newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

సుజనాచౌదరి టూర్లతో బీజేపీలో నయా జోష్

17-08-201917-08-2019 16:00:30 IST
Updated On 20-08-2019 11:47:01 ISTUpdated On 20-08-20192019-08-17T10:30:30.222Z17-08-2019 2019-08-17T10:30:21.478Z - 2019-08-20T06:17:01.983Z - 20-08-2019

సుజనాచౌదరి టూర్లతో బీజేపీలో నయా జోష్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో బీజేపీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బీజేపీ నేతలను అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. తానిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని బీజేపీలో చేరిన తర్వాత ప్రకటించిన సుజనా.. ఆదిశగా తన టూర్లను ప్లాన్ చేసుకుంటున్నారు. 

మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్.. ఇతర బీజేపీ నేతలతో కలిసి విశాఖలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు సుజనా చౌదరి. తమ వ్యక్తిగత వైరంతో బాధ్యతను మరిచి పరస్పరం వారు విమర్శలు చేసుకుంటున్నారని.. పోలవరంపై జగన్ ప్రభుత్వం పీపీఏ సలహాలు పాటించాల్సిన అవసరం వుందన్నారు. 

కృష్ణా నదికి వచ్చిన ముంపు వల్ల ఇబ్బందులు పడుతున్న లంక గ్రామాల ప్రజలను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలన్నారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసినప్పుడు ... ప్రధానమంత్రి నరేంద్రమోడీ పనితీరుని అతి దగ్గరగా చూసే అవకాశం తనకు కలిగింది. మూడ్ ఆఫ్ ది నేషన్ కి అనుగుణంగా తాము అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎంపీ సుజనాచౌదరి ఆరోపించారు.

Image may contain: 6 people, including Palle Ravanna Followers, P V Kondal Rao and Aravind Sharma, people smiling, people sitting and outdoor

గత ప్రభుత్వంలో ఏమైనా అక్రమాలు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తుందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలపరిచేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 

విశాఖ టూర్‌లో భాగంగా బీమా యోజన పథకం లబ్ధిదారులకు సుజనా చౌదరి బాండ్లు పంపిణీ చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాల డైరెక్షన్ కి అనుగుణంగా సుజనా చౌదరి తరచూ ఏపీలో పర్యటిస్తున్నట్టు కనిపిస్తోంది. 2024నాటికి బీజేపీని అజేయ శక్తిగా మార్చేందుకు సుజనా ప్రయత్నాలు చేస్తున్నారు.

బీజేపీ సభ్యత్వం పెంచేందుకు కూడా సుజనా తన పాత పరిచయాలను ఉపయోగించుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇంతకుముందు విజయవాడ, గుంటూరు పర్యటనల్లోనూ సుజనా దూకుడు ప్రదర్శించారు. బీజేపీ నేతలను ముందుకు నడిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బిజెపి నేతలు లక్ష్యం చేసుకున్నారని విషయం మరోసారి రుజువైంది.

వైఎస్ జగన్ పై బిజెపి నేత విష్ణుకుమార్ రాజు తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంట్రాక్టర్లను మాత్రమే ప్రస్తుత జగన్ ప్రభుత్వం లక్ష్యం చేసుకుంటోందని విష్ణుకుమార్ రాజు అన్నారు.

గంటా శ్రీనివాస రావు ఏ పార్టీలో ఉంటారో తేల్చుకోవాలని ఆయన అన్నారు. ఓట్లు వేసిన విశాఖ ప్రజలకు గంటా అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ఒకవేళ గంటా బిజెపిలోకి వస్తే స్వాగతిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద ఏపీ బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. 

Image may contain: 4 people, including Aravind Sharma and Kranti Kiran, people smiling, people standing and food

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle