newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

సోష‌ల్ మీడియా వార్‌లో విజృంభిస్తున్న టీడీపీ.. కానీ..?

22-08-201922-08-2019 08:03:13 IST
Updated On 22-08-2019 08:10:47 ISTUpdated On 22-08-20192019-08-22T02:33:13.883Z22-08-2019 2019-08-22T02:32:44.240Z - 2019-08-22T02:40:47.071Z - 22-08-2019

సోష‌ల్ మీడియా వార్‌లో విజృంభిస్తున్న టీడీపీ.. కానీ..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో గ‌త రెండు ఎన్నిక‌ల నుంచి సోష‌ల్ మీడియా ప్ర‌భావం చాలా పెరిగిపోయింది. 2014లో తెలుగుదేశం పార్టీ, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో సోష‌ల్ మీడియా ఒక‌టి. మీడియా బ‌లం త‌క్కువ‌గా ఉన్న వైసీపీ గ‌త ఐదేళ్లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై సోష‌ల్ మీడియా వేదిక‌గానే వైసీపీ ప్ర‌చారం చేసి స‌క్సెస్ అయ్యింది.

ఈ విష‌యాన్ని తెలుగుదేశం పార్టీ బాగానే గ్ర‌హించిన‌ట్లుంది. అందుకే వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి టీడీపీ సైతం సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకొని పెద్ద ఎత్తున ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఏకంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ టీడీపీ సోష‌ల్ మీడియా బాధ్య‌త‌లు తీసుకున్నారు. ట్విట్ట‌ర్‌లో ఆయ‌న చెల‌రేగిపోతున్నారు.

ప్ర‌తీ రోజూ మూడు నాలుగు ట్వీట్లు చేస్తూ వైసీపీ ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు సైతం ప్ర‌తీ రోజు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే, ఈ ట్వీట్ల‌పై వైసీపీ విమ‌ర్శ‌లు ప‌క్క‌న‌పెడితే సోష‌ల్ మీడియాలో మాత్రం వైసీపీ కంటే ఇప్పుడు టీడీపీ స్పీడ్ పెంచింది. జ‌గ‌న్‌ను ఒక విఫ‌ల ముఖ్య‌మంత్రిగా చూపించేందుకు సోష‌ల్ మీడియాలో లోకేశ్ టీమ్ బాగానే ప్ర‌య‌త్నం చేస్తోంది.

అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి కేవ‌లం మూడు నెలు మాత్ర‌మే కావ‌డం.. ఇంత‌లోనే టీడీపీ సోష‌ల్ మీడియా పెద్ద ఎత్తున వ్య‌తిరేక ప్ర‌చారం మొద‌లు పెట్ట‌డం ప‌ట్ల వైసీపీ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. కాగా, సోష‌ల్ మీడియాలో విజృంభిస్తున్న టీడీపీ అక్క‌డ‌క్క‌డా త‌ప్పులు కూడా చేస్తోంది. అంగ‌న్‌వాడి కార్య‌క‌ర్త‌లు మొద‌ట జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశార‌ని, ఇప్పుడు శ‌వ‌యాత్ర చేస్తున్నార‌ని చెబుతూ ఓ ట్వీట్ చేశారు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు.

అయితే, ఈ ట్వీట్ కోసం చంద్ర‌బాబు పోస్ట్ చేసిన ఓ ఫోటో నాలుగేళ్ల క్రితం తెలంగాణ‌లో జ‌రిగిన ఆందోళ‌న‌కు సంబంధించిన ఫోటో. ఇది వైసీపీ సోష‌ల్ మీడియా గుర్తు ప‌ట్టేసి వైర‌ల్ చేయ‌డంతో చంద్ర‌బాబు త‌న ట్వీట్‌ను తొల‌గించుకోవాల్సి వ‌చ్చింది. తాజాగా వ‌ర‌ద‌పై టీడీపీ సోష‌ల్ మీడియా ప్ర‌చారంలోనూ కొన్ని త‌ప్పులు దొర్లుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. వైసీపీ శ్రేణులు ఈ త‌ప్పుల‌ను పెద్ద ఎత్తున ఎత్తి చూపుతుండ‌టంతో టీడీపీకి అస‌లుకే మొసం వ‌స్తోంది.

వ‌ర‌ద వ‌ల్ల త‌మ‌కు న‌ష్టం జ‌రిగింద‌ని, ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కొంద‌రు ఆరోప‌ణ‌ల చేసిన‌ వీడియోల‌ను టీడీపీ అనుకూలురు వైర‌ల్ చేశాయి. అయితే, ఈ వీడియోల్లో కనిపించిన వారు గ‌తంలో టీడీపీ ఎన్నిక‌ల ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించిన‌ట్లు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇలా జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డంలో చాలా వేగంగా ఉన్న టీడీపీ సోష‌ల్ మీడియా కొన్ని త‌ప్పులు దొర్లుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. మొత్తంగా అయితే, లోకేశ్ టీమ్ సోష‌ల్ మీడియాలో విజృంభిస్తుంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle