newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

సుమలతకు మోహన్ బాబు మద్దతు.. ఎందుకు?

19-04-201919-04-2019 12:18:02 IST
2019-04-19T06:48:02.165Z19-04-2019 2019-04-19T06:47:48.748Z - - 26-06-2019

సుమలతకు మోహన్ బాబు మద్దతు.. ఎందుకు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ ఎంపీ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తీరే సపరేటు. ఇటీవల వైసీపీలో చేరిన మోహన్ బాబు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు అంబరీష్‌ సతీమణి, నటి సుమలతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం చర్చకు దారితీస్తోంది. ఆయన ట్విటర్‌ వేదికగా సుదీర్ఘ లేఖ రాసిన మోహన్ బాబు మాండ్యా ప్రజలు సుమలతను గెలిపించాలని కోరారు. పనిలో పనిగా చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు. 

‘కర్ణాటక ప్రజలందరికీ.. మండ్య ప్రజలు, అభిమానులకు ప్రత్యేకంగా.. మన అభిమాన నటుడు, ప్రజల మనిషి, గొప్ప వ్యక్తిత్వం గల నటుడు అంబరీష్‌. మండ్యప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారు. ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు మనందరి బాధ్యత ఆ గొప్ప వ్యక్తి సతీమణి సుమలతకు అండగా నిలబడటం. మీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. మీ అందరి ఆశీస్సులు సుమలతకు ఉంటాయని, ఆమెను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.

అంబరీష్‌తో పాటు నేను కూడా మిమ్మల్ని ప్రేమించాను. మండ్య ప్రజలు సహృదయం కలవారు. వారందరికి నా నమస్కారాలు.

చంద్రబాబు నాయుడు ఒకప్పటి ఆంధ్రప్రదేశ్‌ సీఎం. ఇప్పుడు కాదు.. ఇక ఎప్పటికీ కారు. మంచి మనస్సు గల అంబరీష్‌.. చంద్రబాబు నా ద్వారా పిలిచిన చాలా కార్యక్రమాలకు హాజరయ్యారు. కానీ చంద్రబాబుకు ఏమాత్రం కృతజ్ఞతాభావం లేదు. అతని కోసం అంబరీష్‌ చాలా చేశారు. అలాంటి అతని భార్యను ఓడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయడం హాస్యాస్పదం.. ఆశ్చర్యకరం. కులం, డబ్బు రాజకీయాలను పక్కనబెట్టి సుమలతను గెలిపిస్తారని ఆశీస్తున్నాను.’ మోహన్‌బాబు పేర్కొన్నారు. 

మొత్తం మీద మోహన్ బాబు లేఖ మాండ్య ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. సుమలత ఇండిపెండెంట్ గా గెలిచి పార్లమెంటులో అడుగుపెడతారేమో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle