newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

సోము వీర్రాజుకే బీజేపీ పగ్గాలు..కన్నాకు జాతీయస్థాయి పదవి

28-07-202028-07-2020 08:12:16 IST
Updated On 28-07-2020 08:12:09 ISTUpdated On 28-07-20202020-07-28T02:42:16.150Z28-07-2020 2020-07-28T02:40:36.425Z - 2020-07-28T02:42:09.608Z - 28-07-2020

సోము వీర్రాజుకే బీజేపీ పగ్గాలు..కన్నాకు జాతీయస్థాయి పదవి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎట్టకేలకు బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా సోము వీర్రాజుని నియమించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈమేరకు నియామకపు ఉత్తర్వులు జారీచేశారు. ఆదినుంచి బీజేపీకి సేవలు అందిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష పదవి కావాలని కోరుకున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా వున్నా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు జాతీయ స్థాయిలో కీలక పదవి ఇస్తారని భావిస్తున్నారు. 

Image

ఏపీలో ఎప్పటినుంచో అధ్యక్ష పదవి ఎంపిక వాయిదాపడుతూ వచ్చింది. నిజానికి మార్చి నెలలోనే అధ్యక్షుడి నియామకం జరుగుతుందని భావించినా, కరోనా లాక్ డౌన్ కారణంగా పార్టీపై కేంద్రం అంతగా ఫోకస్ పెట్టలేదు. తూర్పు గోదావరి జిల్లా కత్తేరు గ్రామం సోము వీర్రాజు స్వస్థలం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన.. దశాబ్దాలుగా సంఘ్‌ పరివార్‌లో కొనసాగారు. గతంలోనే సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి.. చేతికి అందినట్టే అంది చేజారింది. ప్రస్తుతం ఆయన ఏపీ మండలిలో సభ్యునిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

ఆయనకు పదవి లభించడంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాస్త దుందుడుకు స్వభావం వున్న సోము వీర్రాజు వల్ల పార్టీ కేడర్లో ఉత్తేజం కలుగుతుందని భావిస్తున్నారు. అధ్యక్ష పదవి కోసం అనేకమంది పోటీలో వున్నారు. ఇప్పటివరకూ అధ్యక్షుడిగా వున్న కన్నా లక్ష్మీనారాయణ కూడా తనకు మరోసారి అవకాశం ఇస్తారని భావించారు. దాదాపు రెండేళ్ల పాటు ఆయన పదవిలో ఉన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పార్టీ పెద్దలు.. అధ్యక్షుడి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కన్నా స్థానంలో ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజుకు పదవిని కట్టబెట్టింది.

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   9 minutes ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   an hour ago


మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

   14 hours ago


సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

   14 hours ago


ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

   16 hours ago


రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

   17 hours ago


మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

   19 hours ago


ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

   a day ago


కృష్ణానదిలో అంతకంతకూ పెరుగుతున్న వరద!

కృష్ణానదిలో అంతకంతకూ పెరుగుతున్న వరద!

   a day ago


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి సిపిఐ నేత రామకృష్ణ లేఖ

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి సిపిఐ నేత రామకృష్ణ లేఖ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle