newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

సొంత పార్టీ మీదే నిఘా పెట్టారా?

20-03-201920-03-2019 08:56:18 IST
2019-03-20T03:26:18.283Z20-03-2019 2019-03-20T03:15:32.051Z - - 18-07-2019

సొంత పార్టీ మీదే నిఘా పెట్టారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టడం ఆనవాయితీ. అలా కాకుండా అధికార పార్టీనే స్వయానా తన అభ్యర్థుల మీద పోలీసు నిఘా పెట్టడాన్ని ఊహిస్తామా. కానీ చంద్రబాబు తాజా తీసుకున్న నిర్ణయం ఆ విధంగానే ఉందట. తన పార్టీ నేతల మీదే ఆయనకు నమ్మకం సన్నగిల్లుతోందట. ఎందుకంటే నెల్లూరు రూరల్ టిక్కెట్ దక్కించుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఊహించని రీతిలో వైసీపీలో చేరారు.

ఈ షాక్ నుంచి తేరుకోక ముందే చంద్రబాబుకు మరో షాక్ ఇచ్చారు శ్రీశైలం ఎంఎల్ఏ బుడ్డా రాజశేఖరరెడ్డి. గత ఎన్నికల్లో శ్రీశైలం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఈసారి కూడా ఆయనకే టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. టిక్కెట్ తీసుకున్న రాజశేఖరరెడ్డి ప్రచారానికి వెళ్లకుండా, ఫోన్ స్విచ్చాఫ్ చేశారట. చంద్రబాబుకు కూడా అందుబాటులో లేకుండా పోయారట.

ఇదే రీతిలో బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీ.సీ.జనార్థనరెడ్డి కూడా టిక్కెట్ తీసుకుని ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చున్నారట. తమ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని తెల్సుకున్న వీరు, అనవసరంగా ఖర్చు పెట్టడం ఎందుకని డిసైడ్ అయ్యారని కొందరు టీడీపీ నేతలు చెబుతున్న మాట. ఈ రెండు పరిణామాలను తెల్సుకున్న చంద్రబాబు ఇప్పుడు తన పార్టీ అభ్యర్ధుల మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. టిక్కెట్ తీసుకున్న వారు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అన్నది కూపీ లాగుతున్నారట. అంటే ఇంకా ఎంత మంది పార్టీని వీడతారో, ఎవరు టిక్కెట్ తీసుకుని సైలెంట్ అవుతారో అన్న భయం చంద్రబాబుకు పట్టుకున్నట్లు అర్థం అవుతోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle