newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

స‌మ‌యం లేదు మిత్ర‌మా..!

11-03-201911-03-2019 07:17:46 IST
2019-03-11T01:47:46.449Z11-03-2019 2019-03-11T01:46:53.773Z - - 20-09-2019

స‌మ‌యం లేదు మిత్ర‌మా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు శంఖారావం మోగింది. తొలి విడ‌త‌లోనే రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. స‌రిగ్గా నెల రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు ఉంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల‌కు పార్టీల‌న్నీ సిద్ధ‌మ‌వుతున్నాయి. అభ్య‌ర్థుల ఎంపికపై అధినేత‌లు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు చాలా వ‌ర‌కు పూర్త‌య్యింది. రెండు పార్టీలూ 120 నుంచి 130 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశాయి.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎప్పుడైనా నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి రోజు వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌ని చంద్ర‌బాబు నాయుడు ఈసారి అంద‌రి కంటే ముందున్నారు. నెల రోజుల నుంచే అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు ప్రారంభించిన ఆయ‌న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల వారిగా నేత‌ల‌తో స‌మీక్షా స‌మావేశాలు ఏర్పాటు చేశారు.

స‌ర్వేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల ప‌నితీరు, ఇత‌ర స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో పెట్టుకుని అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తూ వ‌చ్చారు. ఇప్ప‌టికే సుమారు 120 స్థానాల‌కు ఆయ‌న అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. వారికి ప్ర‌చారం చేసుకోవాల్సిందిగా గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చేశారు. దీంతో వారంతా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం కూడా మొద‌లుపెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు ఫైన‌ల్ చేసిన అభ్య‌ర్థుల‌తో రెండు రోజుల్లో ఆయ‌న ఫ‌స్ట్ లిస్ట్ విడుద‌ల చేయ‌నున్నారు.

మిగ‌తా స్థానాల ఎంపిక మాత్రం చంద్ర‌బాబుకు క‌త్తి మీద సాములా మారింది. ఇందులో చాలా వ‌ర‌కు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే త‌మ‌కే టిక్కెట్ అని చెప్పుకుంటున్నారు. వీరిపై పోటీ చేసి ఓడిన వారు కూడా త‌మ‌కే టిక్కెట్లు ఇవ్వాల‌ని అధినేత‌పై ఒత్తిడి తెస్తున్నారు. రేప‌టి నుంచే ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌పై చంద్ర‌బాబు దృష్టి పెట్టి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు.

ఇక‌, అభ్య‌ర్థుల ఎంపిక‌పై వైసీపీ కూడా ముందుజాగ్ర‌త్త‌గానే వ్య‌వ‌హ‌రిస్తోంది. జ‌గ‌న్ ఇప్ప‌టికే చాలా నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేశారు. ఆయ‌న కూడా 120 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి అభ్య‌ర్థులు ఎవ‌ర‌నేది ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. రెండుమూడు రోజుల్లో వీరితో మొద‌టి లిస్ట్ విడుద‌ల చేయ‌నున్నారు. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఆయ‌న క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌లో మాత్రం మ‌రో ప్ర‌ధాన పార్టీ జ‌న‌సేన పూర్తిగా వెన‌క‌బ‌డిపోయింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా రెండుమూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. అవి మిన‌హా మిగ‌తా స్థానాల‌కు అభ్య‌ర్థుల‌పై డైల‌మా కొన‌సాగుతోంది. స్వ‌యానా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేయ‌నున్న స్థానంపైనే ఒక క్లారిటీ లేదు. పైగా వామ‌ప‌క్షాల‌తో పొత్తు చ‌ర్చ‌లు కూడా ఒక కొలిక్కి రాలేదు. మొత్తానికి టీడీపీ, వైసీపీ ఎన్నిక‌ల ర‌ణంలో ప‌రుగులు తీస్తుండ‌గా జ‌న‌సేన చాలా వెనుక‌బ‌డిన‌ట్లు క‌నిపిస్తోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle