newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

సీమ‌కు ఇక‌నైనా న్యాయం చేయండి..!

25-09-201925-09-2019 18:05:03 IST
2019-09-25T12:35:03.413Z25-09-2019 2019-09-25T12:35:01.516Z - - 09-12-2019

సీమ‌కు ఇక‌నైనా న్యాయం చేయండి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
త‌మ ప్రాంతానికి ఏళ్లుగా అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆరోపిస్తూ రాయ‌ల‌సీమ యువ‌త గొంతెత్తింది. విద్యార్థి లోక‌మంతా ఏక‌మ‌వుతోంది. ఉద్య‌మానికి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టిస్తోంది. రాయ‌ల‌సీమ‌కు న్యాయం చేయాల‌నే డిమాండ్‌తో బుధ‌వారం క‌ర్నూలులోని రాయ‌ల‌సీమ విశ్వ‌విద్యాల‌యంలో రాయ‌ల‌సీమ విద్యార్థి, యువ‌గ‌ర్జ‌న స‌భ‌ను నిర్వ‌హించారు. రాయ‌ల‌సీమ‌లో రాజ‌ధాని, హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు.

రాయ‌ల‌సీమ‌కు న్యాయం చేయాల‌నే డిమాండ్‌తో విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్ప‌డ్డాయి. జేఏసీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన విద్యార్థి, యువ‌గ‌ర్జ‌న వేదిక‌గా ఉద్య‌మానికి సిద్ధ‌మ‌ని విద్యార్థి నేత‌లు ప్ర‌క‌టించారు. గ‌తంలో రాజ‌ధానిగా ఉన్న క‌ర్నూలును తొల‌గించి త‌మ‌కు అన్యాయం చేశార‌ని, మ‌రోసారి అన్యాయం చేస్తే స‌హించ‌మ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. సీమ‌లో రాజ‌ధానిని, హైకోర్టును ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారు.

ఒక‌వేళ రాజ‌ధాని ఏర్పాటు కుద‌ర‌క‌పోతే రెండో రాజ‌ధానిని, హైకోర్టును మాత్రం క‌చ్చితంగా రాయ‌ల‌సీమ‌లోనే ఏర్పాటుచేయాల‌ని విద్యార్థులు ఈ వేదిక మీదుగా డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే తాము సీమ జిల్లాల్లో దీక్ష‌లు చేస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే ఈ డిమాండ్‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నివాసాన్ని ముట్ట‌డిస్తామ‌ని ప్ర‌క‌టించారు. గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం సీమ‌కు అన్యాయం చేసింద‌ని, ఇప్పుడు వైసీపీ అన్యాయం చేయ‌వ‌ద్ద‌ని కోరుతున్నారు.

మ‌రోవైపు అమ‌రావ‌తిలోనే హైకోర్టును కొన‌సాగించాల‌నే డిమాండ్ కూడా కృష్ణ‌, గుంటూరు జిల్లాల్లో ఊపందుకుంటోంది. ఈ మేర‌కు ఆ జిల్లాల బార్ కౌన్సిల్ ఆధ్వ‌ర్యంలో న్యాయ‌వాదులు శాంతియుత నిర‌స‌న‌ల‌కు దిగుతూ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. రాజ‌ధానిని, హైకోర్టును త‌ర‌లించ‌వ‌ద్ద‌ని వారు స్ప‌ష్టం చేస్తున్నారు.

రాష్ట్రంలో వైసీపీ స‌ర్కార్ వ‌చ్చాక రాజ‌ధాని విష‌యంపై గంద‌ర‌గోళం నెల‌కొంది. రాజ‌ధానిలో టీడీపీ ప్ర‌భుత్వం ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌కు పాల్ప‌డింద‌ని, అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, అమ‌రావ‌తికి వ‌ర‌ద ముప్పు ఉంద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌లుమార్లు వ్యాఖ్యానించ‌డంతో అమ‌రావ‌తి కొన‌సాగుతుందా లేదా అనే అనుమానాలు త‌లెత్తాయి. అయితే, అమ‌రావ‌తిని మార్చ‌మ‌ని కానీ, మారుస్తామ‌ని కానీ ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా చెప్ప‌డం లేదు.

కాక‌పోతే అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌రిగి అన్ని ప్రాంతాల‌కు న్యాయం చేయాల‌నే ఆలోచ‌న‌తో ప్ర‌భుత్వం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా ఇదే డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌కు న్యాయం చేయాల‌ని బీజేపీ ప‌దేప‌దే చెబుతోంది. దీంతో రాయ‌ల‌సీమ‌కు జ‌గ‌న్ స‌ర్కార్ ఎలా న్యాయం చేస్తుంద‌నేది చూడాల్సి ఉంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle