newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

సుజనాతో టీడీపీ ఎమ్మెల్యే భేటీ! పార్టీ మార్పు ఖాయమా?

25-10-201925-10-2019 15:03:41 IST
Updated On 25-10-2019 15:15:32 ISTUpdated On 25-10-20192019-10-25T09:33:41.345Z25-10-2019 2019-10-25T09:27:20.706Z - 2019-10-25T09:45:32.382Z - 25-10-2019

సుజనాతో టీడీపీ ఎమ్మెల్యే భేటీ! పార్టీ మార్పు ఖాయమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీగా మారేందుకు ఆ పార్టీ నేతలు కట్టుదిట్టమైన ప్రణాళికతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీని బీజేపీ టార్గెట్‌ చేసినట్లుగా కనిపిస్తుంది. ఆ పార్టీలోని ముఖ్యనేతలను బీజేపీలో చేర్చుకోవటం ద్వారా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

దీనిలో భాగంగా ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. తాజాగా కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. మరోవైపు నేడోరేపో కర్నూల్‌కు చెందిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి బీజేపీ కండువా కప్పుకోబోతున్నాడు. వరుసగా టీడీపీలోని పలువురు నేతలు బీజేపీ కండువాలు కప్పుకోవటంతో టీడీపీ శ్రేణులను ఆందోళన గురిచేస్తుంది.

ఇదే సమయంలో కరుడుగట్టిన టీడీపీ నేతగా పేరున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీసైతం బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. గతంలో ఇలాంటి ప్రచారాన్ని వంశీ ఖండించినప్పటికీ తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆయన బీజేపీలోకి వెళ్తారని టీడీపీలోని పలువురు నేతలుసైతం పేర్కొంటున్నారు. బీజేపీ ఎంపీ సుజనాచౌదరితో శుక్రవారం వంశీ భేటీ కావటం ఇందుకు బలాన్ని చేకూర్చినట్లయింది.

శుక్రవారం గుంటూరులో ఎంపీ సుజనా చౌదరితో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. ఒంగోలు వెళుతూ గుంటూరులో ఆగిన సుజనాను కలిసిన వంశీ.. కొద్దిసేపు సమావేశమయ్యారు. తర్వాత ఒకే కారులో ఇద్దరూ కలిసి ఒంగోలు వెళ్లినట్లు తెలుస్తోంది. వంశీ సుజనాను కలవడం.. సమావేశం కావడం.. ఒకే కారులో వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

వంశీపై కొద్ది రోజుల క్రితమే ఫోర్జరీ సంతకాల ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తనపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని, టార్గెట్‌ రాజకీయాలు చేస్తుందని వల్లభనేని విలేకరుల సమావేశం పెట్టిమరీ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ పెడుతున్న కేసుల నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలోకి వెళ్లడమే మంచిదని వంశీభావించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే వంశీ బీజేపీ ఎంపీ సుజనాచౌదరితో భేటీ అయినట్లు ప్రచారం సాగుతుంది. మరోవైపు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఇసుక కొరతను నిరసిస్తూ ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి కూడా వెళ్లకుండా వల్లభనేని సుజనాతో భేటీ అయ్యారు.

వల్లభనేని వంశీ బీజేపీలో చేరుతారనే వార్తలను ఆయన వర్గీయులు ఖండిస్తున్నారు. వంశీ బీజేపీలో చేరేప్రసక్తే లేదని చెబుతున్నారు. సృజనాచౌదరిని కలిసింది కేవలం ఆయనపై వైసీపీ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల గురించి వివరించేందుకేనని పేర్కొంటున్నారు. వైపీసీ ప్రభుత్వం దొంగకేసులు పెట్టి వంశీని జైలుకు పంపాలని చూస్తుందని, దీంతో అవి తప్పుడు కేసులని ఆధారాలతో సుజనాను కలిసి వివరించేందుకు భేటీ అయినట్లు వంశీ వర్గీయులు పేర్కొంటున్నారు.

మరి వంశీ ఆయన వర్గీయులు పేర్కొంటున్నట్లు టీడీపీలోనే ఉంటారా..? వైసీపీ ప్రభుత్వం పెడుతున్న కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీలో చేరుతారా? అనే చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేపుతుంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle