newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

సెంటిమెంట్ మహిమ.. జగన్ రచ్చబండపై వెనక్కు తగ్గినట్లేనా?

30-09-201930-09-2019 09:02:13 IST
Updated On 30-09-2019 14:53:00 ISTUpdated On 30-09-20192019-09-30T03:32:13.259Z30-09-2019 2019-09-30T03:32:07.440Z - 2019-09-30T09:23:00.651Z - 30-09-2019

సెంటిమెంట్ మహిమ.. జగన్ రచ్చబండపై వెనక్కు తగ్గినట్లేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దివంగత నేత, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్తూరు జిల్లాలో 'రచ్చబండ' కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని బయలుదేరారు. అయితే హెలికాఫ్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తి నల్లమల అడవుల్లో ఘోర ప్రమాదానికి గురై అసువులు బాసిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలో జరిగిన సంఘటనలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలై, రెండు రాజ్యాలవడం తదితర పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే. అయితే వైఎస్ చనిపోయిన ఆ కార్యక్రమాన్ని మరే ముఖ్యమంత్రీ ప్రారంభించలేదు.

కానీ వైస్సార్ చేపట్టాలనుకున్న రచ్చబండ కార్యక్రమాన్ని సీఎం జగన్ మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారని గత నెలలో ప్రచారం జరిగింది. ప్రచారాన్ని మించి సీఎంఓ కూడా ఔను త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తామన్నారు. అది కూడా ఎక్కడ ప్రారంభించాలని ఆనాడు ఆయన అనుకున్నారో.. అదే రోజు.. అదే సమయానికి.. అదే ప్రాంతంలో ప్రారంభించి చరిత్ర సృష్టించబోతున్నారని కూడా కథనాలు రాసుకొచ్చారు. సెప్టెంబర్ రెండు నుంచి రచ్చబండ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం జగన్. రెడీ అవుతున్నారన్నారు. అయితే సెప్టెంబర్ నెల పూర్తవుతున్నా రచ్చబండ ఊసులేదు.

మరి రచ్చబండను సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనా? అందరు ముఖ్యమంత్రులు లాగానే జగన్ కూడా సెంటిమెంట్ ప్రకారం రచ్చబండకు దూరమయ్యారా? వైఎస్ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, కెసిఆర్ ఇలా అందరూ రచ్చబండ జోలికి కానీ.. ఆ తరహా కార్యక్రమం చేపట్టాలని కానీ అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దైవ కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ నమ్మకాలు, జాతకాల మూడ్లోకి వెళ్లిపోయారు. అందుకే రచ్చబండపై పునరాలోచనలో పడ్డట్లుగా చెప్తున్నారు.

సెప్టెంబర్ 21వ తేదీ శనివారం నాడు కర్నూలు జిల్లా నంద్యాలలో సీఎం జగన్ ప్రయాణించిన హెలీకాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో తప్పుడు సమాచారమిచ్చారు. దీంతో హెలీకాఫ్టర్ కొంత సమయం గాల్లోనే చక్కర్లు కొట్టి చివరికి అధికారులు క్లియరెన్స్ ఇచ్చాక ల్యాండింగ్ జరిగింది. ఇక మొన్నటి మొన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం రోజున సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరేందుకు రెడీ అయ్యారు.

అయితే గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎం జగన్ ప్రయాణిస్తున్నహెలీకాఫ్టర్ ల్యాండింగ్‌కు సమస్యలు ఉన్నాయంటూ అధికారులు సమాచారమిచ్చారు. రెండు ఘటనలలో సీఎం భద్రతా అధికారులు, సీఎంఓ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు.. వాటిని మించి నమ్మకాల ప్రకారం కీడు జరిగిన కార్యక్రమం.. అందుకే రచ్చబండపై పూర్తిగా వెనక్కు తగ్గారా? ఏమో జస్ట్ లివ్ ఇట్!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle