newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

'స్టిక్కర్ సీఎం' జగన్మోహన్ రెడ్డి..!

09-10-201909-10-2019 11:10:41 IST
Updated On 09-10-2019 12:46:26 ISTUpdated On 09-10-20192019-10-09T05:40:41.101Z09-10-2019 2019-10-09T05:40:35.462Z - 2019-10-09T07:16:26.762Z - 09-10-2019

'స్టిక్కర్ సీఎం' జగన్మోహన్ రెడ్డి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ సీఎంగా అవతరించారట. ఇప్పటికే సోషల్ మీడియాలో హైలీ రెస్పెక్టెడ్ సీఎం అంటూ ఓ హాష్ ట్యాగ్ తో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నెగటివ్ పోస్టులు తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు స్టిక్కర్ సీఎం అంటూ మరో హాష్ ట్యాగ్ రావడం గ్యారంటీగా కనిపిస్తుంది. దీనికి కారణం ఈమధ్యనే సీఎం జగన్ ఏపీలో వైఎస్ఆర్ వాహన మిత్ర పేరుతో ఓ పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా దాదాపుగా లక్షా డెబ్భైవేల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పదివేల ఆర్ధిక సహాయం అందించారు.

ఆ పథకం ప్రారంభంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ మీ ఆటోలపై సీఎం బొమ్మలు అతికించుకోండి మిమ్మల్ని ఆపేవాడే లేడంటూ చేసిన వ్యాఖ్యలు అప్పుడే దుమారం రేపాయి. అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గలేదు. అన్నట్లుగానే రాష్ట్రంలో తిరిగే అన్ని ఆటోలు, క్యాబ్లకు సీఎం జగన్ స్టిక్కర్లు అంటించేశారు. ఆ బాధ్యతను కూడా పోలీసులకే అప్పజెప్పడం విశేషమైతే పోలీసులు ఏ మాత్రం సిగ్గుపడకుండా రోడ్ల మీదకి వచ్చేసి వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి స్టిక్కర్లను అంటించేశారు. అసలే పోలీసులు ఎందుకొచ్చిన గొడవలని పాపం డ్రైవర్లు పథకంలో డబ్బులు రానివాళ్లు సైతం స్టిక్కర్లను అంటిస్తున్నా చూస్తుండిపోయారు.

పోలీసులు దౌర్జన్యంగా ఆటోలను ఆపి స్టిక్కర్లను వేయడం కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అటు ప్రభుత్వం.. ఇటు పోలీసులు కూడా విమర్శల పాలవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పోలీసుల పాలన నడుస్తుందంటూ విమర్శలు చేస్తుండగా ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆఖరికి పోలీసులను ఇలా కూడా వాడుకుంటున్నారని కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ వీడియోలపై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సర్కార్ ను తీవ్రంగా తప్పు పట్టారు. చంద్రబాబును గతంలో బీజేపీ స్టికర్ సీఎం పేరుతో పిలుస్తుండగా ఇప్పుడు జగన్ కొత్త స్టిక్కర్ సీఎం అయ్యారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అప్పుడు చంద్రబాబు కేంద్ర పథకాలకు స్టిక్కర్ వేసి తమ పథకాలుగా చెప్పుకున్నారని.. ఇప్పుడు జగన్ అసలు పథకాలు అందని వాళ్లకు కూడా స్టిక్కర్లు వేసి తమ గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. అసలు పోలీసులను మీ పార్టీ కార్యకర్తలలాగా వాడుకోవడం ఏమిటని కన్నా తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే గ్రామ సచివాలయాలకు, రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసి ఏకంగా కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఇప్పటికే కేంద్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి రంగుల వ్యవహారంపై రాష్ట్ర నేతలను నివేదిక కూడా కోరినట్లుగా తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో మరోసారి ఈ స్టిక్కర్ల వ్యవహారం కూడా ఏపీ బీజేపీ నేతలకు చిర్రెత్తుకొచ్చింది. రాష్ట్రంలో సర్కార్ పోతున్న వింతపోకడలను ఏ మాత్రం సహించని బీజేపీ నేతలు స్టిక్కర్ల వ్యవహారంపై కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు. కాగా ఇప్పటికే సోషల్ మీడియాలో సీఎం జగన్ పై నెగటివ్ పోస్టుల జాబితాలో ఎక్కువగా చక్కర్లు కొట్టిన వాటిలో ఈ స్టిక్కర్ల వీడియోలు కూడా చేరగా హైలీ రెస్పెక్టెడ్ సీఎం హ్యాష్ ట్యాగ్ మాదిరే స్టిక్కర్ సీఎం అనే మరో హ్యాష్ ట్యాగ్ రావడం కూడా పక్కాగా కనిపిస్తోంది. టీడీపీ-బీజేపీ సోషల్ మీడియా వింగ్స్ ఈ పాటికే ప్రిపరేషన్స్ లో ఉండేఉండాలి సుమీ!

కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

కేసీయార్‌‌‌ని జగన్ లైట్ తీసుకుంటున్నారా?

   a minute ago


కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   2 hours ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   2 hours ago


అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

   2 hours ago


ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

   2 hours ago


కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

   3 hours ago


కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

   4 hours ago


వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   16 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   18 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle