newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

సీమ నేతల కొత్త వాదన..!

03-01-202003-01-2020 16:47:01 IST
Updated On 04-01-2020 13:02:07 ISTUpdated On 04-01-20202020-01-03T11:17:01.915Z03-01-2020 2020-01-03T11:16:45.775Z - 2020-01-04T07:32:07.809Z - 04-01-2020

సీమ నేతల కొత్త వాదన..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇప్పుడు పరిస్థితి .. ఎవరి గోల వారిదే. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రజలు మూడు ప్రాంతాలుగా విడిపోయి రాజధాని మాకు కావాలంటే మాకు కావాలని డిమాండ్లు చేశారు. అప్పుడు చివరికి అందరికీ మద్యంగా ఉంటూనే అభివృద్ధికి అవకాశం ఉన్న నగరంగా అవుతుందని అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని ఫిక్స్ చేశారు. అదంతా అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తర్వాత మూడు ప్రాంతాలలో మళ్ళీ అదే డిమాండ్లు.. అమరావతి ప్రాంతంలో ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ఇందులో ప్రధానంగా పరిసపాలన రాజధానిగా మారనున్న విశాఖతో ఉత్తరాంధ్ర వాసులు సంతృప్తిగా ఉన్నారు. మూడు ముక్కలలో మేలుగా మారేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని అందరికీ తెలిసిందే.

ఇక జుడీషియల్ క్యాపిటల్ అని హైకోర్టుని సీమలో ఏర్పాటు చేస్తామని ప్రకటించే అవకాశం ఉందని సీఎం చెప్పినపుడు ఆ ప్రాంత వాసులలో ఆనందం కనిపించినా అది ఎక్కువ సమయం నిలవలేదు. ఎందుకంటే ఒక్క హైకోర్టు వలన ఆ ప్రాంతంలో అద్భుతాలు జరిగే అవకాశం లేదని అందునా మిగతా రెండు ప్రాంతాలలో కూడా బెంచీల ఏర్పాటుతో ఒరిగేది ఏమీ లేదని ఆవేదన మొదలైంది.

పైగా పరిపాలన రాజధానిగా ఉన్న విశాఖకి రాయలసీమ నుండి వెళ్లాలంటే వెయ్యి కిమీ ప్రయాణం అవుతుందని అర్ధం కావడంతో ఆ ప్రాంతంలో పూర్తిస్థాయి రాజధాని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్లు మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్లు కొన్ని వినిపించాయి.

అయితే, ఇప్పుడు ఏపీలో పరిస్థితుల దృష్ట్యా సీమ నేతలు కొందరు పూర్తిస్థాయి రాజధాని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయండి లేదా తమ ప్రాంతాన్ని కర్ణాటకలో కలిపేయండి అని కొత్త డిమాండ్లు వినిపిస్తున్నారు. రాజధాని విశాఖకి వెళ్లడం కంటే కర్ణాటక రాజధాని బెంగళూరుకి వెళ్లడం తమకి సులభంగా ఉంటుందని మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ తిక్కారెడ్డి ఈ కొత్త డిమాండ్ చేశారు.

నిజానికి 1956కి ముందు తన నియోజకవర్గం మంత్రాలయం కర్ణాటకలోనే ఉండేదని.. ఇప్పుడు మళ్ళీ కర్ణాటకలోనే కలిపేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి ఇంకా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనపై ఖరారు ప్రకటనలు చేయలేదు. పరిస్థితిలు, కమిటీలు, పరిశీలనలతో కాలం నెట్టేస్తున్న ప్రభుత్వం జనవరి నెలాఖరున ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఆ ప్రకనటన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో?!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle