newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

సేమ్ డైలాగ్స్.. మనుషులు మారారంతే!

05-07-201905-07-2019 15:35:41 IST
Updated On 05-07-2019 16:02:31 ISTUpdated On 05-07-20192019-07-05T10:05:41.620Z05-07-2019 2019-07-05T10:05:39.589Z - 2019-07-05T10:32:31.575Z - 05-07-2019

సేమ్ డైలాగ్స్.. మనుషులు మారారంతే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకే సినిమాను రెండోసారి చూస్తున్నట్టు ఉంది ఏపీలో రాజకీయం. గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలనైతే చేసిందో ఇప్పుడు వాటినే వైసీపీ నేతల నోటి నుంచి వింటుండటం మినహా తాజా రాజకీయాల్లో రసకందాయమేదీ లేదు. తాజాగా వైసీపీ ఎంపీ, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. 

బడ్జెట్‌లో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపిందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యానం. ఈ బడ్జెట్‌ తమను నిరాశపరిచిందని విజయసాయి పెదవి విరిచారు. ప్రత్యేక హోదాతో పాటు అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్ర బడ్జెట్‌లో నిధుల ఊసే లేదన్నది విజయసాయికి ఉన్న అభ్యంతరం. బడ్జెట్‌తో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని వైసీపీ నేత తేల్చిపారేశారు.

విభజన చట్టంలోని అంశాలపైనా ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఏమీ మాట్లాడలేదని వాపోయారు. ఏపీకి ఎన్ని నిధులిస్తున్నారనే విషయంపైనా స్పష్టత లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. విశాఖ, విజయవాడ మెట్రో నిధుల విషయంలోనూ అన్యాయం జరిగిందని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీనీ నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.

ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే... చంద్రబాబు కూడా గత మూడేళ్లలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఇదే తరహాలో విమర్శలు చేశారు. పరికించి చూస్తూ ఇప్పుడు విజయసాయి, అప్పుడు చంద్రబాబు వాడిన పదాలు, వాక్యాల్లో ఎక్కడా వ్యత్యాసం లేదు. మొత్తం మీద రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి తప్ప కేంద్ర బడ్జెట్‌ విదిలింపుల్లో ఏ మార్పూ లేదని సామాన్యుడి స్వగతం.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle