newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

‘హంగ్’ తప్పదా? పవన్ కింగ్ మేకరా?

27-03-201927-03-2019 08:40:04 IST
Updated On 28-03-2019 17:09:18 ISTUpdated On 28-03-20192019-03-27T03:10:04.060Z27-03-2019 2019-03-27T03:09:07.864Z - 2019-03-28T11:39:18.556Z - 28-03-2019

‘హంగ్’ తప్పదా? పవన్ కింగ్ మేకరా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‌ఏపీలో జరుగుతున్న ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరెన్ని సీట్లు గెలుస్తారనేది అంతుచిక్కడం లేదు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హంగ్‌ తప్పదని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీదే కీలక పాత్ర కానుందని జనసేన కీలక నేతలు పేర్కొంటున్నారు. ఎన్నికల్లో జనసేనకు 50కుపైగా అసెంబ్లీ సీట్లు ఖాయమని ధీమాతో ఉంది జనసేన.

ఏపీలో మే 23 తర్వాత వైసీపీ, తెలుగుదేశంలలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని నెలకొల్పినా జనసేన సహకారం తప్ప‌దంటున్నారు. జనసేన లేకుండా 2019లో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమని పవన్ అభిమానులు, జనసేన కీలకనేతలు అంటున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో మార్పు రావాలని అన్ని వర్గాలు ఆశిస్తున్నాయని, ఈ ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర అంటున్నారు పవన్. యువత, మహిళలు జనసేనకు అండగా ఉన్నారని పవన్ ఎప్పటినుంచో చెబుతున్నారు.

ఈసారి ఓటర్లలో 17శాతం కొత్తగా ఓటు హక్కు పొందిన వారే ఉన్నారు. వీరిలో సగం మంది ఓటువేసినా జనసేన అభ్యర్ధుల విజయావకాశాలు మెరుగుపడతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం పవన్  జనసేనకు మూడంకెలు (3, 12, 21, 30) గల సీట్లు వస్తాయని జ్యోతిష్యులు చెబుతుండడాన్ని ఆ పార్టీ నేతలు ఉటంకిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle