newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

సూరి హత్యకేసు... ఏడేళ్ళ చరిత్ర

18-12-201818-12-2018 13:41:46 IST
Updated On 18-12-2018 13:41:59 ISTUpdated On 18-12-20182018-12-18T08:11:46.685Z18-12-2018 2018-12-18T08:11:44.731Z - 2018-12-18T08:11:59.733Z - 18-12-2018

సూరి హత్యకేసు... ఏడేళ్ళ చరిత్ర
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపిన కేసుల్లో సూర్య నారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెరువు సూరి మర్డర్ కేసు ఒకటి! పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడైన సూరి... 2011 జనవరి 4న హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురయ్యారు. తన అనుచరుడు భానుకిరణ్ చేతిలోనే సూరి హతమవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ... 2012 ఏప్రిల్‌ 21న జహీరాబాద్‌ వద్ద ఒక దాబాలో భానుకిరణ్‌ను అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి తుపాకీ, మూడు సెల్‌ఫోన్లు, బ్యాంకు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి భాను జైల్లోనే ఉన్నాడు. బెయిల్‌ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు.

కేసు విచారణలో భాగంగా లభ్యమైన సాక్ష్యాలు, డ్రైవర్ మధు వాంగ్మూలం, ఫోరెన్సిక్ రిపోర్టుల్ని నాంపల్లి కోర్టుకు సమర్పించింది సీఐడి! దీనిపై విచారణ జరిపిన కోర్టు... ఏడేళ్ళ తర్వాత తుదితీర్పు వెలువరించింది. భానుకి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేయడంతోపాటు రూ.20 వేలు జరిమానా విధించింది. అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద మరో పదేళ్ళు జైలు శిక్ష విధించింది. ఇతనితో పాటు మరో నిందితుడైన మన్మోహన్ సింగ్‌కు రెండు కేసుల్లో ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద మరో ఐదేళ్ళు జైలు శిక్ష విధించింది. మిగిలిన నలుగురు సుబ్బయ్య, వంశీధర్, వెంకటరమణ, హరిలను నిర్దోషులుగా పేర్కొంది.

సూరి మర్డర్ రోజు ఏం జరిగింది? :
ఆ రోజు (2011 జనవరి 4) సూరి, డ్రైవర్ మధు సనత్‌నగర్‌లోని ఒక అడ్వొకేట్‌ను కలిశారు. అనంతరం అక్కడి నుంచి స్కోడా కారులో భానుతో కలిసి బయలుదేరారు. సూరి ముందు సీట్లో సూరి కూర్చుని ఉండగా... వెనుక సీట్లో భాను కూర్చున్నాడు. యూసఫ్‌గూడ ప్రాంతానికి చేరుకున్నాక స్పీడ్ బ్రేకర్ రావడంతో డ్రైవర్ మధు కారును స్లో చేశాడు. అప్పుడు ఒక్కసారిగా కాల్పుల శబ్దం వచ్చింది. ఆ కాల్పుల్లో సూరి చనిపోగా... వెనుక సీట్లో ఉన్న భాను ‘ఎటాక్ ఎటాక్’ అంటూ అరుస్తూ కారు దిగి పరారయ్యాడు. సూరిని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్ళగా... ఆయన అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. డ్రైవర్ మధు ఎన్నిసార్లు భానుకి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు.

డ్రైవర్ మధు ఇచ్చిన ఈ వాంగ్మూలం ప్రకారం... భానుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు! అటు ఫోరెన్సిక్ రిపోర్ట్‌లోనూ సూరిపై పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపినట్లు రిపోర్ట్ రావడంతో... భానుని ప్రధాన నిందితుడిగా తేల్చారు. అయితే... హత్య ఎవరు చేశారన్నది ప్రధాన సాక్షి మధు స్పష్టంగా చెప్పలేదు. అటు హత్యకు వినియోగించిన పిస్తోల్‌పై కూడా వేలిముద్రలు సరిగ్గా లభించలేదు. దీంతో భానునే చంపాడని తేల్చడానికి పోలీసులకు బలమైన కారణాలు దొరకలేదు. అందుకే ఈ కేసు విచారణ ఏడేళ్ళపాటు జరిగింది. విచారణలో భాగంగా దొరికిన సాక్ష్యాల ఆధారంగా భానునే చంపాడని తేలడంతో... నాంపల్లి కోర్టు అతనికి యావజ్జీ కారాగార శిక్ష విధిస్తూ తుదితీర్పు వెల్లడించింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle