newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

సెంట్రల్ సర్వీసులకు సీనియర్లు...వాళ్ళ ప్లానేంటి?

17-04-201917-04-2019 07:55:07 IST
2019-04-17T02:25:07.121Z17-04-2019 2019-04-17T02:25:04.424Z - - 24-02-2020

సెంట్రల్ సర్వీసులకు సీనియర్లు...వాళ్ళ ప్లానేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఐదేళ్లుగా కీలకంగా వ్యవహరించిన సీనియర్ అధికారులు సెంట్రల్ సర్వీసులకు దరఖాస్తు చేసుకున్నారా? ఎన్నికల ఫలితాల తరువాత ఇక్కడ ఉండేలేమని భావిస్తున్నారా? అందుతున్న సమాచారాన్ని బట్టి అలాగే అనిపిస్తోంది. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ తో పాటు సీఎంఓ కార్యదర్శి గిరిజా శంకర్ కేంద్రానికి వెళ్లాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. కారణమేమిటో కచ్చితంగా తెలియకపోయినా, రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతుందన్న నమ్మకమే వారిలా ఆలోచించేలా చేస్తోందని సమాచారం. 

రాష్ట్రంలో నాన్ ఫోకల్‌గా ఉంటే నష్టమేమిటి? అధికార బదిలీ జరిగినా, కొత్త ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే తప్పేంటని పలు ప్రశ్నలున్నా, బాబుపై కేసులు వస్తే, అందులో తాము ఇరుక్కోకుండా ఉండాలంటే కేంద్ర సర్వీసులు అయితేనే బాగుంటుందని సీనియర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎస్ లలో మాజీ ఇంటెలిజెన్స్ డీపీ వెంకటేశ్వర రావుతో పాటు సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రాజధాని పనుల్లో కీలకపాత్ర వహించిన వారు, సీఎంఓలో ప్రముఖంగా వ్యవహరించిన సతీశ్ చంద్ర, గిరిజా శంకర్ లాంటి వారు ఈ జాబితాలో ఉన్నట్లు సెక్రటేరియట్ వర్గాలు భావిస్తున్నాయి. 

ఏఐఎస్ అధికారులైనా అధికారంలో ఉన్న వ్యక్తిని బట్టి వ్యవహరిస్తారన్నది తెలిసిందే. అయితే.. అలాంటి సర్దుబాట్లకు కొందరికి అవకాశం లేదని, జగన్ తో కొందరు సఖ్యత పొందడం కష్టమేనని వారు డిసైడ్ అయిపోయారట. ఇవన్నీ చూచాయిగా ఆ నోటా ఈ నోట వచ్చే వార్తలే కానీ, అధికారిక సమాచారం కాదు కాబట్టి సదరు అధికారులను అడగడానికి అవకాశం ఉండదు. కానీ, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో జరిగేది ఇదేనన్నది బహిరంగ రహస్యం.

మొత్తానికి ఇలాంటి అధికారులందరూ కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చేస్తారని పక్కాగా డిసైడ్ అయిపోయారట.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle