newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

హమ్మయ్య ఫ్రైడే హాజరు నుంచి విముక్తి

25-11-201925-11-2019 08:27:13 IST
2019-11-25T02:57:13.453Z25-11-2019 2019-11-25T02:56:58.176Z - - 04-08-2020

హమ్మయ్య ఫ్రైడే హాజరు నుంచి విముక్తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు రిలీఫ్ ఇచ్చింది. ప్రతి శుక్రవారం అక్రమాస్తుల కేసులో ఆయన హైదరాబాద్ కోర్టుకి హాజరు కావలసి వచ్చేది. అయితే తాజాగా సీబీఐ స్పెషల్ కోర్టు సీఎం జగన్‌కు తీపికబురు చెప్నింది. ఇకనుంచి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  అక్రమ ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో బిజీగా ఉన్నందున ప్రతి శుక్రవారం అమరావతి నుంచి హైదరాబాద్ రావడం వెళ్లడం వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారమని కోర్టుకి విన్నవించారు జగన్. 

అక్రమాస్తుల కేసులో తనను వ్యక్తిగత హాజరు నుండి మినహాయించమని జగన్ ఇప్పటికే సీబీఐని అనేక సార్లు కోరిన సంగతి తెలిసిందే. దీనిపై వాదోపవాదాలు జరిగాయి. జగన్ సీఎం హోదాలో ఉండడం వల్ల  సాక్షులను ప్రభావితం చేస్తారని మినహాయింపు ఇవ్వవద్దని సీబీఐ కోర్టుని కోరింది. సీబీఐ వాదనలతో కోర్టు గతంలో ఏకీభవించిన కోర్టు అందుకు అనుమతి ఇవ్వలేదు. తాజాగా సీబీఐ కోర్టు జగన్ అభ్యర్ధనను మన్నించింది.

ఈ కేసుల విచారణలో భాగంగా సీఎం జగన్ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు హాజరు కానవసరం లేదని కోర్టు పేర్కొంది. అక్రమ ఆస్తుల ఆరోపణలపై సీబీఐ దాఖలు చేసిన కేసులో వైయస్ జగన్ 2011 నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల విషయంలో 16 నెలలు చంచల్ గూడ జైలులో కూడా ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.

1వైయస్ జగన్ ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నారు. జగన్ మినహాయింపుల కోరడం గురించి గతంలో విమర్శలు కూడా వచ్చాయి. జగన్ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఈ కేసు దాఖలయిందని, సీఎం హోదాకు దానికి సంబంధం లేదని విపక్షాలు కూడా విమర్శించాయి. చివరాఖరికి సీబీఐ కోర్టు మినహాయింపు ఇవ్వడంతో వైసీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle