newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

సొంత జిల్లా అంటే చంద్రబాబుకు చింత

26-03-201926-03-2019 08:29:21 IST
2019-03-26T02:59:21.865Z26-03-2019 2019-03-26T02:59:18.691Z - - 22-07-2019

 సొంత జిల్లా అంటే చంద్రబాబుకు చింత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట.. మరి చిత్తూరు జిల్లా నారా కుటుంబానికీ ఎందుకు కంచుకోట కాలేకపోయింది. చివరికి చంద్రబాబు తన సొంత గడ్డ చంద్రగిరి నుంచి కర్నాటక బార్టర్లో ఉన్న కుప్పానికి వెళ్లిపోయారు. 35 ఏళ్లుగా కుప్పంలో పోటీ చేస్తున్నా ఇప్పటికీ చిత్తూరు జిల్లా పై పూర్తి స్థాయి పట్టుసాధించలేదు. అందుకు నిదర్శనం 2014 ఫలితాలు. 

14 నియోజకవర్గాలున్న చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ 8 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంలో విజయం సాధించగలిగింది. అదే కడప జిల్లాలో చూసినట్లయితే.. 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో 9 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. అలాగే రెండు పార్లమెంటు స్థానాలూ జగన్ పార్టీ ఖాతాలోనే పడ్డాయి.

ఈ ఫలితాలను విశ్లేషిస్తే.. తమ సొంత జిల్లాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న పట్టు ఏంటో అర్థం చేసుకోవచ్చు. మంత్రి లోకేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సొంత జిల్లా చిత్తూరు నుంచి కాకుండా గుంటూరు జిల్లా నుంచి పోటీ చేయడం వెనుక నారా కుటుంబానికి తమ జిల్లాపై పట్టులేకపోవడం, ఓటమి భయమే ప్రధాన కారణం. 

ప్రతి సంక్రాంతికీ నారావారిపల్లెకు వెళ్లి సంబరాలు చేసుకునే చంద్రబాబు కుటుంబం ఎన్నికలొస్తే మాత్రం సొంతూరుకు ముఖం చాటేస్తారు. ఇప్పటికీ సొంత జిల్లా ప్రజల్లో విశ్వసనీయత సాధించలేకపోవడంతో చిత్తూరు జిల్లా ప్రజలంటే చంద్రబాబుకు ఎప్పుడూ వెన్నులో వణుకేనని స్థానికంగా చెప్పుకుంటారు. ఈ ఎన్నికల్లోనూ చంద్రబాబు సొంత జిల్లాపై వైఎస్సార్సీపీ నాయకులదే పై చేయి.. ఈ సారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామన్న ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. కానీ ఇన్నిస్థానాలు గెలుస్తామని టీడీపీ నేతలు మాత్రం విశ్వాసంతో చెప్పలేకపోవడం గమనించాల్సిన అంశం. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle