సీమలో గ్రిప్ దొరుకుతుందా..?
02-12-201902-12-2019 08:06:22 IST
2019-12-02T02:36:22.557Z02-12-2019 2019-12-02T02:36:10.453Z - - 15-12-2019

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమపై కన్నేశారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కంచుకోటగా ఉన్న రాయలసీమలోనే తన పార్టీకి గ్రిప్ కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమ వాసుల ఆకాంక్షలపై గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. ఐదు రోజుల పాటు రాయలసీమ పర్యటన పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వంత జిల్లా కడపలోనే పర్యటనను ప్రారంభించారు. రాయలసీమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఆయువుపట్టుగా ఉండేది. ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రం అప్పుడప్పుడూ తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ఉండేది. జగన్ వైసీపీని స్థాపించిన తర్వాత సీమ జిల్లాలు వైసీపీ వైపు మొగ్గు చూపాయి. 2014లో అనంతపురం జిల్లాలో మాత్రమే టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో సీమ మొత్తం ఫ్యాన్ క్లీన్ స్వీప్ చేసేసింది. సీమ జిల్లాల్లోనూ 52 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 49 గెలుచుకుంది. అన్ని ఎంపీ సీట్లనూ గెలుచుకుంది. ఇంతలా వైసీపీకి పట్టున్న రాయలసీమపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సీమవాసులు కష్టాలు, కరువుపై గళం విప్పి, వారి మనస్సులు గెలుచుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన కడప జిల్లా రైల్వే కోడూరులో రైతులతో సమావేశమయ్యారు. రాయలసీమ సారవంతమైన నేల అని, ఈ ప్రాంతాన్ని నాయకులే కరువు పీడిత ప్రాంతంగా మార్చారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సీమ రైతుల గురించి జగన్ ఆలోచించరని, రైతులు బాగుపడితే తనను ఎవరూ పట్టించుకోరనేది జగన్ బాధ అని చెప్పుకొచ్చారు. జగన్‌ది ఫ్యాక్షన్ నేపథ్యం అని సైతం పవన్ కళ్యాణ్ మరోసారి చెప్పారు. ఆయన చీనిచెట్లు నరికిస్తారని ఆరోపించారు. వైసీపీ రాయలసీమలో బెదిరింపు రాజకీయాలు చేస్తుందనేది పవన్ కళ్యాణ్ భావన. అందుకే, వైసీపీ నేతల బెదిరింపులను జనసైనికులు, ప్రజలు ఎదుర్కోవాలని పవన్ పిలుపునిచ్చారు. సీమ వాసుల కష్టాలపై, రైతుల సమస్యలపై త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక, జగన్ కొంతమందికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఆయనను జగన్ రెడ్డి అని పిలుస్తున్నట్లు చెప్పారు. అంటే జగన్ రెడ్డిలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, సీమ జిల్లాల్లో ప్రభావితం చూపగలిగే స్థాయిలో ఉన్న కాపు - బలిజ తనవైపు తిప్పుకునేందుకు పవన్ వ్యూహాలు రచిస్తున్నారనే చర్చ జరుగుతోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు చిరంజీవి స్వంత నియోజకవర్గంలో ఓడిపోయినా రాయలసీమలోని తిరుపతిలో గెలవడానికి ఇక్కడ ఆ సామాజికవర్గ ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటమే కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే, ఇటీవలి ఎన్నికల్లో సీమ జిల్లాల్లో వైసీపీకి దక్కిన విజయం కుల, బెదిరింపు రాజకీయాలతోనో వచ్చింది కాదు. అంతకుమించి జగన్ పట్ల నమ్మకం, సీమకు ఆయన మంచి చేస్తారనే ఆశతోనే సీమప్రజలు వైసీపీని గెలిపించారనేది స్పష్టం. మరి, ఈ నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకోకపోతేనే సీమలో పట్టు సాధించాలనే పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కనుక సీమ ప్రజల ఆకాంక్షలను జగన్ నెరవేర్చగలిగితే పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఫలించడం కష్టమే. మొత్తానికి కష్టాల సుడిగుండంలో ఉన్న సీమ రైతన్నల కష్టాలపై పవన్ కళ్యాణ్ గళమెత్తడం మాత్రం మంచి పరిణామమే.

రాజధాని అమరావతిలోనే.. జగన్ క్లారిటీ
14-12-2019

దిశ తండ్రి బదిలీ.. కేసీయార్‌కి థ్యాంక్స్
14-12-2019

పెద్దల సభకు కవిత... వినోద్‌కు మొండిచెయ్యేనా?
14-12-2019

జగన్ సర్కార్ నిర్ణయంపై ప్రశంసలు
14-12-2019

జగన్ ప్రకటనతో ఇరుకునపడ్డ కేసీఆర్
14-12-2019

తొలిసారి జగన్‌కు చంద్రబాబు సపోర్ట్..దిశ బిల్లుకు సభ ఆమోదం
13-12-2019

క్షమాపణలు చెప్పను.. మోడీ కూడా అదేమాటన్నారు!
13-12-2019

ఈ రంగులేంటి? వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
13-12-2019

విమర్శలను ఎదుర్కొనే దమ్ములేదా?
13-12-2019

చంద్రబాబుపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం
13-12-2019
ఇంకా