newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

స్థానిక ఎన్నికలలో సైకిల్ జోరు.. ఉండవల్లి జోస్యం

30-10-201930-10-2019 09:03:21 IST
Updated On 30-10-2019 15:50:49 ISTUpdated On 30-10-20192019-10-30T03:33:21.839Z30-10-2019 2019-10-30T03:32:32.730Z - 2019-10-30T10:20:49.992Z - 30-10-2019

స్థానిక ఎన్నికలలో సైకిల్ జోరు.. ఉండవల్లి జోస్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం ఏపీలో టీడీపీ నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతోంది. ఎన్నికల ఫలితాలొచ్చి అర్ధ ఏడాది గడిచినా ఎందుకో అది ఆ పార్టీకి పచ్చిగాయంలా మెలిపెడుతూనే ఉంది. మరోపక్క అధికార వైసీపీ ఇంకా దెబ్బతీసేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి. కానీ అధినేత చంద్రబాబు మాత్రం మళ్ళీ తానే సీఎం అయితే బావుండని ప్రజలు కోరుకుంటున్నారని ఆయనకు ఆయన ఊహాచిత్రాలను గీసేసుకుంటున్నారు.

అంతటి నైరాశ్యంలో ఉన్న పార్టీకి కొద్దిగా ఊరట కలిగించేలా రాజశేఖరెడ్డికి అత్యంత సన్నిహితుడు.. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆప్తుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడిన ఉండవల్లి వచ్చే స్థానిక ఎన్నికలలో టీడీపీ జోరు పెరిగే అవకాశాలు ఉన్నాయని.. వైసీపీకి తిరుగుబాటు మొదలైందని జోస్యం చెప్పారు.

మొన్నటి సాధారణ ఎన్నికలలో వైసీపీకి క్షేత్రస్థాయిలో విపరీతమైన బలం ఉండి ఘనవిజయం రాలేదన్న అయన రాజశేఖరరెడ్డి మీద ఉన్న అభిమానం.. జగన్మోహన్ రెడ్డి ఇంకేదో చేస్తారన్న ఒక అవకాశం వర్క్ అవుట్ అయ్యాయన్నారు. ఆ మాటకొస్తే టీడీపీ క్షేత్రస్థాయిలో బలమున్న పార్టీ అని.. అందుకే మొన్నటి ఎన్నికలలో సీట్లు తక్కువే వచ్చినా నలభై శాతం ఓటింగ్ వచ్చిందని గుర్తు చేశారు.

స్థానిక ఎన్నికలలో క్షేత్రస్థాయి నిర్మాణం చాలా అవసరమని.. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ప్రజలలో మేధావి వర్గాన్ని ఆలోచనలో పడేశాయన్నారు.

ఉదాహరణకు ఓ ఉద్యోగి స్థాయి ప్రజావేదిక కూల్చివేతను సీఎం జగన్ స్వయంగా ప్రకటించడం.. కోడెల వ్యవహారంలో టీడీపీ అదేపనిగా వేధింపులని ప్రజలలోకి తీసుకెళ్లడంలో కొంత విజయవంతమైందన్నారు.

పల్నాడు వైసీపీ బాధితుల పునరావాసం.. సోషల్ మీడియా కేసులు.. చంద్రబాబు దగ్గర నుండి నిన్న రాజీనామా చేసిన ఎమ్మెల్యే వరకు అందరూ వైసీపీ మమ్మల్ని వెంటాడి వేధిస్తోందని ప్రచారం చేయడం.. అందుకు తగ్గట్లే పరిస్థితులు కనిపించడం టీడీపీకి ఎంతవరకు కలిసొస్తుందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం నష్టం చేకూర్చే అవకాశం ఉందన్నారు.

మొన్నటి ఎన్నికలలో రాజశేఖరరెడ్డి ఇమేజ్ చూసి ఓట్లేసినట్లే.. స్థానిక ఎన్నికలలో సవాలక్ష కారణాలుంటాయని.. అందుకు నిలబడే అభ్యర్థికి ఈ పరిస్థితులు తడైతే టీడీపీ పుంజుకునే అవకాశం కనిపిస్తుందని జోస్యం చెప్పారు.

అదే జరిగితే రాష్ట్రంలో టీడీపీకి నైతిక బలం పెరిగి వలసలు ఆగే అవకాశం ఉంటుంది. మరి స్థానిక సమరానికి ప్రభుత్వం ఇప్పుడు తెరదించుతుందా? కొర్రీలు పెట్టి అవకాశం కోసం వేచిచూస్తుందా?! 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle