newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

స్టీఫెన్ కోసం మ‌రోసారి రంగంలోకి దిగిన జ‌గ‌న్‌..!

18-10-201918-10-2019 13:01:33 IST
2019-10-18T07:31:33.068Z18-10-2019 2019-10-18T07:31:27.283Z - - 15-12-2019

స్టీఫెన్ కోసం మ‌రోసారి రంగంలోకి దిగిన జ‌గ‌న్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఆరు నెల‌లు కావొస్తుంది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారుల‌ను మార్చ‌డంతోపాటు కీల‌క‌మైన పోస్టుల్లో కొత్త వారిని నియ‌మించారు. డీజీపీగా గౌత‌మ్ స‌వాంగ్‌ను తీసుకొచ్చారు. ఇత‌ర ప్రాధాన్య పోస్టుల్లో కూడా కొత్త అధికారుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఐపీఎస్ అధికారుల బ‌దిలీలు ఇప్ప‌టి వ‌ర‌కు మూడు నాలుగుసార్లు జ‌రిగాయి. కానీ, ఒక పోస్టులో మాత్రం ఎవ‌ర్నీ నియ‌మించ‌డం లేదు. ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మాత్రం ఇంకా ఎవ‌ర్నీ నియ‌మించ‌లేదు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఐపీఎస్ అధికారి స్టీఫెన్ ర‌వీంద్ర‌ను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియ‌మించాల‌ని సీఎం జ‌గ‌న్ అనుకున్నారు.

తెలంగాణ కేడ‌ర్‌లో ఉన్న స్టీఫెన్ ర‌వీంద్ర డిప్యుటేష‌న్‌కు తెలంగాణ స‌ర్కార్ కూడా ఓకే చెప్పింది. డిప్యుటేష‌న్ కోసం కేంద్రానికి కూడా జ‌గ‌న్ లేఖ‌లు మీద లేఖ‌లు రాశారు. ఇక స్టీఫెన్ డిప్యుటేష‌న్‌కు కేంద్ర హోంశాఖ ఓకే చెప్ప‌లేదు. అప్ప‌ట్లో మూడు నెల‌లు సెల‌వుపెట్టిన స్టీఫెన్ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా చేరిపోవ‌డం ఖాయ‌మ‌నుకున్నారంతా, కానీ కేంద్ర హోంశాఖ ప‌ర్మీష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న తిరిగి తెలంగాణ‌కు వ‌చ్చారు. హైద‌రాబాద్‌లో త‌న‌కు కేటాయించిన పోస్టులో చేరిపోయారు. స్టీఫెన్ ర‌వీంద్ర రాక‌పోవ‌డంతో నిఘా విభాగాధిప‌తిగా కీల‌క‌మైన పోస్టుకు ప‌లువురి పేర్ల‌ను సీఎం జ‌గ‌న్ ప‌రిశీలించిన‌ట్టు తెలుస్తుంది.

ర‌వాణాశాఖ క‌మిష‌న‌ర్‌గా ఉన్న ఆంజ‌నేయుల‌తోపాటు ఇత‌ర ఐపీఎస్ అధికారుల బ‌యోడేటాలు జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాయ‌ట‌. అయితే జ‌గ‌న్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రికీ ఓకే చెప్ప‌లేద‌ట‌. ప్ర‌భుత్వానికి చెవులు, క‌ళ్లుగా ప‌నిచేసే ఇంటెలిజెన్స్ విభాగానికి బాస్‌ను జ‌గ‌న్ ఎందుకు నియ‌మించ‌డం లేద‌న్న‌ది స‌స్పెన్స్‌గా మారింది.

ఆరు నెల‌లుగా ఈ పోస్టుకు స‌మ‌ర్ధ‌వంత‌మైన అధికారి దొర‌క‌డం లేదా..?  లేక కావాల‌నే ఖాళీగా ఉంచుతున్నారా..? అన్న‌ది తెలియాల్సి ఉంది. మ‌రోప‌క్క‌ స్టీఫెన్ ర‌వీంద్ర కోసం జ‌గ‌న్ మ‌ళ్లీ కేంద్ర స్థాయిలో మ‌రోసారి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న ప్ర‌చార‌మూ జ‌రుగుతోంది.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle