newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

స్థానిక నినాదం సెంటిమెంటా...ఉన్మాదమా?

14-08-201914-08-2019 15:38:18 IST
Updated On 20-08-2019 12:41:41 ISTUpdated On 20-08-20192019-08-14T10:08:18.324Z14-08-2019 2019-08-14T10:07:56.465Z - 2019-08-20T07:11:41.734Z - 20-08-2019

స్థానిక నినాదం సెంటిమెంటా...ఉన్మాదమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘స్థానిక’ సెంటిమెంటును రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నమే తప్ప ఆ సెంటిమెంట్ జనంలో బలపడితే దేశ సమగ్రత, సమైక్యతకు కలిగే ముప్పు గురించి ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. స్థానికులకు ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాల డిమాండ్ వరకూ ఓకే కానీ...స్థానిక నినాదం ఉన్మాదం స్థాయికి చేరకుంటేనే సమస్య.

అమెరికాలో ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదం కానీ, ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ కానీ ఈ ఉన్మాదం కోవలోనికే వస్తాయి. 

పరిశ్రమల స్థాపన అన్నది ఒక రాష్ట్రంలో మౌలిక వసతులు పెరగడానికి, రాష్ట్ర సంపద పెరిగేందుకు దోహదపడుతుంది. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే వారు తమ లాభాలను కూడా దృష్టిలో ఉంచుకుంటారు. నైపుణ్యం, ప్రతిభ కలిగిన వారినే ఉద్యోగులుగా తీసుకుంటారు. తమ పరిశ్రమలో ఉద్యోగాలలోనికి ఎవరిని తీసుకోవాలన్నది తమ విచక్షణ, ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉండాలని భావిస్తారు.

అయితే అదే సమయంలో రాష్ట్రంలో భూమి , నీరు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో స్థానికులకు అవకాశం ఇవ్వాలని కోరడం సహజం. కానీ ఏకంగా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అన్న డిమాండ్ రాష్ట్రానికి పరిశ్రమలను దూరం చేసే అవకాశం ఉండటమే కాకుండా, ఆ డిమాండ్ తో ఇప్పటికే ఉన్న పరిశ్రమలలో కూడా ఉద్యోగాలను కల్పించాలంటూ ఆందోళనలు తలెత్తే అవకాశం కూడా ఉంది. 

పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు పారిశ్రామికంగా వెనుకబాటులో ఉండటానికి ఇటువంటి డిమాండ్లే కారణమని పలువురు రాజకీయ నాయకులే పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. 

బెంగళూరు, చెన్నై పారిశ్రామికంగా పురోగతిలో వేగం పుంజుకోవడానికి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ కు ఐటీ పరిశ్రమ తరలిరావడానికి ప్రభుత్వాలు కల్పించిన సౌకర్యాలు, వెసులు బాట్లు విధానాలే కారణం. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే సంపద పెరుగుతుంది. దానిని పేదల లబ్ధికి, ప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుంది. 

అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక పురోగతి విషయాన్ని పక్కన పెట్టి పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడే పరిస్థితికి పెట్టుబడిదారులు చేరుకునే పరిస్థితి వచ్చింది. కానీ రాజకీయంగా స్థానిక నినాదం ప్రయోజనం కలిగిస్తుందన్న భావనతో పార్టీలూ, వాటి అధినేతలూ ఆ నినాదాన్నే పట్టుకు వేలాడుతున్నారు. తాజాగా కర్నాటకలో కూడా ఆ నినాదంతో రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఇవి దేశ మంతటా వ్యాపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది.

ఇది దేశ భద్రతకు, పురోభివృద్ధికి దోహదం చేసే పరిణామం కాదు. రాష్ట్రాలు వేరైనా అన్నీ ఒక దేశంలోనే ఉన్నాయి. అవకాశాలు దేశమంతటా పుష్కలంగా ఉన్నాయి. ఆ విషయాన్ని స్థానిక సెంటిమెంటును రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించే పార్టీలూ నేతలూ గమనించాల్సిన అవసరం ఉంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle