newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

హయ్యారే.. అన్నగారి క్యాంటీన్లే సచివాలయాలు!

29-09-201929-09-2019 09:43:35 IST
2019-09-29T04:13:35.059Z29-09-2019 2019-09-29T04:13:33.104Z - - 27-02-2020

హయ్యారే.. అన్నగారి క్యాంటీన్లే సచివాలయాలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో పక్కా భవనాలలో ఎక్కడా వెనుకాడకుండా కేవలం ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం-రాత్రికి భోజనం అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మూతపడిన సంగతి తెలిసిందే. కొందరు నేతలు పేదలతో కలిసి అన్నం తినే కంచం పట్టుకొని ఆ క్యాంటీన్ల ముందు నిలబడి.. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టండి మహాప్రభో అని వేడుకున్నా.. 'అన్నా' అనే పదం నచ్చకపోతే 'రాజన్నా' అని మార్చుకోండి కానీ పస్తులు మాత్రం పెట్టొద్దని మేధావులు మొత్తుకున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంచెం టైం కావాలని మెల్లగా జారుకుంది.  వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక గత ప్రభుత్వ గుర్తులను చెరిపేసి క్రమంలో ఆ అన్నా క్యాంటీన్లను కూడా పట్టించుకోలేదు.

క్రమేపీ గత ప్రభుత్వంలో చేసుకున్న కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయక మెల్లగా ఒక్కొక్కటి మూతపడ్డాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదన్నా.. అవునన్నా ఇది నిజం. ఆమాటకొస్తే ప్రభుత్వంలోకొచ్చిన అన్ని పార్టీలకు ఈ తరహా చేష్టలు మామూలే. గత ప్రభుత్వాలు చేసిన పనుల ముద్ర చెరిపేయడం ప్రస్తుత ప్రభుత్వాలకు అలవాటే. అయితే అన్నా క్యాంటీన్ల ఏర్పాటులో రాజకీయంను మించి పేదవాడి ఆకలి అనే సెంటిమెంటు బలంగా ఉంది.

ప్రతిపక్ష టీడీపీతో పాటు ప్రజల నుండి వ్యతిరేకత వచ్చినా జగన్ ప్రభుత్వం వెనుకాడలేదు. ఆ క్యాంటీన్లలో అవకతవకలు పెరుకుపోయాయని.. పనికిరాని ప్రదేశాలలో ఉచితంగా పెట్టినా తినేవారు ఉండరని.. కొద్దిరోజులు ఓపికపడితే మెరుగుపరిచి.. రంగులు మార్చి సరికొత్త పేరుతో మీ ముందుకు తెస్తామని కొందరు ప్రభుత్వ పెద్దలు ఊరడింపు మాటలు చెప్పుకొచ్చారు.

రోజులు గడిచినా రంగులు మారినా ఆకలి తీర్చే ఆ కేంద్రాలు మాత్రం తెరుచుకోలేదు. అంతఖర్చు పెట్టి కట్టిన భవనాలు ఎందుకు పనికిరాకుండా నిరుపయోగం ఉండడం చూడలేకపోతుందో.. లేక అంతకుమించిన బిల్డింగులు దొరకలేదో కానీ ప్రభుత్వం అన్నాక్యాంటీన్లను సచివాలయాలుగా మార్చేందుకు సిద్ధమైందని తెలిసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్రామసచివాలయ వ్యవస్థ అక్టోబర్ 2 నుండి ప్రారంభం కానుంది.

ఇందుకు గాను గ్రామ పంచాయతీ కార్యాలయాలనే గ్రామ సచివాలయాలుగా మారుస్తున్నప్పటికీ.. పట్టణాల్లో మాత్రం వసతి దొరకడం లేదు. అనుకూల స్థలం, ఆఫీసుకు బిల్డింగ్ కష్టమవడంతో ఆ క్యాంటీన్లను వార్డు సచివాలయాలుగా మార్చేసేందుకు సిద్ధమైంది. మంచి డిజైన్‌తో రూపొందించిన అన్నక్యాంటీన్లలో కొద్దిగా మార్పులు చేసి లోపల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే అదే వార్డు సచివాలయం అవుతుందని తేల్చారు.

ఇప్పటికే నెల్లూరు టౌన్‌లో ఉన్న పలు అన్న క్యాంటీన్లలో వార్డు సచివాలయాల కోసం ఫర్నీచర్ అమర్చడం ప్రారంభించగా ఇదే మాదిరి మిగతా పట్టణాలలో కూడా మార్పులు మొదలుకానున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి సచివాలయ వ్యవస్థకు పక్కా భవనాలు.. ఏమో మళ్ళీ ఐదు రూపాయలు పట్టుకెళ్లి ఆకలి తీర్చుకోవచ్చని ఆశపడే పేదవాళ్లకి ఒకే సమాధానం వచ్చేసింది! ఆ క్యాంటీన్లు ఇక ఏ పేరుతోనూ మళ్ళీ తెరుచుకోడం కష్టమే!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle