newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

సోషల్ మీడియా ప్రచారంపై సర్కార్ సీరియస్

20-08-201920-08-2019 16:49:57 IST
2019-08-20T11:19:57.488Z20-08-2019 2019-08-20T11:19:55.859Z - - 15-09-2019

సోషల్ మీడియా ప్రచారంపై సర్కార్ సీరియస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని అసత్యప్రచారం చేస్తున్నాయని మండిపడింది. ఏపీపీ పేపర్ మిల్స్ పెట్టుబడి పోతోందని వస్తున్న వార్తల్ని పరిశ్రమల శాఖ స్పందించింది. ఆ సంస్థతో చర్చలు జరుగుతున్నాయని, ఓ సెక్షన్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని వివరణ ఇచ్చింది.

రాష్ట్రంలో పరిశ్రమలు తరలిపోతున్నాయన్న కథనాలపై పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ ఖండించారు. ఈ దుష్ప్రచారాన్ని చేసిన వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడానికి పారదర్శక విధానాలను అవలంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులకు స్వర్గ దామంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసియా పల్ప్, పేపర్ కంపెనీ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రతినిధులతో చర్చిస్తున్నామని, ప్రస్తుతం సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దని స్పష్టం చేశారు.

రీ టెండరింగ్ వల్ల రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెనక్కి వెళుతున్నాయని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల ను సమీక్షించాలని నిర్ణయించిన సమయం నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇచ్చిన వివరణ ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle