newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

స్వామి ఆశీస్సులు ఉంటే కింగ్ అయిన‌ట్లేనా..?

05-06-201905-06-2019 08:26:32 IST
2019-06-05T02:56:32.480Z05-06-2019 2019-06-05T02:56:20.680Z - - 20-09-2019

స్వామి ఆశీస్సులు ఉంటే కింగ్ అయిన‌ట్లేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవ‌లి కాలంలో విశాఖ‌ప‌ట్నం శార‌దాపీఠం త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల‌ రాజ‌కీయ వ‌ర్గాల్లో శార‌దాపీఠం, పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి హాట్ టాపిక్ అయ్యారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులు నేరుగా శారదా పీఠానికి వెళ్లి ద‌ర్శించుకోవ‌డం, స్వ‌రూపానంద ఆశీస్సులు తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఫామ్ హౌజ్ లో రాజ‌శ్యామ‌ల యాగం జ‌రిగింది. స్వ‌రూపానందేంద్ర ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం ఘ‌నంగా నిర్వ‌హించారు. త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేసీఆర్ తిరుగులేని విజ‌యాన్ని సాధించారు. దీంతో ఆయ‌న వెంట‌నే విశాఖ వెళ్లి పీఠాన్ని ద‌ర్శించుకొని స్వ‌రూపాందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకొని వ‌చ్చారు.

ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో స్వ‌రూపానందేంద్ర నిత్యం చ‌ర్చ‌ల్లో ఉంటున్నారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు ఆయ‌న ఆ ప్ర‌భుత్వ విధానాల‌ను బాహాటంగానే విమ‌ర్శించారు. ఆల‌యాల కూల్చివేత‌, టీటీడీ వ్య‌వ‌హారాల్లో టీడీపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన ఆయ‌న మొద‌టి నుంచీ వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని బ‌లంగా కోరుకున్నారు.

ఈ మేర‌కు జ‌గ‌న్ ను ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం రుషీకేష్ తీసుకెళ్లి ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. జ‌గ‌న్ ను అధికారానికి చేరువ చేసిన పాద‌యాత్ర‌కు కూడా ఆయనే ముహూర్తం పెట్టారు. జ‌గ‌న్ కు సైతం ఆయ‌నంటే విప‌రీత‌మైన న‌మ్మ‌కం ఏర్ప‌డింది. మొత్తానికి స్వామి కోరిక నెర‌వేరి జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే జ‌గ‌న్ ఆయ‌న‌కు ఫోన్ చేసి ఆశీస్సులు తీసుకున్నారు.

అంతేకాదు, జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి, ఇప్పుడు మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారానికి సైతం స్వ‌రూపానందేంద్ర ముహూర్తం పెట్టారు. ఇక‌, జ‌గ‌న్ నిన్న విశాఖ‌ప‌ట్నం వెళ్లి పీఠాన్ని సంద‌ర్శించారు. ఆయ‌న‌ను స్వామి ఆప్యాయంగా ద‌గ్గ‌ర‌కు తీసుకొని ఆశీర్వ‌దించారు. త‌ర్వాత పీఠంలోని రాజశ్యామ‌ల అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అధికార యోగాన్ని క‌ట్ట‌బెట్టే రాజశ్యామ‌ల అమ్మ‌వారి ఆల‌యం తెలుగు రాష్ట్రాల్లో కేవ‌లం శారదాపీఠంలో మాత్ర‌మే ఉంది.

ఇక‌, కేవ‌లం కేసీఆర్, జ‌గ‌న్ మాత్ర‌మే కాదు.. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అనేక మంది ఎన్నిక‌ల‌కు ముందు స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇందులో టీడీపీ అభ్య‌ర్థులు సైతం ఉన్నారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర జిల్లాల నుంచి పోటీ చేసిన వారిలో ఇంచుమించు అంద‌రు నేత‌లూ స్వ‌రూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. 

ఇక‌, గెలిచాక సైతం ఎమ్మెల్యేలు అక్క‌డ‌కు క్యూ క‌ట్టారు. మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న చాలామంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్వ‌రూపానందేంద్ర స్వామి ఆశీస్సులు, రాజ‌శ్యామ‌ల దేవి అమ్మ‌వారి క‌రుణ కోసం శార‌దాపీఠానికి వెళుతున్నారు. మొత్తంగా శార‌దాపీఠానికి వెళ్లి వ‌స్తే రాజ‌కీయంగా తిరుగుండ‌ద‌నే భావ‌న నేత‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle