newssting
BITING NEWS :
* ఏపీ: గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి..2841కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య 824..మొత్తం 1958 మంది డిశ్చార్జ్.. కాగా మొత్తం కరోనాతో 59 మంది మృతి *భారత్ లో 1,58,333 కరోనా పాజిటివ్ కేసులు..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 86,110..కరోనా నుండి డిశ్చార్జ్ అయిన బాధితులు 67,692..కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,531*దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 6,566 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు..గడచిన 24 గంటలలో మొత్తం 194 మంది మృతి*ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి... ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు*బోరు బావి ఘటన విషాదాంతం..కన్నుమూసిన చిన్నారి సాయి వర్ధన్..సమాంతరంగా గొయ్యి మృతదేహం వెలికి తీత..సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు*లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్*ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి-కేసీఆర్*హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యథావిథిగా అందించాలి-సీఎం కేసీఆర్

సుజనా చౌదరి టీడీపీని వీడుతున్నట్టేనా?-1

18-06-201918-06-2019 07:48:10 IST
Updated On 21-06-2019 15:46:27 ISTUpdated On 21-06-20192019-06-18T02:18:10.657Z18-06-2019 2019-06-18T02:17:28.733Z - 2019-06-21T10:16:27.788Z - 21-06-2019

సుజనా చౌదరి టీడీపీని వీడుతున్నట్టేనా?-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం టీడీపీ నేతల భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయా? టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి భవిష్యత్ ప్రణాళికలు ఈ దశలోనే జరగనున్నాయా? ఈ ప్రశ్నలకు ఆయనే సమాధానం ఇచ్చారు. ఓ ఛానెల్‌కి ఇచ్చిన సుదీర్ఘమయిన ఇంటర్వ్యూలో సుజనా చౌదరి నర్మగర్భంగా సమాధానాలు ఇచ్చారు. ఆయన మాటల్ని బట్టి ఇటు చంద్రబాబుకి, అటు టీడీపీకి షాక్ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈమధ్య ఆయన బీజేపీకి దగ్గరవుతున్నట్టుగా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 

కేంద్రమంత్రిగా ఉన్నా, రాజ్యసభ ఎంపీగా ఉన్న తాను ఎప్పుడూ తొణకుండా ఉంటానన్నారు సుజనాచౌదరి. . ఎందుకంటే తాను తప్పులు చేస్తే  భయపడాలి, తాను ఎవరినీ మోసం చేయలేదన్నారు. రాజకీయాల్లోకి రాకముందు తనకు కంపెనీలతో అనుబంధం ఉన్న, రాజ్యసభ ఎంపీ అయ్యాక 2010 నుంచి తాను ఏ కంపెనీలో లేనన్నారు సుజనా చౌదరి. తన మీద ఎలాంటి కేసులు లేవన్నారు. ఇటీవలి పరిణామాల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఎవరిమీద అనుమానం ఉన్నా.. ఇన్వెస్టిగేషన్ ఆపకూడదు. అందుకే తాను ఈడీ, ఐటీ, సీబీఐలకు సహకరించినట్టు చెప్పారు.

తమకు అందిన సమాచారం నిజమాకాదా అనేది తెలుసుకోవడానికి ..దేశంలో ఏ వ్యక్తినైనా, సంస్థనైనా తనిఖీ చేసే అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుందన్నారు. అయితే బ్యాంకింగ్ మోసాలు, అవకతలకు సంబంధించి తనపై ఎలాంటి కంప్లయింట్, షోకాజ్ నోటీసులు లేవన్నారు సుజనా చౌదరి.

గతంలో తాను భాగస్వామిగా ఉన్న కంపెనీలు ఎలాంటి తప్పులు చేయలేదన్నారు. కేవలం పబ్లిసిటీ గురించి కొంతమంది ఇదంతా చేస్తున్నారన్నారు. ఈ విషయంలో తనకు ఎలాంటి భయం లేదన్నారు. ఆర్థిక నేరాల్లో తన చేయి లేదన్నారు. తనపై పొలిటికల్ దాడులు జరుగుతున్నాయా అనేది చెప్పలేనన్నారు. ప్రధానిగా ఉన్న మోడీ తనను కేంద్రమంత్రిగా తీసుకోవడం గురించి సుజనా చౌదరి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన గురించి అన్ని ఎంక్వైరీలు చేశారని, అందుకే తనకు కేంద్రమంత్రిగా అవకాశం ఇచ్చారని వివరించారు.

ప్రత్యేక హోదా కోసం టీడీపీ మోడీ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిందని, ఆ సమయంలో తాను చంద్రబాబుకి సలహా ఇచ్చానన్నారు సుజనా చౌదరి. బీజేపీతో ఫైటింగ్ కావాలంటే మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి, ఎన్డీయేలోనే ఉండి పోరాడడం మంచిదని తాను సలహాఇచ్చానన్నారు. కానీ పార్టీ అధినేత చంద్రబాబు తనకు తోచిన నిర్ణయం తీసుకున్నారన్నారు. తన అభిప్రాయం గురించి పక్కన పెట్టి, అప్పుడు తమ పార్టీ అధినేత చెప్పిందే చేశానన్నారు.

చంద్రబాబు తనకు రాజకీయ గురువు, దైవం అన్నారు సుజనా చౌదరి. చంద్రబాబు అంటే తనకు అదే అభిమానం, ప్రేమ జీవితాంతం ఉంటుందన్నారు. అలాగే ప్రధాని మోడీ అంటే తనకెంతో గౌరవం అన్న సుజనా చౌదరి తానేం బీజేపీకి దగ్గర కావడం లేదన్నారు. తాను పార్టీని వీడే సమయం వచ్చినట్టయితే చంద్రబాబుకి చెబుతాను.. జనానికి కూడా చెబుతానన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో పార్టీ లైన్ వేరు, వ్యక్తిగతం వేరు.. అది ముగిసిన అధ్యాయం అని అప్పుడే చెప్పానన్నారు. ఇప్పుడు కూడా అదే చెబుతానన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చట్టంలో ఏం ఉందో తెలుసుకోవడానికి థర్డ్ పార్టీకి ఇవ్వాలన్నాను. ఈ విషయంలో చంద్రబాబు మనసు మారింది. మొదట ప్రత్యేక హోదా సంజీవని కాదన్నారు. తర్వాత స్పెషల్ స్టేటస్ వద్దు ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు. 

టీడీపీ వైఖరికి భిన్నంగా సుజనా స్పందించారు. ఈ విషయంలో బీజేపీ వాయిస్ ఇస్తున్నారా అంటే అదేం లేదన్నారు సుజనా చౌదరి. కానీ ఆయన స్వరంలో మాత్రం బీజేపీ వాయిస్ వినిపిస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడని వివాదాస్పద అంశాలను ఆయన ప్రస్తావించడం గమనార్హం. అదేవిధంగా టీడీపీ ఘోర వైఫల్యానికి ప్రత్యేక హోదా పై పిల్లిమొగ్గలు వేయడం కారణం అన్నారు. ప్రత్యేక హోదాపై జగన్ వైఖరిని ఆయన సమర్థించారు. టీడీపీ వైఖరి వల్లే ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పలేదన్నారు.

అంతేకాదు, టీడీపీలో ఉంటూ కూడా ఆయన ఇప్పుడు అనేక వివాదాస్పద అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉనికిలో లేని కాంగ్రెస్‌తో స్నేహానికి వెళ్ళడమే ఘోర తప్పిదం అన్నారు సుజనా చౌదరి. 2014 ఎన్నికలలో బీజేపీతో వెళ్ళడం వల్ల నలుగురు ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచారు. 2014లో చంద్రబాబు విజయం సాధించడానికి పవన్, బీజేపీ కాంట్రిబ్యూషన్ కారణమయిందని ఒప్పుకున్నారు సుజనా చౌదరి. ఉనికిలో లేని పార్టీతో స్నేహం, ఉనికిలో లేని పార్టీతో యుద్దం అంటూ టీడీపీ బీజేపీతో వైరం గురించి, కాంగ్రెస్ స్నేహం గురించి ప్రస్తావించారు.

తాను టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్ని ఆయన ఖండించలేదు, అలాగని అవుననీ అనలేదు. టీడీపీ ఇలాగే సాగితే టీడీపీకి భవిష్యత్తు ఉండదని మాత్రం గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు.ఒకవేళ తనకు బీజేపీ వైపు వెళ్లాలని అనిపిస్తే మాత్రం అందరితో తప్పకుండా చెబుతానన్నారు. తనకు ఎవరితో కమిట్ మెంట్స్ లేవంటూనే తాను ఇండిపెండెంట్ వ్యక్తినన్నారు. నేనేదో కేసుల నుంచి బయటపడడానికి ఎవరినీ ఆశ్రయించడం లేదన్నారు. తనకు రాజకీయాలు  వద్దనుకుంటే మానేస్తానన్నారు.

చంద్రబాబు అనంతరం టీడీపీ నాయకత్వం గురించి సుజనా చౌదరి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. 2019 ఎన్నికలలో చంద్రబాబు ఘోర పరాజయం చెందడానికి గల కారణాల గురించి తాను వివరంగా  చెప్పానన్నారు. అయితే అవేం చంద్రబాబు వినలేదన్నారు. పార్టీ పరాజయం చంద్రబాబు వల్లే వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబుకి చెప్పారు. తాను ఫోన్ చేస్తే పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు చుట్టూ ఉన్న వ్యక్తుల సమాచారం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు సుజనా చౌదరి.

1996-2004 వరకూ తనకు తెలిసిన చంద్రబాబు బ్రాండ్ వేరు. 2014 నుంచి చంద్రబాబు ఇమేజ్ సన్నగిల్లిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణం చంద్రబాబుతో పాటు ఆయన వెనుక ఉన్నవారంతా కారణం అన్నారు. అందులో తాను కూడా ఉంటానన్నారు. తాను క్రమశిక్షణ కలిగిన వ్యక్తిని అంటూనే.. పార్టీ వైఖరిని తూర్పారబట్టారు.

ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద అనేక ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబుకి ఆ విషయం తెలుసు. కానీ ఆయన మొహమాటంతో వారిని మార్చలేదు. టెక్నాలజీ. సర్వేలు.. ఐవీఆర్ఎస్, ఆర్టీజీ.. ఇలా మనుషుల్ని నమ్ముకోకుండా మిషన్లను నమ్ముకోవడం, పొలిట్ బ్యూరో, పొలైట్ బ్యూరో గా మారిపోయిందన్నారు సుజనా. ప్రభుత్వం గురించి ఆలోచిస్తూ చంద్రబాబు పార్టీని నిర్లక్ష్యం చేశారన్నారు. అందుకే ఘోరంగా ఓటమి పాలు కావాల్సి వచ్చిందన్నారు. 

(ఇంకా ఉంది)

సుజనా చౌదరి టీడీపీని వీడుతున్నట్టేనా?-2

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

   38 minutes ago


ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

   2 hours ago


చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

   3 hours ago


ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

   8 hours ago


గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

   10 hours ago


ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

   10 hours ago


విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

   10 hours ago


‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

   10 hours ago


పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

   10 hours ago


 పాపం పసివాడు..  ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle