newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకి డీజీపీ దిశానిర్దేశం

16-05-202016-05-2020 10:01:21 IST
Updated On 16-05-2020 10:27:29 ISTUpdated On 16-05-20202020-05-16T04:31:21.975Z16-05-2020 2020-05-16T04:30:55.216Z - 2020-05-16T04:57:29.683Z - 16-05-2020

స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకి డీజీపీ దిశానిర్దేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంపూర్ణ మద్య నిషేధం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టే దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ పరిధిని తగ్గించింది. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకి దిశానిర్దేశం చేశారు ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్. రాష్ట్రంలో ఇసుక మరియు మద్యం అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపే దిశగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పేరుతో అక్రమ ఇసుక రవాణా మరియు అక్రమ మద్యాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ఇప్పటికే  ఉత్తర్వులను జారీ చేసింది. 

మద్యం పాలసీని పటిష్టంగా అమలు చేసే దిశగా ఈ కొత్త  డిపార్ట్ మెంట్ కి  ఐపీఎస్ అధికారి నేతృత్వంలో జవసత్వాలు నింపి ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా  కొత్త శాఖను  కార్యోన్ముఖం చేసే దిశగా వడి వడి గా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో డీజీపీ  గౌతమ్ సవాగ్ , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్  వినీత్ బ్రిజ్ లాల్ ఆధ్వర్యంలో  మొట్ట మొదట వీడియో కాన్ఫరెన్స్ డీజీపీ ఆఫీస్ లో నిర్వహించారు. ఇందులో , లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ రవి శంకర్ అయ్యన్నార్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు, జిల్లా ఎస్పీలు , ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీలు, అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో విధి విధానాలను జిల్లాల ఎస్పీ లకు వివరించారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏర్పాటు ముఖ్య ఉద్దేశం, పనితీరు, ఎస్‌పి లతో  చర్చించారు. ఇసుక అక్రమ తవ్వకాల నివారణ,  అక్రమ మద్యం తయారీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఆకస్మిక దాడులను నిర్వహించడం, ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయడం, నిందితులను న్యాయస్థానంలోకి ప్రవేశపెట్టడం, కేసు దర్యాప్తు, ఛార్జిషీట్లను రూపొందించడం, నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లను జారీచేయడం, పీడీ యాక్టులను ప్రయోగించడం ప్రాధాన్యతా అంశాలుగా ముందుకు వెళ్లాలని డీజీపీ దిశా నిర్దేశం చేశారు.  మెరుగైన ఫలితాలను సాధించేందుకు విప్లవాత్మక చర్యలను తీసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ డిపార్ట్ మెంటులో ఉన్న ఉద్యోగులను 70 శాతం స్పెషల్ ఎన్మఫోర్స్ మెంట్ బ్యూరో కి, మిగతా 30 శాతం ఎక్సైజ్  కు  ఉద్యోగులను బదలాయింంచిన విషయాన్ని తెలియ చేస్తూ, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కి బదలాయించిన ఉద్యోగులను మరియు పోలీసు శాఖ సిబ్బంది మధ్య సమన్వయం చేసుకుంటూ మంచి ఫలితాలను సాధించాలని డీజీపీ ఆకాంక్షించారు. ఖాళీలను భర్తీ చేయడానికి కాలానుగుణంగా నోటిఫికేషన్లను జారీ చేసే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కమిషనర్ ఆదేశాలతో, అన్ని జిల్లాల ఎస్పీలు ఆధ్వర్యంలో, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో  అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా వున్న 475 శాండ్ రీచులు, స్టాక్ యార్డుల ను తనిఖీ చేశారు. అక్కడ ఉన్న వే బ్రిడ్జిలు, సీసీ కెమెరాల పని తీరు, చెక్ పోస్ట్ ల నిర్వహణ పై ఆరా తీశారు. ఈ సందర్భంగా కేవలం కొన్ని ప్రదేశాలలో వే  బ్రిడ్జిలు పని చేస్తున్న విషయాన్ని  గుర్తించి, సంబంధిత అధికారులను దీనికి సంబంధించి రిపోర్ట్ పంపవలసినదిగా ఆదేశాలిచ్చారు. కేవలం 128 ప్రదేశాల్లో సీసీ కెమెరాలు పని చేస్తున్న విషయాన్ని గుర్తించి, మిగతా ప్రదేశాల్లో వెంటనే  సీసీ  కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

 

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

   9 hours ago


వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

   13 hours ago


అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

   16 hours ago


టీడీపీ కొత్త టీమ్

టీడీపీ కొత్త టీమ్

   16 hours ago


తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

   17 hours ago


కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

   18 hours ago


మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

   19 hours ago


బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

   19 hours ago


పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

   19 hours ago


ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle