newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

స్థానిక సమరం... ఆపరేషన్ ఆకర్ష్‌తో మరింత రసవత్తరం

09-09-201909-09-2019 08:49:55 IST
Updated On 09-09-2019 08:49:52 ISTUpdated On 09-09-20192019-09-09T03:19:55.892Z09-09-2019 2019-09-09T03:19:00.969Z - 2019-09-09T03:19:52.931Z - 09-09-2019

స్థానిక సమరం... ఆపరేషన్ ఆకర్ష్‌తో మరింత రసవత్తరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మంచి ఊపు మీదున్న అధికార వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారు. అందులోనూ భవిష్యత్తు గురించి బెంగతో ఉన్న టీడీపీ నేతలు ఆకర్షించే పనిలో వున్నారు.

ఇందులో భాగంగా వైసీపీ ఆకర్ష్ కు తెరలేపింది. ప్రతిపక్షాల రెండో శ్రేణి నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఏపీలో వార్డు మెంబర్ నుంచి జెడ్పీ దాకా, కౌన్సిలర్ నుంచి మున్సిపల్ ఛైర్మెన్ దాకా అన్ని స్థానాలు గెలుచుకోవాలని అధికార వైసీపీ భావిస్తోంది.,

ఇందులో భాగంగా విపక్షాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వంపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా వైసీపీ నేతలు విశాఖ జిల్లానే టార్గెట్ చేశారు.  విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి.

అందులో భాగంగతా విశాఖ డైయిరీ ఛైర్మన్ అడారి తులసీ రావు కుమారుడు అడారి ఆనంద్, కూతురు రమాకుమారితో ఇతర నాయకులు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. జగన్ పాలన బాగుందని, పేదలు, అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తుండడంతో వైసీపీలో చేరినట్లు చెప్పారు.

త్వరలో టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ వలసలు ఉంటాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల జోస్యం చెప్పారు. ప్రజాభిమానం లేక, 23 సీట్లకే పరిమితం అయిన టీడీపీ నేతలు ఏం చేయాలో తోచక ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. తమ ఓటమికి ఆత్మవిమర్శ చేసుకోకపోవడం, పాత ధోరణిలోనే ముందుకు వెళ్ళడం కారణంగా క్యాడర్ నైరాశ్యానికి గురవుతోంది. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు వైసీపీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 

విశాఖ జిల్లా మాదిరిగానే ఇతర జిల్లాల్లో టీడీపీ పరిస్థితి వుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించే కొద్ది వైసీపీ ఆకర్ష్ వేగం కానుంది. దీనికితోడు బీజేపీ కూడా టీడీపీ నేతల్ని తమ పార్టీలో చేర్చుకునేందుకు తలుపుల్ని బార్లా తెరిచింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle