newssting
BITING NEWS :
*శాసనమండలి రద్దుకి జగన్ తీర్మానం..ఆమోదం *భోగాపురం పోర్ట్‌, మచిలీపట్నం ఎయిర్‌పోర్ట్‌లపై చర్చించనునున్న కేబినేట్‌*ఏపీలో నేటి శాసనసభ సమావేశాలకు టీడీపీ దూరం*ఆంధ్రప్రదేశ్‌: నేడు ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు*దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు *అసోంలో బాంబుపేలుళ్ళు *హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో భరతమాత మహా హారతి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళిసై*మేడారం జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆహ్వానం. సమ్మక్క... సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానం. ఆహ్వానించిన మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్*మండలి రద్దు జగన్ అనుకున్నంత సులభంకాదన్న నేతలు. కేంద్రం అంత సులభంగా రద్దుపై నిర్ణయం తీసుకోదు *ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం. రాజకీయ, వివిధ రంగాల్లోని ప్రముఖులకు గవర్నర్ విందు. ఎట్ హోమ్ కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని, మండలి చైర్మన్ షరీఫ్ *సెలక్ట్ కమిటీ ఏర్పాటులో తోలి అడుగు. కమిటీకి సభ్యుల పేర్లను ఇవ్వాలని పార్టీలకు చైర్మన్ లేఖ*ఏపీలో స్పీకర్, ఛైర్మన్లతో విడి విడిగా భేటీ అయిన గవర్నర్..కీలక సమయంలో స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ భేటీపై ఆసక్తి

సెలవుపై వెళ్లిన మాజీ సీఎస్.. తొలగింపును ధిక్కరించినట్లేనా?

07-11-201907-11-2019 12:56:05 IST
Updated On 07-11-2019 15:54:13 ISTUpdated On 07-11-20192019-11-07T07:26:05.925Z07-11-2019 2019-11-07T07:12:02.433Z - 2019-11-07T10:24:13.693Z - 07-11-2019

సెలవుపై వెళ్లిన మాజీ సీఎస్.. తొలగింపును ధిక్కరించినట్లేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవినుంచి అనూహ్యంగా తొలగించబడి అనామక పోస్టులోకి పంపబడిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం నుంచి నెలరోజుల సెలవుపై వెళ్లారు. అవమానకరంగా అత్యున్నత పదవి నుంచి తొలగించబడిన ఎల్వీఎస్ బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు డైరెక్టర్ జనరల్‍‌గా నియమించబడ్డారు. కానీ ఎల్వీస్ ఈ కొత్త పోస్టులో చేరకుండా సెలవుపై వెళ్లడం సంచలనం కలిగించింది.

బుధవారం ఇన్చార్జ్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన నీరభ్ కుమార్‌కి తన బాధ్యతలు అప్పగించిన ఎల్వీఎస్ డిసెంబర్ 6 వరకు సెలవుపై వెళ్లిపోయారు. సెంట్రల్ డిప్యుటేషన్‌పై దేశ రాజధాని పోస్టింగ్ కోసం బహుశా ఆయన డిల్లీ వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆయన ఇకపై సంవత్సర కాలం మాత్రమే ప్రభుత్వ సర్వీసును కలిగి ఉన్నారు.

ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించబడ్డాక ఏ ప్రధాన పదవినీ ఏపీలో పొందలేకపోయినందున, కేంద్రప్రభుత్ప సర్వీసులో కొనసాగుతూ రిటైర్ కావాలని ఎల్వీఎస్ కోరుకుంటూండ వచ్చని భావిస్తున్నారు. ఈలోగా ముఖ్యంమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగానికి లేఖ రాస్తూ సీనియర్ ఐఏఎస్ నీలం సహానీను కేంద్రం నుంచి ఆంధ్రా కేడర్‌కి డిప్యుటేషన్‌పై పంపించాలని అభ్యర్థించడం విశేషం.

ప్రస్తుతం కేంద్ర సామాజిక, సాధికార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా నీలం పనిచేస్తున్నారు. ఆమెను ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి  ప్రధాన కార్యదర్శిగా నియమించవచ్చని భావిస్తున్నారు. 

ఈలోగా వివాద రహితుడు, సౌమ్యుడు అయిన ఎల్వీ సుబ్రహ్మణ్యంని అవమానకరంగా అత్యున్నత పదవినుంచి తొలగించడంపై రాష్ట్ర బీజేపీ మండిపడుతోంది. ప్రధాన కార్యదర్శిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ అన్ని మర్యాదలను అతిక్రమించి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సీనియర్ ఐఏఎస్‌ని ప్రధాన కార్యదర్శి పదవినుంచి తొలగించడం దేనికంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ ప్రతినిధులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

 

హైకోర్టు మెట్లెక్కిన సీఎం జగన్.. వ్యక్తిగత మినహాయింపుకోసం అభ్యర్ధన

హైకోర్టు మెట్లెక్కిన సీఎం జగన్.. వ్యక్తిగత మినహాయింపుకోసం అభ్యర్ధన

   5 hours ago


శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

   7 hours ago


రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

   8 hours ago


హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

   9 hours ago


కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

   10 hours ago


లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

   10 hours ago


శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

   10 hours ago


ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

   14 hours ago


కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

   14 hours ago


జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle