newssting
BITING NEWS :
*సమ్మెపై మధ్యవర్తిత్వానికి కెకె రెడీ.. స్వాగతించిన ఆర్టీసీ జేఏసీ *అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

స్పందన వర్క్‌షాపుల పట్ల అధికారులు స్పందిస్తారా!

19-09-201919-09-2019 12:55:37 IST
Updated On 19-09-2019 12:58:37 ISTUpdated On 19-09-20192019-09-19T07:25:37.015Z19-09-2019 2019-09-19T07:25:19.877Z - 2019-09-19T07:28:37.265Z - 19-09-2019

స్పందన వర్క్‌షాపుల పట్ల అధికారులు స్పందిస్తారా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పందన కార్యక్రమం కోసం రాష్ట్ర స్థాయిలో వర్క్‌షాపులను నిర్వహించనుంది. వీటితో పాటు జిల్లాల స్థాయిలో అక్టోబర్ నెలలో మరో రెండు వర్క్‌షాపులను నిర్వహించనున్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా, సత్వర ప్రాతిపదికన విని పరిష్కరించడానికి స్పందన ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 24, 27 తేదీల్లో రెండు రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‍లను నిర్వహించనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజలు లేవనెత్తిన సమస్యలు ఆరోపణలపై మానవతా దృక్పథంతో అధికారులు స్పందించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అధికారులను ప్రేరేపించడమే ఈ వర్క్‌షాపుల లక్ష్యం. మునిసిపల్ కమిషనర్లు, తహసిల్దారులు, ఎంపీడీవోలు ఈ వర్క్‌షాపులకు హాజరు కానున్నారు.

మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో స్పందనపై సమీక్షా సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. జూనియర్ ఆఫీసర్ల నైతిక స్థైర్యాన్ని పెంపొందించటానికి జిల్లా కలెక్టర్లు కూడా ఈ వర్క్‌షాపుల్లో పాల్గొనాలని సూచించారు.

రాష్ట్ర స్థాయి వర్క్‌షాపులతో పాటు, అక్టోబర్‌లో మరొకరెండు జిల్లా స్థాయి వర్క్‌షాపులను కూడా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో సామాజిక గణనకు అమిత ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లోని బోర్డులపై రేషన్ కార్డుదారులు, పింఛను పథకం లబ్ధిదారుల వివరాలను అధికారులు పొందుపర్చాలని సీఎం కోరారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను కూడా వీటిలో చేర్చాలని చెప్పారు.

అలాగే వైఎస్సార్ కంటి వెలుగు పథకంద్వారా రాష్ట్రంలోని 5.3 కోట్లమంది ప్రజలు లభ్దిపొందుతారని, దీన్ని ఆరుదశల్లో అమలు చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. తొలిదశను అక్టోబర్ 10 నుంచి 16 తేదీలవరకు ప్రారంభిస్తామని దాదాపు 70 లక్షల మంది విద్యార్థులు కంటి పరీక్షలు చేయించుకుంటారు. రెండో దశను నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 దాకా నిర్వహించనున్నారు. ఇక మిగిలిన నాలుగు దశలను 2020 ఫిబ్రవరి నుంచి అమలు చేయనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేపట్టాలని సీఎం ఆదేశించారు. తొలిదశలో లబ్ధిదారులను గుర్తిస్తారు. దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు. ప్రభుత్వం స్క్రీనింగ్ పరీక్షలకు, కంటద్దాల పంపిణీకి, కేటరాక్ట్ సర్జరీ, తదితర కార్యక్రమాలకు రూ. 560 కోట్లను వైఎస్సార్ కంటివెలుగు కోసం కేటాయించింది. 

రాష్ట్ర ఆదాయ పరిస్థితి అత్యంత హీనంగా ఉన్న నేపథ్యంలో స్పందనతో సహా వివిధ భారీ పథకాల అమలుకు అవసరమైన భారీ నిధులను ఎలా సేకరిస్తారన్నదే అసలు సమస్య. అక్టోబర్ నుంచి పాలన అంటే ఎలా ఉండాలో చూపిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని పథకాలకూ నిధుల కొరత లేకుండా చివరి వరకు కొనసాగించడం కత్తిమీద సాముగానే ఉండవచ్చు. పథకాల అమలులో ప్రజలు అసమ్మతికి గురి కానంతవరకు ఏ ప్రభుత్వమైన సేఫ్ సైడ్‌లో ఉంటున్నట్లే లెక్క. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అసలు పరీక్ష అక్టోబర్ నుంచే మొదలు కానుంది మరి.

Image result for AP govt spandana programme

 

 

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

   6 hours ago


అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

   11 hours ago


కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

   13 hours ago


 కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

   14 hours ago


ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

   14 hours ago


‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

   14 hours ago


సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

   14 hours ago


పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

   15 hours ago


మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

   16 hours ago


సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle