newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

సుజనా చౌదరి టీడీపీని వీడుతున్నట్టేనా?-2

18-06-201918-06-2019 07:53:35 IST
Updated On 21-06-2019 15:43:11 ISTUpdated On 21-06-20192019-06-18T02:23:35.635Z18-06-2019 2019-06-18T02:23:31.960Z - 2019-06-21T10:13:11.422Z - 21-06-2019

సుజనా చౌదరి టీడీపీని వీడుతున్నట్టేనా?-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

జగన్ విషయంలో చంద్రబాబు నాయుడు వైఖరిని తప్పుబట్టారు సుజనా చౌదరి. ఎవరినైనా ఎదుర్కోవాలంటే వారిపై ఉన్న పాత కేసులను తవ్వి తీయకూడదన్నారు. ఎవరినైనా రాజకీయంగానే ఎదుర్కోవాలన్నారు. జగన్ అన్ని కోట్లు తెలివితేటలతో సంపాదించుకుని ఉండవచ్చు... అంతేగానీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరించి ఉండకూడదన్నారు. టీడీపీకి భవిష్యత్తు లేదన్నారు. చంద్రబాబు వయసు మీరింది. తర్వాత నాయకుడు ఎవరనేదానిపై ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. ఆయన ఆరోగ్యానికి ఢోకా లేదంటూనే ...మేమంతా ఉన్నామని చెప్పలేకపోయారు. 

ఓటమినుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని మాత్రం చెప్పారు. లోకేష్ మంగళగిరి సీటు నుంచి పోటీచేయడం మంచిదేనా అని ఆలోచించలేదన్నారు. మంగళగిరి ఎంచుకోవడమే పెద్ద తప్పు.. ఆర్కె గెలవడం వెనుక ఆయన క‌ృషి ఉందన్నారు. ఎన్నికల్లో పాజిటివ్ కంటే నెగిటివ్ ఓటింగ్ వల్లే టీడీపీ ఓటమిపాలయిందన్నారు. మరోవైపు బీజేపీతో కలిసి ఉంటే ఫలితాలు వేరేగా ఉండేవన్నారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఉండి, ఎన్డీయేలో కొనసాగి ఉండి ఉంటే గెలిచే వాళ్ళం అన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని దెబ్బకొట్టామని సంతోష పడ్డాం. బీజేపీ ఏపీలో జీరో నుంచి రావాలి. అదే టైంలో టీడీపీ కూడా ఘోరంగా పడిపోయింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఈవీఎంల విశ్వసనీయతను తప్పుబట్టడంపై సుజనా స్పందించారు. ఒక ఇంజనీరింగ్ నిపుణుడిగా ఈవీఎంలను మానిప్యులేట్ చేయడం అసాధ్యం అని తన  అభిప్రాయంగా చెప్పారు. అయితే న్యూ టెక్నాలజీలో అవకాశం ఉండి ఉండవచ్చని భావిస్తానన్నారు.  వీవీప్యాట్ల విషయంలో చంద్రబాబుని ఎవరో తప్పుదారి పట్టించారన్నారు. వివిధ అంశాలపై పార్టీ సెల్ప్ అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. 

గన్నవరం ఎయిర్ పోర్ట్ ఉదంతం, చంద్రబాబుని తనిఖీ చేయడం వంటి  విషయాల్లో టీడీపీ నేతలు అంత రాద్ధాంతం చేయడం అవసరం లేదన్నారు. సోషల్ మీడియా, టెక్నాలజీ వల్ల ఇదంతా జరిగిందన్నారు. ఆ ఫోటో తీయడం సరికాదన్నారు. అంతేకాదు, ప్రత్యేక హోదా విషయంలో జగన్‌కు మంచి మార్కులు వేశారు సుజనా చౌదరి. ఈ విషయంలో జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారన్నారు. 

బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చిందని, ఒకవేళ మోడీకి ఎంపీల అవసరం ఉన్నా. ప్రత్యేకహోదా ఇవ్వరన్నారు. అంతేకాదు ఒకవేళ జగన్ గానీ చంద్రబాబు గానీ ప్రధాని అయినా ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యంకాదన్నారు సుజనా చౌదరి. అదే సమయంలో  ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ విధానాలను ప్రస్తావించారు. రివర్స్ టెండరింగ్, కొత్త విధానం అంత కాంప్లికేట్ చేయాల్సింది లేదన్నారు. అవినీతి జరిగితే ఎవరినైనా బయటకు లాగాలన్నారు. చంద్రబాబు హయాంలో జీరో అవినీతి జరిగిందని చెప్పడంలేదు. గవర్నెన్స్ సరిగా జరగలేదని మాత్రం ఆయన వివరించారు.

తాను రాజ్యసభ ఎంపీ అయినప్పుడు తనకు సీటు రాకుండా అనేక మంది రాజ్యసభ సీటు కోసం ప్రయత్నించారన్నారు. చంద్రబాబునాయుడు తనకు గురువు అంటూనే టీడీపీలో ఉన్నంతకాలం టీడీపీ వాయిస్ వినిపిస్తానన్నారు. అయితే టీడీపీ నుంచి ఎప్పుడు బయటికెళతాననేది మాత్రం చెప్పడం లేదు. దీనిపై సుజనా మాట్లాడుతూ రేపు ఏం జరుగుతుందో చెప్పలేనన్నారు. తనకు దేవుడు అన్నీ ఇచ్చాడన్నారు. పదవి ఉన్నా లేకున్నా తనలో తేడా ఉండదన్నారు. ఏపీలో టీడీపీ ఒక కులానికే పరిమితమని సోషల్ మీడియాలో ప్రాపగాండా చేశారన్నారు.  సుజనా చౌదరి అభిప్రాయాలను పరిశీలిస్తే ఆయన పార్టీని వీడడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకవేళ సుజనా టీడీపీని వీడితే మాత్రం అది పార్టీ వినాశనానికి నాంది కావచ్చు. ఎందుకంటే సుజనా చౌదరి ఒక్కరూ పార్టీని వీడి వెళ్ళరు. తన భావజాలంతో సరితూగేవారిని, టీడీపీలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులను తనతో తీసుకు వెళ్ళవచ్చు. తాను పార్టీని వీడుతున్నానని చెప్పకుండానే ఒక రకమయిన సంకేతాలు చంద్రబాబు అండ్ కో కు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇచ్చినట్టు భావించవచ్చు. తన వ్యాఖ్యలకు ఎలాంటి రియాక్షన్ వస్తుందో అని బేరీజు వేసుకుని సుజనా ముందడుగు వేయవచ్చు. 

మోడీ అంటే తనకు గౌరవం.. ఆయనకు నిర్ధిష్టమయిన విధానం ఉంది... ఆయన వల్ల భారత్ ఖ్యాతి పెరిగిందని చెప్పడం కూడా వ్యూహాత్మకంగా అనిపిస్తోంది. చంద్రబాబు తనయుడు లోకేష్ సమర్ధుడు కాదని చెప్పకనే చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని ఆయన కోరుకోవడం కూడా దీని వెనుక అర్థం అయి ఉండవచ్చు. సుజనా వ్యాఖ్యలతో టీడీపీ భవిష్యత్తుపై ఇప్పుడు అనుమానాలు పెరుగుతున్నాయి. ఐదేళ్ళు చంద్రబాబునాయుడు పార్టీని ఎలా నడుపుకొస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

టీడీపీలో మాత్రం తాజా పరిణామాలు చాపకింద నీరులా మారుతున్నాయి. ఒకవేళ టీడీపీ ఏపీలో కనుమరుగైతే అది కమ్మ సామాజిక వర్గం వల్లే అవుతుందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ వల్ల టీడీపీ, కాంగ్రెస్ ఖాళీ అయితే, ఏపీలో బీజేపీ వల్ల టీడీపీ కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఎవరో అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, కేఇ క‌ృష్ణమూర్తి, కేశినేని నాని, అయ్యన్నపాత్రుడు.. లాంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే అంతగా ప్రాధాన్యత ఉండి ఉండేది కాదు. కానీ సుజనా చౌదరి తాజా వ్యవహారం టీడీపీ వర్గాలను అయోమయానికి గురిచేస్తోంది. కొంతమంది టీడీపీ నేతలు పార్టీ భవిష్యత్తుపై మరింత ఆందోళన చెందుతున్నారు. సుజనా చౌదరి త్వరలో పార్టీని వీడడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన దారిలో వెళ్ళేవారు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.

సుజనా చౌదరి టీడీపీని వీడుతున్నట్టేనా?-1


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle