newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

స్వరూపానందకు జగన్ ఫోన్.. స్వామీజీ ఆశీస్సులు

23-05-201923-05-2019 12:34:36 IST
Updated On 26-06-2019 17:44:33 ISTUpdated On 26-06-20192019-05-23T07:04:36.131Z23-05-2019 2019-05-23T07:04:34.562Z - 2019-06-26T12:14:33.462Z - 26-06-2019

స్వరూపానందకు జగన్ ఫోన్.. స్వామీజీ ఆశీస్సులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల్లో ప్రభంజనం సృ‌ష్టించారు జగన్. దీంతో ఈనెల 30న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు ఉదయం 10: 45 నిముషాలకు ముహుర్తంగా నిర్ణయించారు. ఈనెల 25న వైసీపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ఈ మీటింగ్ జరగనుంది. ఇదిలా ఉంటే మే 30న ఏకాదశి కూడా కావడంతో మంచిరోజని భావించి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ జాతక ప్రకారం కూడా ఆ రోజు బావుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ముహుర్తంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీతో కూడా జగన్ ఫోన్‌లో  మాట్లాడినట్లు సమాచారం. 

తొలుత 26వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని భావించారు. కానీ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సూచనల మేరకే జగన్ తన ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది.కొంతకాలంగా ఇలాంటి అంశాల్లో ఎక్కువగా స్వరూపానంద సూచనలు పాటిస్తున్న వైసీపీ అధినేత... ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తం విషయంలోనూ ఆయన సలహానే పాటించారని... అందుకే ముందుగా అనుకున్న ముహూర్తాన్ని కాదని కొద్ది రోజులు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా స్వరూపనందేంద్ర స్వామికి వీర భక్తుడు. ఆయన చెప్పినట్టుగానే యాగాలు చేశారు. రెండోసారి కేసీఆర్ సీఎం అయ్యారు. కేసీఆర్ బాటలోనే జగన్ పయనిస్తున్నారు. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ అన్నట్టుగానే రిటర్న్ గిఫ్ట్ లభించిందని టీఆర్ఎస్ నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా కామెంట్లు చేస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle