newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

సీమ‌కు జ‌గ‌న్ తీపిక‌బురు చెప్ప‌నున్నారా..?

02-10-201902-10-2019 09:16:16 IST
2019-10-02T03:46:16.124Z02-10-2019 2019-10-02T03:45:27.878Z - - 16-11-2019

సీమ‌కు జ‌గ‌న్ తీపిక‌బురు చెప్ప‌నున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి రాజ‌కీయంగా రాయ‌ల‌సీమ ప్రాంతం కంచుకోట లాంటిది. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షంలో ఉన్నా సీమ‌లో అత్య‌ధిక సీట్లు జ‌గ‌న్ గెలుచుకున్నారు.

ఇక‌, ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అన్ని ఎంపీ స్థానాల‌నూ ద‌క్కించుకుంది. సీమ ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌పై ఉన్న సానుకూల‌త‌కు ఈ ఫ‌లితాలే నిద‌ర్శ‌నం. అంత‌లా జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం పెట్టుకున్న సీమ‌వాసుల‌కు జ‌గ‌న్ త్వ‌ర‌లోనే తీపిక‌బురు చెప్ప‌నున్నారా అనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని, లేక‌పోతే మ‌ళ్లీ ప్రాంతీయ విభేదాలు వ‌స్తాయ‌ని గ‌తంలో ప‌లు పార్టీలు, మేధావులు చెప్పినా అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాత్రం అమ‌రావ‌తిపైనే దృష్టి పెట్టారు.

అమ‌రావ‌తిని ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధాని చేయాల‌ని త‌లిచారు. అయితే, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌లు గ‌డుస్తున్నా అమ‌రావ‌తి ప‌నులు మాత్రం ముందుకు సాగ‌డం లేదు.

అమ‌రావ‌తి విష‌యంలో గ‌త ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు, జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌కు స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంది. అందుకే అమ‌రావ‌తిపై అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి. అయితే, అమ‌రావ‌తిని కొన‌సాగించ‌మ‌ని మాత్రం జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా చెప్ప‌లేదు.

కానీ, అమ‌రావ‌తిపై అనుమానాలు త‌లెత్త‌డంతో రాయ‌ల‌సీమ‌లో డిమాండ్లు మొద‌ల‌య్యాయి. గ‌తంలో క‌ర్నూలు రాజ‌ధానిని తాము వ‌దులుకున్నామ‌ని, ఇప్పటికైనా రాజ‌ధానిని క‌ర్నూలులో పెట్టి త‌మ ప్రాంతానికి న్యాయం చేయాల‌నే డిమాండ్లు ఊపందుకున్నాయి.

రాజ‌ధాని కాక‌పోయినా హైకోర్టు మాత్రం క‌చ్చితంగా క‌ర్నూలులో పెట్టాల‌ని సీమలోని ప్ర‌జా సంఘాలు కోరుతున్నాయి. విద్యార్థులైతే ఐకాస‌గా ఏర్ప‌డి ఉద్య‌మాన్ని సైతం ప్రాంరంభించాయి.

మంత్రుల కార్యక్ర‌మాల‌ను అడ్డుకొని త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేశారు. మ‌రోవైపు క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ 20 రోజులుగా న్యాయ‌వాదులు రిలే దీక్ష‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో హైకోర్టు క‌ర్నూలులో పెట్ట‌క‌పోతే ఉద్య‌మిస్తామ‌ని ఎంపీ టీజీ వెంక‌టేష్ ప్ర‌క‌టించారు.

అయితే, త్వ‌ర‌లోనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రాయ‌ల‌సీమ‌కు తీపిక‌బురు చెబుతార‌ని వైసీపీ క‌ర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. న్యాయ‌వాదుల పోరాటానికి ఆయ‌న మ‌ద్ద‌తు తెల‌ప‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్‌పై త‌మ‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని, రాజ‌ధాని సంగ‌తి త‌న‌కు తెలియ‌దు కానీ హైకోర్టు విష‌యంలో త్వ‌ర‌లో తీపిక‌బురు వ‌స్తుంద‌ని చెప్పారు.

సంజీవ్ వ్యాఖ్య‌ల‌తో సీమ‌లో హైకోర్టు ఏర్పాటుపై జ‌గ‌న్ సానుకూలంగా ఉన్నార‌నే అభిప్రాయాలు ఏర్ప‌డ్డాయి. అయితే, ఇదే స‌మ‌యంలో హైకోర్టును అమ‌రావ‌తి నుంచి త‌ర‌లించ‌వ‌ద్ద‌ని కృష్ణ‌, గుంటూరు జిల్లాల న్యాయ‌వాదులు సైతం డిమాండ్ చేస్తున్నారు.

మ‌రి, హైకోర్టు విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle