newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

సైలెన్స్ కు కేరాఫ్ అడ్ర‌స్‌గా టీడీపీ ఎమ్మెల్యేలు..!

18-12-201918-12-2019 18:03:50 IST
Updated On 19-12-2019 12:12:14 ISTUpdated On 19-12-20192019-12-18T12:33:50.048Z18-12-2019 2019-12-18T12:33:47.885Z - 2019-12-19T06:42:14.722Z - 19-12-2019

సైలెన్స్ కు కేరాఫ్ అడ్ర‌స్‌గా టీడీపీ ఎమ్మెల్యేలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంగ‌ళ‌వారంతో ముగిసిన ఏపీ అసెంబ్లీ శీతాకాల‌ స‌మావేశాలు వాడివేడిగా జరిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జాస్వామ్య దేశంలో ప్ర‌భుత్వ ప‌క్షం, ప్ర‌తిప‌క్షం మ‌ధ్య స‌వివ‌ర‌మైన చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం ఆరోగ్య‌క‌ర‌మైన ప‌రిణామ‌మే. అయితే, ప్రతిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబుకు సొంత పార్టీ నుంచే స‌రైన వెన్నుద‌న్ను ల‌భించ‌లేద‌ని రాజకీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు 

ముఖ్య‌మంత్రితోపాటు, మంత్రులు, శాస‌న స‌భ్యులు అనే తేడా లేకుండా ప్ర‌భుత్వ ప‌క్షం నుంచి అనేక‌మంది మూకుమ్మ‌డిగా విరుచుకుప‌డుతుంటే ప్ర‌తిపక్ష టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉక్కిరిబిక్కిరి అయ్యార‌న్న‌ది వాస్త‌వం. త‌న ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వాన్ని ఉపయోగించి అధికార పార్టీపై ఒంట‌రిగానే పోరాడారు. 

అయితే, టీడీపీకి 23 మంది శాస‌న స‌భ్యులు ఉన్నా ఒక‌రిద్ద‌రు శాస‌న స‌భ్యులు మిన‌హా మిగిలిన వారెవ్వ‌రు కూడా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచిన‌వారే లేర‌ని చెప్పొచ్చు. దీనికిగల కార‌ణ‌మేంట‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీసింది. 

టీడీపీ 23 మంది శాస‌న స‌భ్యుల్లో గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ఇప్ప‌టికే స్పీక‌ర్ గుర్తించారు. మ‌రో మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు పార్టీప‌ట్ల అంటీఅంట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తూ దాదాపు శీతాకాల స‌మావేశాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. అలాగే పార్టీ వ్యూహ‌క‌ర్త‌గా పేరుపొందిన ప‌య్యావుల కేశ‌వ్ అనారోగ్యంతో స‌భ‌కు రాలేదు. అలాగే హీరో బాల‌కృష్ణ ఒక‌టి.. రెండు రోజులు స‌భ‌కు వ‌చ్చి త‌రువాత రావ‌డ‌మే మానేశారు. 

రోజూ స‌మావేశానికి వ‌చ్చిన శాన స‌భ్యుల్లో అచ్చెన్నాయుడు, రామానాయుడు, గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రివంటి ఇద్ద‌రు, ముగ్గురుత‌ప్ప మ‌రెవ్వ‌రూ కూడా చ‌ర్చ‌ల్లో పాల్గొన‌డం కానీ.. ప్ర‌భుత్వాన్ని చంద్ర‌బాబు విమ‌ర్శిస్తుంటే ఆయ‌న‌కు అండ‌గా నిల‌వ‌డం వంటివి చేయ‌క‌పోవడం గ‌మ‌నార్హం. 

గ‌త బ‌డ్జెట్ స‌మావేశాల్లో చురుగ్గా పాల్గొన్న అన‌గాని సత్య‌ప్ర‌సాద్, ఏలూరు సాంబ‌శివ‌రావు, గిరి, రామ‌రాజువంటి వారు ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయిపోయారు. గొట్టిపాటి ర‌వి వంటి వారు గ‌త స‌భ‌లో కాస్త హ‌డావుడి చేశారు. వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు, జోగేశ్వ‌ర‌రావు కూడా గత స‌భ‌ల్లో యాక్టివ్‌గానే పాల్గొన్నారు. తాజాగా ముగిసిన శాస‌న స‌భ స‌మావేశాల్లో మాత్రం మౌన మునిలా సైలెంట్ అయిపోయారు. 

చాలా కాలంగా టీడీపీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన గంటా శ్రీ‌నివాస‌రావు, హ‌ఠాత్తుగా స‌భా స‌మావేశాల‌కు వ‌చ్చి టీడీపీ వాకౌట్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొని సొంత పార్టీ నేత‌ల‌నే కాకుండా వైసీపీ శ్రేణుల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. ఆ త‌రువాత స‌భ‌లో క‌నిపించ‌డ‌మే మానేశారు. గంటా శ్రీ‌నివాస‌రావు వైసీపీలో చేరుతార‌న్న ప్రచారం ఎన్నో రోజు నుంచి జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ కార‌ణంగానే గంటా శ్రీ‌నివాస‌రావు స‌మావేశాల్లో చురుగ్గా పాల్గొన‌డం లేద‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. 

మ‌రోవైపు, గంటా శ్రీ‌నివాస‌రావు కోవ‌లోనే మిగ‌తా టీడీపీ శాస‌న స‌భ్యులు కూడా స‌రిగ్గా నోరుమెద‌ప‌క‌పోవ‌డానికి కార‌ణం వైసీపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న వ‌రుస నిర్ణ‌యాల‌కు ప్ర‌జ‌ల నుంచి సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భించ‌డ‌మేన‌న్న వాద‌నా వినిపిస్తోంది. జ‌గ‌న్ పాల‌నా విధానంలో ఎక్క‌డా త‌ప్పులు దొర్ల‌క‌పోవ‌డ‌మే టీడీపీ ఎమ్మెల్యేల సైలెన్స్‌కు కార‌ణ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle