newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

సీమలో బలం పుంజుకుంటున్న ‘ప్రత్యేక’ ఉద్యమ భావజాలం

10-08-201910-08-2019 11:16:08 IST
2019-08-10T05:46:08.360Z10-08-2019 2019-08-10T05:46:04.209Z - - 15-11-2019

సీమలో బలం పుంజుకుంటున్న ‘ప్రత్యేక’ ఉద్యమ భావజాలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రాంతీయ అసమానతలు, అభివృద్ధిలో అంతరాలు ఇవే వేర్పాటు వాదానికి బీజాలు అవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికైనా, గూర్ఖాల్యాండ్ కోసం దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటమైనా మూలాలు మాత్రం అభివృద్ధి, అంతరాలు మాత్రమే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలుగా విడిపోవడం వరకూ జరిగినది ఏమిటన్నది మనకు తెలుసు. అయితే తెలుగువారి ప్రాంతాల విభజన ఇంకా పూర్తయ్యిందని పించదు. 

విభజిత ఆంధ్రప్రదేశ్ మరో విభజన ఉద్యమానికి వేదిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే ప్రత్యేక రాయలసీమ. ప్రత్యేక రాయల సీమ ఉద్యమ భావజాలం చాపకింద నీరులా విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రాతనాల సీమగా అఖండ ఖ్యాతినార్జించిన రాయలసీమ ఇప్పుడు కరువు సీమగా విలవిల్లాడుతున్నది. నీతి కొరత అక్కడ ఏడాది పొడవునా ఉంటుంది. సీమ సమస్యల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ కూడా పరిష్కార మార్గాలు కనుగొనడంలో కానీ, సమస్యల పరిష్కారం కోసం కానీ ప్రభుత్వాలు ఏ మాత్రం శ్రద్ధ చూపని ఫలితమే అక్కడి ప్రజలలో అసంతృప్తి సొంత రాష్ట్ర సెంటిమెంట్ గా రూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

ఈ సెంటిమెంట్ ను ప్రజలలో రెచ్చగొట్టేందుకు రాజకీయ పార్టీలు కూడా యధాశక్తి తమ వంతు కృషి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రాయల సీమ డిక్లరేషన్ పేరుతో బీజేపీ చేసిన హడావుడి...ఈ కోవలోనికే వస్తుంది. వాస్తవానికి రెండో దశ తెలంగాణ ఉద్యమ కాలంలోనే....రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ కూడా కొంచం బలహీనంగానైనా వినిపించింది. అయితే అప్పుడు అంత గట్టిగా వినిపించని సీమ ప్రత్యేక గళం...ఈ ఐదేళ్ల కాలంలో క్రమంగా బలం పుంజుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు అధికారంలో ఉన్న వారు సీమ సమస్యల పట్ల శ్రద్ధ చూపకపోవడమే కారణమనడంలో సందేహం లేదు. దశాబ్దాలుగా అభివృద్ధి, ఉపాధి, విద్య, ఉద్యోగ అవకాశాలలో నిర్లక్ష్యానికి గురయ్యామన్న అసంతృప్తి సీమ జనంలో గూడుకట్టుకుంటున్నది. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా, ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ ను తీసుకున్నా...ఎక్కువ మంది ముఖ్యమంత్రులు సీమ వాసులే. విభజిత ఆంధ్రప్రదేశ్   విషయంలో అయితే తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. 

ఆయన హయాంలో పట్టిసీమ ద్వారా సీమకు నీరందింది. అయితే అది సాగు సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించే స్థాయిలో కాదు. ఆ ఒక్క విషయం తప్పిస్తే సీమలో ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిన పరిశ్రమలలో చాలా వరకూ గ్రౌండ్ కాలేదు. సీమ ప్రగతి విషయంలో నిర్లక్ష్యానికి గురౌతున్నదన్న వాదన నిన్న ఇవాళిటిది కాదు. అయినా ఆ దిశగా దృష్టి పెట్టని పాలకుల పాపమే ఇప్పుడు అక్కడ వినిపిస్తున్న వేర్పాటు గళం. ప్రత్యేక రాయలసీమ డిమాండ్. వాస్తవానికి జనంలో ఈ భావనలను ప్రోదికావడానికి కారకులు కూడా రాజకీయ నేతలే అని చెప్పాలి. తమ రాజకీయ ప్రయోజనం కోసం రాజకీయ పార్టీలు సీమ ప్రజలను ‘ప్రత్యేక’ వాదం వైపు మళ్లించడానికి చేసిన ప్రయత్నాలే అక్కడి జనంలో సెంటిమెంటుగా రూపుదిద్దుకోవడానికి కారణమయ్యాయి. సాగు, తాగు నీటి సమస్యల కారణంగా కొందరు సీమ నేతలు కూడా ప్రత్యేక రాయల సీమ వాద వ్యాప్తికి తమ వంతు దోహదం చేశారు. ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత సీమలో అసంతృప్తి అధికమైందని చెప్పాలి.

 రాష్ట్ర విభజన తరువాత కూడా సీమకు న్యాయం జరగలేదనీ, జరగడం లేదన్న ఆసంతృప్తి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. పారిశ్రామిక ప్రగతి పూజ్యం కావడంతో యువతలో అసంతృప్తి తారస్థాయికి చేరుకున్నట్లు గోచరిస్తున్నది. చంద్రబాబు హయంలో సీమలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినా, ప్రాజెక్టులు ప్రతిపాదించినా అవెప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి.   ఎన్టీఆర్ హయాంలో  ప్రారంభమైన హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులు ఇంకా కొన‘సాగు’తూనే ఉన్నాయి.  ఈ ప్రాజెక్టుల పట్ల అలవిమాలిన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ....హడావుడిగా పురుషోత్తపట్నంను తెర విూదకు తీసుకురావడం సీమ పట్ల అధికారంలో ఉన్నవారికి ఉన్న నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా సీమ జనం భావిస్తున్నారంటే వారిని ఎలా తప్పుపడతాం?

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle