newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

‘సుజనా’ చేరికతో కమల దళంలో ఉత్తేజం?

16-07-201916-07-2019 17:04:29 IST
Updated On 16-07-2019 17:10:25 ISTUpdated On 16-07-20192019-07-16T11:34:29.324Z16-07-2019 2019-07-16T11:34:25.278Z - 2019-07-16T11:40:25.470Z - 16-07-2019

‘సుజనా’ చేరికతో కమల దళంలో ఉత్తేజం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ బీజేపీకి కొత్త చేరికలతో కొండంత బలం చేకూరుతోందా? 2024లో ఏపీలో బాగా బలపడతామంటున్న కమలదళం నేతల ఆశలు నిజమవుతాయా? అంటే అవుననే అనిపిస్తోంది. వైఎస్ చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ .. వరదాపురం సూరి వంటి టీడీపీ నేతల చేరిక అనంతరం బీజేపీ ఏపీపై అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏపీలో క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా లేదన్న సంగతి అందరికీ తెలిసిందే.

ముగ్గురు రాజ్యసభ ఎంపీలు.. అందునా టీడీపీ కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో వారికి తోడ్పాటుగా ఉన్న టీడీపీ క్యాడర్ ఎంతో కొంత బీజేపీలో చేరుతుందని భావిస్తున్నారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో బీజేపీ బలం రెట్టింపు అవుతుందని అంటున్నారు బీజేపీ కీలక నేతలు. 

కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని పటిష్టం చేస్తారని భావించారు. మంత్రిగా, కాంగ్రెస్ సీనియర్ నేతగా ఎంతో కొంత కాంగ్రెస్ క్యాడర్ ఆయనతో వస్తుందని భావించారు. అయితే ఆయన సామాజిక వర్గం వారు చెప్పుకోదగిన స్థాయిలో రాలేదు. జనసేన పార్టీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి పోటీచేయడంతో బీజేపీలోకి వస్తారని భావించిన వారంతా అటువైపు మళ్లారు.

దీంతో కన్నా లక్ష్మీనారాయణ అంతగా తన ప్రభావం చూపలేకపోయారు. ఇప్పుడు సుజనా చౌదరి రాకతో బీజేపీ కీలక బాధ్యతలు అప్పగిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని సుజనా చౌదరి ప్రకటించడం, టీడీపీ అధినేతపై ఘాటైన విమర్శలు చేయడంతో బీజేపీ నేతలు ఖుషీగా ఉన్నారు.

విజయవాడ, గుంటూరు సభల్లో సుజనా చౌదరికి వచ్చిన ఆదరణను పరిశీలిస్తే అధిష్టానం సుజనా చౌదరి అండ్ టీంకి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీని ఖాళీ చేయించే పని వేగవంతం అవుతుందని, వరుస ట్వీట్లు, తాజా ఘటనలతో అసహనంతో ఉన్న బెజవాడ ఎంపీ కేశినేని నాని కూడా తన మిత్రుడు సుజనా బాటలోకి వెళ్తారని అంటున్నారు.

టీడీపీ ఎన్డీయేనుంచి బయటకు రావడం తప్పని, ప్రభుత్వంలో కొనసాగితేనే బావుంటుందని తాను చంద్రబాబుకి చెప్పినట్టు సుజనా చౌదరి పదే పదే ఆ మాటల్ని గత ఆరు నెలలుగా ఉటంకిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా విషయం ముగిసిన అధ్యాయం అని ముందు చెప్పింది తానే అంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో కలవరం కలిగిస్తున్నాయి.

అంటే ఏపీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే సుజనా బీజేపీతో టచ్‌లో ఉన్నారని అర్థం అవుతోంది. బీజేపీలో చేరాక ఆయన తన అంతరంగాన్ని బయట పెట్టారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నానని ప్రకటించారు. విజయవాడ, గుంటూరు సభల్లో అడుగడుగునా ఫ్లెక్సీలు, ఎన్టీఆర్ ఫోటో ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే ముఖచిత్రానికి నాందిగా చెబుతున్నారు.

టీడీపీ నేతల్ని ఆకర్షించే పనిలో బీజేపీ నేతలు బిజీగా ఉన్నారనడానికి బీజేపీ పదాధికారుల సమావేశమే నిదర్శనంగా చెబుతున్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేసింది ధర్మపోరాటం కాదు అధర్మపోరాటం.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ముందు చెప్సింది నేనే.. అంటూనే దానికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్యాకేజీ  ఇస్తానని కేంద్రం ప్రకటించిందన్నారు సుజనాచౌదరి. ఏపీని అభివృద్ధి పధంలో నడపడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందనీ, దేశంలో ఏ రాష్ట్రానికి చెయ్యని కేంద్రం సాయం ఏపీకి చేసిందని సుజనా చౌదరి అన్నారు. 

బీజేపీ రాష్ట్రానికి చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ నేతలు విఫలమయ్యామని, మున్ముందు ఈ లోపం లేకుండా చూసుకుంటామంటున్నారు. రాష్ట్రానికి బీజేపీ న్యాయం చేస్తుందని బల్ల గుద్ది చెప్పారు.

ఐదేళ్ళ పాలనలో వివిధ అంశాలపై త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, పరోక్షంగా టీడీపీ పాలనపై వ్యాఖ్యలు చేశారు సుజనా చౌదరి. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్పలేను కానీ విచారణ జరిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ మరిచిపోయి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. 

భవిష్యత్తులో బీజేపీ,టీడీపీతో కలుస్తుందో లేదో తాను చెప్పలేనన్నారు. తన ఫ్లెక్సీలలో ఎన్టీయార్ ఫోటో ఎవరు పెట్టారో తనకు తెలీదు. నా ఫ్లెక్సీలలో ఎన్టీయార్ ఫోటో పెట్టడంలో తప్పులేదన్నారు సుజనాచౌదరి. ఏపీ తొలి పర్యటనలో సుజనా వ్యాఖ్యల వెనుక... అమిత్ షా ప్రోత్సాహం, దిశానిర్దేశం ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద సుజనా చౌదరి బీజేపీని పటిష్టం చేయబోతున్నారని తెలుస్తోంది. తాజా పరిణామాలను బట్టి త్వరలో ఏపీలో బీజేపీ నాయకత్వం మారినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle