newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

స్వరూపానందకు చంద్రబాబుకి ఎందుకు చెడింది?

04-07-201904-07-2019 08:27:33 IST
Updated On 04-07-2019 10:52:41 ISTUpdated On 04-07-20192019-07-04T02:57:33.113Z04-07-2019 2019-07-04T02:56:42.463Z - 2019-07-04T05:22:41.259Z - 04-07-2019

 స్వరూపానందకు చంద్రబాబుకి ఎందుకు చెడింది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇద్దరు తెలుగురాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ పీఠాధిపతులకు సాష్టాంగ ప్రణామాలు చేయడం అందరికీ తెలిసిందే. గత ఐదేళ్ళ నుంచి వీరి మధ్య గురుశిష్య బంధంలా మారిపోయింది.

వీరిద్దరూ తనకు ప్రాణ సమానమని చెప్పుకున్నారు స్వరూపానంద. తాజాగా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి సంచలన ఆరోపణలు చేశారు. నదీహారతులు, పథకాల పేరుతో టీడీపీ ప్రభుత్వం వృధా ఖర్చు చేసిందని మండిపడ్డారు. 

ఈ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.  గతంలోని చంద్రబాబు సర్కార్ అన్ని జల వనరులను ఒకేసారి పూజించుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నదులు, వాగులు, నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెక్‌డ్యామ్‌లు, చెరువుల దగ్గర నుంచి పంటకుంటల వరకు ప్రతి జలవనరులకు ప్రణామం చేసే కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించారు. నదుల అనుసంధానం అంటూ పట్టిసీమను చేపట్టారు చంద్రబాబు.అప్పట్లో చంద్రబాబు తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. 

గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో నదులకు హారతి ఇవ్వడం మొదలుపెట్టారు చంద్రబాబు. అయితే ఈ కార్యక్రమాల వల్ల ప్రజాధనం వృథా అయ్యిందని స్వరూపానంద స్వామి ఆరోపిస్తున్నారు.

వీటిపై సమగ్ర విచారణ చేయాలని జగన్ ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తీరుపై స్వరూపానంద వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి, స్వరూపానంద ఆరోపణలపై జగన్ విచారణ చేయిస్తారా? స్వామి వారంటే జగన్ కు ఎంతో భక్తి.. దేవుడే కోరితే భక్తుడు చేయకుండా ఉంటారా? 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle