newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

హామీలు మాఫీ... బడ్జెట్‌లో ఏపీకి టోపీ

01-02-201901-02-2019 16:11:25 IST
Updated On 01-02-2019 16:50:35 ISTUpdated On 01-02-20192019-02-01T10:41:25.420Z01-02-2019 2019-02-01T10:41:21.681Z - 2019-02-01T11:20:35.570Z - 01-02-2019

హామీలు మాఫీ... బడ్జెట్‌లో ఏపీకి టోపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మళ్ళీ యావత్ ఆంధ్ర ప్రజానీకం మోసపోయింది. నాలుగున్నరేళ్ళుగా జరిగిందే మళ్ళీ రిపీట్ అయింది. అరుణ్ జైట్లీ.. పీయూష్ గోయెల్... ఆర్థికమంత్రి మారినా.. ఏపీకి మాత్రం ఈసమెత్తు న్యాయం జరగలేదు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఆర్ధికమంత్రి పీయూష్ గోయెల్ ప్రసంగంలో ఎక్కడా ఏపీ ప్రస్తావన లేదు. తెలుగు ఎంపీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోన్న విభజన హామీలు కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరికీ కేటాయింపులు, విశాఖ రైల్వే జోన్, రాష్ట్రానికి పన్నుల్లో రాయితీలు, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు ఇలాంటి వాటిలో వేటికి పీయూష్ గోయెల్ పట్టించుకోలేదు. విశాఖకు రైల్వే జోన్ పక్కా అంటూ రెండు, మూడు రోజులుగా కొందరు బీజేపీ నేతలు చేసిన హడావుడితో ఎన్నికలు కాబట్టి ఇస్తారు కాబోలు అని సగటు ప్రజలు ఆశపడ్డారు. కానీ మోడీ ప్రభుత్వం వాటిపై చన్నీళ్లు చల్లింది. 

ఏపీ పట్ల కేంద్రం నిర్లక్ష్యంపై ఏపీలో అధికార టీడీపీ, ప్రజలు, ప్రజా సంఘాలు కేంద్రం తీరుపై మండిపడుతున్నాయి. బడ్జెట్ రోజే ఏపీలో ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపుమేరకు బంద్ జరుగుతోంది. ఒక పక్క బంద్.. మరోవైపు పార్లమెంట్‌లో బడ్జెట్. జనమంతా ఉత్కంఠగా టీవీల ముందు అతుక్కుపోయారు. కానీ మళ్ళీ మామూలే. విభజన హామీల ఊసేలేదు.

ఆర్ధికమంత్రి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం రోడ్డెక్కితే.. బడ్జెట్‌‌లో రాష్ట్రానికి న్యాయం చేసే అంశం ఒక్కటి కూడా లేకపోవడం దారుణం అన్నారు చంద్రబాబునాయుడు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం స్పందించకపోవడం, ఏపీ ప్రస్తావనే లేకపోవడం విచారకరం. మళ్ళీ రాష్ట్రానికి అన్యాయమే జరిగిందన్నారు చంద్రబాబు.

ఎప్పుడూ పసుపు చొక్కాలు, గోధుమ రంగు దుస్తుల్లో కనిపించే ఏపీ సీఎం.. ఈసారి నల్ల చొక్కాలో దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని, అందుకు నిరసనగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న రోజు చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ నల్ల చొక్కాల్లో అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ బంద్‌కు ఉద్యోగ, ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. అయితే వైసీపీ, జనసేన, బీజేపీ బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. మరోవైపు బంద్‌కు టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. అత్యవసరమైతే తప్ప బంద్‌లో పాల్గొనకూడదనేది తమ పార్టీ విధానమని, ఈ బంద్‌లో తాము పాల్గొనడం లేదని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రం తీరుకి నిరసనగా ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి 13వ తేదీ వరకు నిరసన దినాలు పాటించనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన చంద్రబాబునాయుడు ఢిల్లీలో ఒక రోజు దీక్షకు దిగుతారు. ఫిబ్రవరి 12న అఖిలపక్ష నేతలు ఢిల్లీకి వెళతారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను కలిసి రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని చంద్రబాబు వివరించనున్నారు. మొత్తం మీద ఏపీ విషయంలో మోడీ తన వైఖరిని మరోసారి చాటుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle