newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

సీమ నుంచే సీట్ల పంపకం... స్పీడ్ పెంచిన బాబు

22-02-201922-02-2019 12:05:01 IST
Updated On 23-02-2019 18:51:10 ISTUpdated On 23-02-20192019-02-22T06:35:01.590Z22-02-2019 2019-02-22T06:34:37.534Z - 2019-02-23T13:21:10.234Z - 23-02-2019

సీమ నుంచే సీట్ల పంపకం... స్పీడ్ పెంచిన బాబు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబు యుద్ధం మొదలెట్టేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు శంఖం ఊదేశారు. పలువురు అభ్యర్ధుల పేర్లు ప్రకటించారు చంద్రబాబు. గత ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ బలహీనంగా ఉంది. దీంతో చంద్రబాబు తన ఫోకస్ అంతా సీమపైనే పెట్టారు. రాజంపేటకు చెంగల్రాయుడు.. మైదుకూరుకు సుధాకర్‌ యాదవ్‌, కమలాపురానికి పుత్తా నరసింహారెడ్డి, రైల్వేకోడూరు అభ్యర్థిగా ఎంపీ శివప్రసాద్‌ అల్లుడైన నరసింహ ప్రసాద్‌ పేర్లు ఖరారయ్యాయి. లోక్‌సభ నియోజకవర్గాల వారీ సమీక్షలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థుల  ఎంపికపై దృష్టి పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలను పరిష్కరించే పనిలో ఉన్నారు.

రాజంపేట, తరువాత కడప లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై చంద్రబాబు సమీక్షించారు. రాజంపేట సమీక్షలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు శాసనసభ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించారు. రాజంపేటపై పి.బ్రహ్మయ్య ఆశపడ్డారు. కానీ చివరాఖరికి చెంగల్రాయుడికి అవకాశం దక్కింది. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు పోటీపడగా రమేష్‌రెడ్డికే మరోసారి అభ్యర్థిత్వం ఖరారైంది. రైల్వేకోడూరు అభ్యర్థిగా ఎంపీ శివప్రసాద్‌ అల్లుడైన నరసింహ ప్రసాద్‌ను ఎంపిక చేశారు. 

రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చిత్తూరు జిల్లా పీలేరు నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు, గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌ కిషోర్‌కుమార్‌రెడ్డికి అవకాశం దక్కింది. పుంగనూరు నుంచి మంత్రి అమరనాథరెడ్డి మరదలు అనీషారెడ్డికి అవకాశమిచ్చారు. ఈ రెండు నియోజకవర్గాలపై గతంలోనే చంద్రబాబు స్పష్టతనిచ్చారు. తంబళ్లపల్లిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు. మదనపల్లి స్థానం పెండింగ్‌లో ఉంది. 

కడప లోక్‌సభ నియోజకవర్గంపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. మైదుకూరుకు పుట్టా సుధాకర్‌ యాదవ్‌, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి, పులివెందుల నుంచి సతీష్‌కుమార్‌రెడ్డిల అభ్యర్థిత్వాలు గతంలోనే ఖరారు చేశారు. కమలాపురం నియోజకవర్గ అభ్యర్థిత్వం కోసం వీరశివారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి మధ్య గట్టి పోటీ ఉంది. రాత్రి పదకొండున్నర గంటల వరకు చర్చ అనంతరం పుత్తా నరసింహారెడ్డికి టికెట్‌ ఇచ్చారు. ఈనెలాఖరునాటికి 100 సీట్లలో అభ్యర్ధులను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle