కూడా గుర్రుగానే ఉన్న సంగతి తెలిసిందే.

విచారణకు తీసుకున్న పిటిషన్లపై హైకోర్టు రాష్ట్రప్రభుత్వంతో పాటు కేంద్రానికి కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అమరావతి కోసం కేంద్రం 1500 కోట్లను కేటాయించడంతో పాటు అధికారికంగా ప్రధాని అమరావతికి శంఖుస్థాపన చేశారు. మరి కేంద్రం ఎలాంటి కౌంటర్ ఇస్తుందన్నది కూడా ఆసక్తిగా మారింది.

ఇప్పటికీ కమిటీల పేరు చెప్పి తప్పించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టుకు ఎలాంటి కౌంటర్ ఇవ్వనుందన్న చర్చ జరుగుతుండగా ఏది ఏమైనా ఇన్నాళ్లు రాష్ట్రంలో జరిగిన రాజధాని ఎక్కడ అనే వాదనలు ఇక నుండి హైకోర్టులో జరగనున్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయాలలో జోక్యం చేసుకొనే అధికారం లేని కోర్టులు మాత్రం పట్టుబట్టి ప్రజారాజధానిని కట్టించగలవా? జస్ట్ మరికొన్నాళ్లు వాదనలు అంతే!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle