newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

స‌స్పెన్ష‌న్ కోసం వెయిటింగ్ అంట‌..!

22-12-201922-12-2019 09:37:10 IST
Updated On 23-12-2019 12:15:09 ISTUpdated On 23-12-20192019-12-22T04:07:10.617Z22-12-2019 2019-12-22T04:06:59.664Z - 2019-12-23T06:45:09.479Z - 23-12-2019

 స‌స్పెన్ష‌న్ కోసం వెయిటింగ్ అంట‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌కు, అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు దూరం పెరిగిపోతోంది. జ‌న‌సేన‌కు రాపాక గుడ్‌బై చెప్పే స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్లే క‌నిపిస్తోంది. అయితే, తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ త‌ర‌హాలో సేఫ్ గేమ్ ఆడేందుకు, పార్టీకి దూర‌మైనా అన‌ర్హ‌త వేటు ప‌డ‌కుండా ప‌క్కా వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు. తాను పార్టీ మార‌కుండా, పార్టీనే త‌న‌ను స‌స్పెండ్ చేసేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇటీవ‌ల గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ టీడీపీపై, చంద్ర‌బాబుపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఆయ‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. దీంతో అసెంబ్లీలో ప్ర‌త్యేక స‌భ్యుడిగా అన‌ర్హ‌త వేటు ప‌డ‌కుండా కూర్చుంటున్నారు. ఇప్పుడు రాపాక వ‌ర‌ప్ర‌సాద్ కూడా ఇదే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఇటీవ‌ల ఆయ‌న జ‌న‌సేన పార్టీపై, అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టారు.

జ‌న‌సేన పార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైఖ‌రి స‌రిగా లేద‌ని, త‌న‌ను ఎప్పుడూ గౌర‌వించ‌లేద‌ని, ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అంతేకాదు, త‌న పార్టీ లైన్‌కు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆలోచ‌న‌ల‌ను తీవ్రంగా విభేదిస్తున్నారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. జ‌గ‌న్ తీసుకునే ప్ర‌తీ నిర్ణ‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప్పు ప‌డుతుంటారు.కానీ, రాపాక వ‌ర‌ప్ర‌సాద్ మాత్రం జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థిస్తున్నారు.

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే జ‌గ‌న్‌ను కీర్తించిన రాపాక అప్పుడే వైసీపీలోకి వెళ‌తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆయ‌న జ‌న‌సేన‌లోనే కొన‌సాగారు. ఇటీవ‌ల మ‌ళ్లీ రాపాక వైఖ‌రిలో మార్పు వ‌చ్చింది. ఇంగ్లీష్ మీడియంను త‌ప్ప‌నిస‌రి చేస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తుండ‌గా రాపాక మాత్రం ఈ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించారు.

తాజాగా, ఆయ‌న జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంత‌కుముందు కూడా ఆయ‌న ఇదే ప‌ని చేశారు. జ‌న‌సేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఇలా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌లుకుతుండ‌టాన్ని జ‌న‌సైనికులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. రాపాక ఇక త‌మ‌కు దూర‌మైన‌ట్లేన‌ని జ‌న‌సేన నేత‌లు కూడా ఒక నిర్ధార‌ణ‌కు వ‌చ్చేశారు.

అయితే, జ‌న‌సేన కూడా రాపాక వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు ర‌చిస్తోంది. ఆయ‌న విమ‌ర్శ‌ల‌ను ఓపిక‌గా భ‌రిస్తోంది. రాపాక‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తే ఎస్సీ ఎమ్మెల్యేను బ‌హిష్క‌రించార‌నే విమ‌ర్శల‌ను మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తుంది.

అందుకే, రాపాక విష‌యంలో ఇంకా వేచి చూసే ధోర‌ణిలో జ‌న‌సేన ఉంది. అయితే, రాజోలు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీలో ఇంఛార్జి బొంతు రాజేశ్వ‌ర‌రావు, అమ్మాజి గ్రూపులు ఉన్నాయి. ఇందులో అమ్మాజీ గ్రూప్ రాపాక‌తో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉండ‌గా బొంతు వ‌ర్గం మాత్రం పార్టీలోకి ఆయ‌న రాక‌ను వ్య‌తిరేకిస్తోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle