newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

సెగ‌లు క‌క్కుతున్న పి.గ‌న్న‌వ‌రం రాజ‌కీయం..!

17-11-201917-11-2019 10:09:45 IST
2019-11-17T04:39:45.185Z17-11-2019 2019-11-17T04:19:49.509Z - - 14-08-2020

సెగ‌లు క‌క్కుతున్న పి.గ‌న్న‌వ‌రం రాజ‌కీయం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ నేత స్టాలిన్ బాబు స‌స్పెండ్ వెనుక అస‌లు కార‌ణాలేంటి..? ఇప్పుడు ఇదే ప్ర‌శ్నపై తూర్పు గోదావ‌రి జిల్లా పీ.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో వాడీవేడి చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా ఉన్న నేల‌పూడి స్టాలిన్ బాబును నిధుల దుర్వినియోగం పేరుతో పార్టీ నుంచి బ‌హిష్క‌రించార‌న్న వాద‌నా వినిపిస్తోంది.

అయితే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్టాలిన్ బాబును స‌మ‌ర్ధుడైన నాయ‌కుడ‌ని గుర్తించి మొన్న‌టి ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ ఫ్యాన్‌గాలి బ‌లంగా వీచ‌డంతో స్టాలిన్ ఓట‌మిని చ‌వి చూడాల్సి వ‌చ్చింది. దీంతో పార్టీ ఫండ్‌ను దుర్వినియోగం చేశార‌న్న కార‌ణంగా ఆయ‌న్ను బ‌హిష్క‌రించేస్తున్నామ‌ని జిల్లా పార్టీ అధ్య‌క్షుడు నామాన రాంబాబు ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా స్టాలిన్‌బాబు వ‌ర్ష‌న్ మ‌రోలా ఉంది. త‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించేంత సీన్ వారికి లేద‌ని, తానంత‌ట తానే పార్టీకి రాజీనామా చేశాన‌ని చెబుతున్నారు. ఈ విష‌యం ఇప్పుడు జిల్లా మొత్తానికి పాకిపోయింది. పార్టీలోని సీనియ‌ర్లు త‌నను వేధిస్తున్నార‌ని, అందుకే పార్టీని వ‌దిలేశాన‌ని చెప్పిన స్టాలిన్ ఆ మేర‌కు అధిష్టానానికి ఒక లేఖ కూడా రాశారు.

కాక‌పోతే నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం స్టాలిన్‌బాబు స‌స్పెండ్‌కు ఆర్థిక లాబాదేవీలే కార‌ణ‌మ‌ని చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. గ‌త ప్ర‌భుత్వంలో అమ‌లాపురం ఎంపీగా ప‌నిచేసిన పండుల ర‌వీంద్ర‌బాబు పీఆర్ఓగా స్టాలిన్ బాబు ప‌నిచేశారు. అప్ప‌ట్లో పార్టీ జిల్లా అధ్య‌క్షుడు రాంబాబుతోపాటు మ‌రికొంద‌రు ముఖ్య నాయ‌కుల స్టాలిన్‌ను పార్టీలోకి తీసుకొచ్చారు.

ఇలా జిల్లా నేత‌ల స‌హాయ స‌హ‌కారాలు పూర్తి స్థాయిలో ఉండ‌టంతో స్టాలిన్ అధిష్టానం ద‌గ్గ‌ర గుర్తింపు పొందారు. దాంతో 2019 ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పుల‌ప‌ర్తిని కాద‌ని మ‌రీ స్టాలిన్ బాబుకు అధిష్టానం టికెట్‌ను క‌ట్ట‌బెట్టింది. దీంతో మ‌న‌స్తాపానికి గురైన పుల‌ప‌ర్తి నారాయ‌ణ‌మూర్తి వైసీపీలో చేరేందుకు జ‌గ‌న్ చెంత‌ చేరారు. అక్క‌డా టికెట్‌పై ఎటువంటి హామీ ల‌భించ‌క‌పోవ‌డంతో చివ‌రి నిమిషంలో కండువా క‌ప్పుకోకుండా అక్క‌డ్నుంచి వెన‌క్కు రాక‌త‌ప్ప‌లేదు.

అలా 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు త‌ట‌స్థంగా ఉండిపోయిన పుల‌ప‌ర్తి ఇటీవ‌ల బీజేపీలో చేరిపోయార‌న్న టాక్ బ‌హిరంగంగా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు నేల‌పూడి స్టాలిన్ బాబును కూడా ఇదే విధంగా నామాన రాంబాబు వ‌ర్గం ఇబ్బందుల‌కు గురి చేస్తుంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

జిల్లా పార్టీ నేత‌లు స్టాలిన్ బాబు స్థానంలో మండ‌పాటి  కిర‌ణ్‌కుమార్ అనే కొత్త నాయ‌కుడిని కూడా సిద్ధం చేసినట్టు పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పుల‌ప‌ర్తి, స్టాలిన్ బాబు పార్టీని వీడ‌టానికి రాంబాబు, డొక్కాలే కార‌ణ‌మ‌ని అంటున్నారు మ‌రికొంద‌రు వారి వాద‌న‌ను వినిపిస్తున్నారు.

అంతేకాకుండా, ఇటీవ‌ల కాలంలో నామాన వ‌ర్గానికి ఎదురు తిర‌గ‌డం, వారిని కాద‌ని సొంతంగా కేడ‌ర్‌ను త‌యారు చేయ‌డంతోనే స్టాలిన్ బాబుకు ఈ ప‌రిస్థితి దాపురించింద‌ని అంతా అనుకుంటున్నారు.

నామ‌నవ‌ర్గం ఆధిప‌త్యంతోపాటు స్టాలిన్ స్వ‌యంకృతాప‌రాధాలు కూడా అత‌ని బ‌హిష్క‌ర‌ణ‌కు కార‌ణ‌మ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు ఎక్క‌డికి దారి తీస్తుందోన‌ని కార్య‌క‌ర్త‌లు చ‌ర్చించుకుంటున్నారు.

 

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   33 minutes ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   44 minutes ago


అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

   an hour ago


ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

   an hour ago


కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

   2 hours ago


కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

   3 hours ago


వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   15 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   17 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   17 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle