newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

సెల్ఫ్ డ‌బ్బా.. సెల్ఫ్ గోల్ అవుతుంది..!

01-11-201901-11-2019 07:27:50 IST
Updated On 01-11-2019 07:29:19 ISTUpdated On 01-11-20192019-11-01T01:57:50.091Z01-11-2019 2019-11-01T01:57:37.656Z - 2019-11-01T01:59:19.463Z - 01-11-2019

సెల్ఫ్ డ‌బ్బా.. సెల్ఫ్ గోల్ అవుతుంది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరు మార్మోగిపోతోంది. రాష్ట్ర ప్ర‌జ‌లంతా ప‌దేప‌దే వైఎస్సార్ పేరును త‌లుచుకుంటున్నారు. పాల‌న విష‌యంలో జ‌గ‌న్ పాస్ అయినా ఫెయిల్ అయినా త‌న తండ్రిని ప్ర‌జ‌ల‌కు గుర్తు చేయ‌డంలో మాత్రం డిస్టింక్ష‌న్‌లో పాస్ అయ్యారు.

ఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినా ఆ పార్టీకి చెందిన దివంగ‌తులైన నేత‌ల పేర్లతో ప‌థ‌కాలు ప్రారంభించ‌డం స‌హ‌జం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఇందిరా, రాజీవ్ గాంధీ పేర్ల‌తో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక ఈ సంప్ర‌దాయం కొంత తగ్గినా కొన్ని ప‌థ‌కాల‌కు శ్యామ‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ, దీన్‌దయాల్ పేర్లు పెట్టుకుంటున్నారు.

త‌మ వారి పేర్లు పెట్టుకోవ‌డంలో ప్రాంతీయ పార్టీలు ముందుంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు చాలా ప‌థ‌కాల‌కు అంత‌కుముందు కాంగ్రెస్ పెట్టిన పేర్లు తీసేసి ఎన్టీఆర్ పేరు, చంద్ర‌న్న పేరుతో త‌న పేరు పెట్టుకున్నారు చంద్ర‌బాబు. ఈ విష‌యంపై అప్ప‌ట్లో అప్ప‌టి ప్ర‌తిప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు కూడా చేసింది.

అయితే, చంద్ర‌బాబు కంటే ఈ విష‌యంలో జ‌గ‌న్ దూసుకుపోతున్నారు. అధికారంలోకి వ‌చ్చిన ఐదు నెల‌ల్లోనే క‌నీసం 20 ప‌థ‌కాల‌కు పేర్లు మార్చి, కొత్త ప‌థ‌కాల‌కు త‌న తండ్రి వైఎస్సార్ పేర్లు పెట్టేశారు.

వైఎస్సార్ రైతు భ‌రోసా, వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ, వైఎస్సార్ చేనేత నేస్తం, వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ వాహ‌న‌మిత్ర‌, వైఎస్సార్ కంటివెలుగు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ పెళ్లి కానుక‌, వైఎస్సార్ న‌వోద‌యం, వైఎస్సార్ పెన్ష‌న్ కానుక‌, వైఎస్సార్ అక్ష‌య‌పాత్ర‌, వైఎస్సార్ బాల సంజీవిని, వైఎస్సార్ ఆద‌ర్శం, ఇలా ప‌దుల సంఖ్య‌లో ప‌థ‌కాల‌కు వైఎస్ పేర్లు పెట్టేశారు.

మ‌రికొన్ని ప‌థ‌కాల‌కూ ఆయ‌న పేరు పెట్టేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధంగా ఉంది. ఒక్క అమ్మ ఒడి ప‌థ‌కానికి మాత్రం జ‌గ‌న్ తన పేరు పెట్టుకున్నారు.

ఇన్ని ప‌థ‌కాల‌కు వైఎస్సార్ పేరు పెట్టిన జ‌గ‌న్ ఇప్పుడు అవార్డుల‌కు కూడా ఆయ‌న పేరే పెట్ట‌బోతున్నారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పేరుతో ప్ర‌తీయేటా స్వాతంత్య్ర‌, గ‌ణ‌తంత్ర దినోత్స‌వాల‌కు 100 మందికి అవార్డులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

అస‌లు వైఎస్సార్ మిన‌హా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు పేర్లు పెట్టేందుకు దేశం కోసం, రాష్ట్రం కోసం సేవ‌లు చేసిన వారు ఎవ‌రూ లేరా అని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక‌, వైసీపీ జెండా రంగులు పూయ‌డంలోనూ ఆ పార్టీ దిగువ శ్రేణి నాయ‌కులు, అధికారులు యుద్ధ ప్ర‌తిపాదిక‌న ప‌ని చేస్తున్నారు. క‌నిపించిన ప్ర‌తీ ప్ర‌భుత్వ ఆస్తికీ వైసీసీ జెండా రంగులు పూసేస్తున్నారు.

గ్రామ స‌చివాల‌యాలు, బ‌డులు, నీటి ట్యాంకులు, ఆఖ‌రికి స్మ‌శానాన్ని కూడా వ‌ద‌ల‌కుండా రంగులు వేశారు. ఇది సోష‌ల్ మీడియాలో హాస్యాస్ప‌దంగా మారింది.

తాజాగా, అనంత‌పురం జిల్లాల్లో ఓ గ్రామ స‌చివాల‌యానికి ఉన్న జాతీయ జెండా రంగుల‌పై వైసీపీ రంగులు పూశారు కొంద‌రు స్థానిక అత్యుత్సాహ నేత‌లు. ఇది జాతీయ స్థాయిలో నెటిజ‌న్ల ట్రోలింగ్‌కు కార‌ణ‌మైంది. దీంతో మ‌ళ్లీ త‌ప్పు దిద్దుకొని జాతీయ జెండా రంగులు వేశారు.

మ‌రీ, ఇంత‌లా జ‌గ‌న్ త‌న తండ్రి, పార్టీ గుర్తింపు కోసం ఆరాట‌ప‌డటం రాజ‌కీయ విశ్లేష‌కుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ప‌థ‌కానికి ఎవ‌రి పేరు పెట్టార‌నే దానిక‌న్నా మంచి ప‌థ‌కాన్ని ఎవ‌రు తెచ్చార‌నేదే ప్ర‌జ‌లు ఎక్కువ‌గా గుర్తు పెట్టుకుంటారు.

గ‌తంలో వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టినా ఇప్ప‌టికీ ఆరోగ్య‌శ్రీ అన‌గానే ప్ర‌జ‌ల‌కు వైఎస్సార్ మాత్ర‌మే గుర్తు వ‌స్తార‌నే విష‌యాన్ని వైసీపీ గుర్తించుకుంటే మేల‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   2 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   5 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   5 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   10 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   10 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   11 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   12 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   13 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   13 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   13 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle