newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

సోషల్ మీడియాలో వల్లభనేని జంపింగ్ కన్ఫ్యూజన్.!

26-10-201926-10-2019 14:10:33 IST
Updated On 26-10-2019 17:44:38 ISTUpdated On 26-10-20192019-10-26T08:40:33.916Z26-10-2019 2019-10-26T08:40:30.057Z - 2019-10-26T12:14:38.789Z - 26-10-2019

సోషల్ మీడియాలో వల్లభనేని జంపింగ్ కన్ఫ్యూజన్.!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కృష్ణాజిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు సోషల్ మీడియాలో కన్ఫ్యూజింగ్ లీడర్లలో ఒకరయ్యారు. అయితే కన్ఫ్యూజన్ ఆయనకు కాదు. రాష్ట్రంలోని పొలిటికల్ వర్గాలే అయనపై తెగ తికమకపడిపోతున్నాయి. జిల్లాలో యంగ్ అండ్ డైనమిక్, పవర్ లీడర్లలో ఒకరిగా వంశీకి పేరుంది. దివంగత నేత పరిటాల రవీంద్రకు సన్నిహితుడిగా మొదలైన వంశీ పొలిటికల్ కెరీయర్ లో చాలాసార్లు మాస్ లీడరుగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అటు సినిమా వాళ్ళతో సహవాసం.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా వంశీకి ఓ బ్రాండ్ పేరుంది.

మొన్నటి సాధారణ ఎన్నికలలో ఫ్యాన్ గాలి తుఫాన్ పెనుగాలిగా మారి విరుచుకుపడడంతో రాష్ట్రంలో మాజీ మంత్రులు, మహాయోధులు సైతం ఓటమి పాలయ్యారు. అయితే వంశీ మాత్రం 838 ఓట్ల స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. కాగా ఈ మధ్య కాలంలో తన వ్యాపార వ్యవహారాల మీద దృష్టి పెట్టిన వల్లభనేని పార్టీ కార్యక్రమాలకు కొద్దిగా దూరంగానే ఉంటున్నారు. ఏదో గట్టి అవసరమైతే తప్ప నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యక్రమాలలో చురుగా ఉండడం లేదు.

ఈ సమయంలోనే గత ప్రభుత్వ హయంలో ఎమ్మెల్యే వల్లభనేని నకిలీ ఇళ్ల పట్టాలను సృష్టించి పేద ప్రజలకు ఇచ్చారని ఆయనపై కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని హనుమాన్‌జంక్షన్‌ పోలీసుస్టేషన్‌లో ఎన్నికల సమయంలో పేదలకు నకిలీ పట్టాలు మంజూరుచేశారనే అభియోగంపై అక్టోబరు 18న ఎమ్మెల్యే వంశీతోపాటు మరో 9 మందిపై కేసు రిజిస్టర్‌ చేశారు. దీనిపై వంశీ టెక్నీకల్ ఆధారాలను సేకరించి మీడియా ఎదుట బయటపెట్టి వైసీపీ ప్రభుత్వం తనకు టార్గెట్ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేత రవికుమార్, ఎమ్మార్వో, డీఎస్పీ కలిసి తనపై తప్పుడు కేసులు బనాయించారని న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నామని కూడా చెప్పారు.

సరిగా కేసు వ్యవహారం జరిగిన రోజుల వ్యవధిలోనే వంశీ పార్టీ మారనున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందుకు తగ్గట్లే వంశీ బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరితో కలిసి ఏపీలో ఒకే కారులో చక్కర్లు కొట్టారు. దాదాపు రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్రంలో ఇసుక కొరతకు వ్యతిరేకంగా ప్రారంభించిన గాంధీ సంకల్ప యాత్రలో వంశీ సుజానాతో కలిసి పర్యటించారు. అక్కడే వంశీకి ఆహ్వానాలు అందాయని ఇక కమలం కండువా కప్పుకోవడం ఒక్కటే మిగిలివుందని ఇంటా బయటా ప్రచారం జరిగిపోయింది.

అందుకు తగ్గట్లే వంశీ సుజనాతో కలిసేందుకు కొన్ని గంటల ముందే కార్యకర్తలు, నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. దాదాపు గంటల పాటు చర్చ అనంతరం వంశీ పార్టీ మారే ప్రసక్తే ఉందని కొట్టిపారేశారు. కానీ సుజానాతో భేటీపై మాత్రం బెజవాడ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అయింది. సుజనాతో భేటీ ప్రకంపనలు తగ్గక ముందే వంశీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం పొలిటికల్ సర్కిల్స్ లో కన్ఫ్యుజింగ్ గా మారింది.

వంశీ తన పాత స్నేహితుడు, మంత్రి కొడాలి నాని, వైసీపీ ఎంపీ బాలసౌరితో కలిసి బెజవాడ నుండి తాడేపల్లి సీఎం నివాసానికి వెళ్లి జగన్మోహన్ రెడ్డితో కలిశారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నారు అన్నది ఆసక్తిగా మారగా వంశీ దాదాపుగా వైసీపీకి చేరడం ఖాయం అంటూ మరో ప్రచారం మొదలైంది. త్వరలోనే రాజీనామాకు కూడా వంశీ సిద్దమైపోయారని ఊహాగానాలు మొదలయ్యాయి.

మొత్తం నాలుగు రోజుల వ్యవధిలోనే వల్లభనేని బెజవాడ రాజకీయాలలో అలజడి రేపారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలలో తన సన్నిహిత నేతలతో అయన జరిపిన భేటీలు దేనికి సంకేతమో కానీ అయన రాజకీయ వ్యూహం ఏంటన్నది సోషల్ మీడియా పుకార్ల రాయుళ్లకి పండగలా మారింది. అవి చూసే సోషల్ మీడియా ఫాలోవర్లకు కన్ఫ్యూజనే మిగిలింది. ఇక ఆయన సన్నిహితులైతే ఇది కేవలం తనపై అక్రమ కేసులు బనాయించారని నిరూపించడం కోసమే జరిగిన భేటీ అంటూ తేలిగ్గా కొట్టిపారేయిస్తున్నారు. మరి వంశీ ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు తీరుస్తారో!!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle