newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

సోనియా గాంధీ టార్చ్ లైట్‌లో క‌నిపించ‌నున్న‌ది ఎవ‌రు..?

04-11-201904-11-2019 13:12:08 IST
Updated On 04-11-2019 16:18:01 ISTUpdated On 04-11-20192019-11-04T07:42:08.178Z04-11-2019 2019-11-04T07:42:05.746Z - 2019-11-04T10:48:01.556Z - 04-11-2019

సోనియా గాంధీ టార్చ్ లైట్‌లో క‌నిపించ‌నున్న‌ది ఎవ‌రు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా ఉంది. నాయ‌కులు ఉన్నారు కానీ.. ఆద‌రించేవారే లేకుండాపోయారు. వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో క‌నీసం ఒక్క స్థానాన్ని కూడా సాధించుకోలేక‌పోగా డిపాజిట్లు కూడా కోల్పోయిన ద‌య‌నీయ పరిస్థితి.

రాష్ట్ర విభ‌జ‌న నాటి నుంచి ఏపీ కాంగ్రెస్  అధ్య‌క్షుడిగా కొన‌సాగిన ర‌ఘువీరారెడ్డి ఆ త‌రువాత రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేయ‌గా, దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీలు రాజీనామాలు చేసేశారు. అదే స‌మ‌యంలో ఏపీపీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా కూడా రాజీనామ చేయ‌డం, దానిని ఏఐసీసీ ఆమోదించ‌డంతో ఆ ప‌ద‌వి ఖాళీ అయింది.

ఖాళీగా ఉన్న ఏఐసీసీ ప‌ద‌విలో కొత్త‌వారిని కూర్చోబెట్టాల‌ని అధిష్టానం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇందు కోసం సెర్చ్ లైట్ చేతిలో ప‌ట్టుకుని మ‌రీ స‌మ‌ర్ధుడైన నాయ‌కుడి కోసం వెతుకులాట మొద‌లెట్టింది. అధిష్టాన ప్ర‌తినిధుల ఆధ్వ‌ర్యంలో అభిప్రాయాల సేక‌ర‌ణ జ‌రుగుతోంది.

అయితే, మునిగిపోయిన పార్టీని బ‌య‌ట‌కు తీసి ఒడ్డుకు చేర్చే స‌మ‌ర్ధ‌త ఉన్న లీడ‌ర్ అస‌లు ఎవ‌రున్నార‌న్న ఒక్క ప్ర‌శ్న ఉన్న కొద్దిపాటి లీడ‌ర్ల‌ను వేధిస్తోంది. ఒక‌వేళ వ‌చ్చినా పార్టీ అంత సుల‌భంగా మ‌ళ్లీ పుంజ‌కుంటుందా..? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

ఏదో ఒక పార్టీకి అధ్యక్షుడి హోదాలో ఉంటే రాజ‌కీయాలు బాగా చేయొచ్చు అనుకునేవారు త‌ప్ప అస‌లు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎవ‌రైనా ముందుకు వ‌స్తారా..? అని చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్ప‌టికైతే ఏదో ఒక ప‌ద‌వి ఉంటుంది క‌దా..? అని భావించే ఓ న‌లుగురు నాయ‌కులు మాత్రం ముందుకు వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది.

ఆ న‌లుగురిలో శైల‌జానాథ్, చింతా మోహ‌న్‌, ప‌ల్లంరాజు, సుంక‌ర ప‌ద్మ శ్రీ‌, ఇలా ఎవ‌రి ట్రైల్స్‌లో వారు ఏపీసీసీ ప‌ద‌వి రేసులో ఉన్నారు. సోనియా గాంధీ ఆదేశాల‌తో ప్ర‌స్తుతం ఏపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎంపిక జ‌రుగుతుంని కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్నారు. ఏపీలో ఉన్న ప‌రిస్థితులు కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో నాయ‌క‌త్వ ల‌క్షణాలు, పోరాటాలు చేసే నాయ‌కుల‌కే కాంగ్రెస్ అధిష్టానం పెద్ద‌పీట వేయ‌నుంది. 

 
 
 

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle