newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సీమలో ''ఉరే'నియం''.. జగన్ నోరువిప్పరే!

10-10-201910-10-2019 11:06:53 IST
Updated On 10-10-2019 11:39:21 ISTUpdated On 10-10-20192019-10-10T05:36:53.761Z10-10-2019 2019-10-10T05:36:50.558Z - 2019-10-10T06:09:21.032Z - 10-10-2019

సీమలో ''ఉరే'నియం''.. జగన్ నోరువిప్పరే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ప్రతిపక్షాలకు దొరికిన అస్థ్రాలలో యురేనియం శాంపిల్స్ తవ్వకాలు ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల గుట్టుచప్పుడు కాకుండా ఈ శాంపిల్స్ తవ్వకాలు జరుపుతున్నారన్నది ప్రతిపక్షాల వాదన. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నెల్లూరు జిల్లాలో ఓ చోట కూడా పంటల కోసం బోరెవెల్స్ పేరుతో యురేనియం శాంపిల్స్ కోసం డ్రిల్లింగ్ చేయడం రైతులను ఆయా జిల్లాల ప్రజలలో కలకలంరేపింది. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పడుతున్న అవస్థలు, ఆయా గ్రామాల ఆరోగ్య పరిస్థితులతో యురేనియం అనగానే ఉలిక్కి పడుతున్నారు.

తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంపై ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ కర్మాగారం, దానికి చుట్టుపక్కల గ్రామాలలో పర్యటించి నివేదిక కూడా అందించింది. కర్మాగారం వలన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నది నిజమేనని ముందు అత్యవసరంగా అక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో శుద్ధమైన తాగునీటిని కూడా అందించాలని సూచిందింది. కానీ ప్రభుత్వం కానీ ఆ కర్మాగారం కానీ ఆ తరహా ఏర్పాట్లేమీ అక్కడ చేసిన దాఖలాలు లేవు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ యురేనియం తవ్వకాలు అనగానే ప్రజలు గుండెల్లో హడలిపోతున్నారు. తుమ్మలపల్లి, కేకేకొట్టాలా గ్రామాలలో ఈ యురేనియం బాధితులు పరిస్థితి దీనంగా ఉన్నట్లు తెలుస్తుంది.

యురేనియం కర్మాగారం నుండి వెలువడిన విషపదార్ధాలు తిరిగి మళ్ళీ భూమిలో కలిసి ప్రజలు తాగే నీరు.. పీల్చే గాలి.. పంటలు ఇలా అన్నీ విషపూరితమై రోగాలను తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే ఆయా గ్రామాల ప్రజల చర్మంపై అంతుబట్టని గడ్డలు ఏర్పడుతుండగా మహిళలు గర్భం ధరించినా నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పంటల పరిస్థితి కూడా అంతే కొన్ని చోట్ల పంటలు నీరు పెట్టిన తరువాత క్రమేపి ఎండిపోతుంటే.. మరి కొన్ని చోట్ల పంటలు పువ్వు దశ నుండి కాయ దశకు వెళ్లే ప్రక్రియతో ఆగిపోతుంది. వారి పరిస్థితిని చూస్తున్న ఏపీ ప్రజలు మిగతా జిల్లాలలో తవ్వకాలపై ఉలిక్కిపడుతున్నారు.

అయినా కొన్ని సంస్థలు మాత్రం ఏదొక మార్గాన తవ్వకాలు జరిపి శాంపిల్స్ సేకరిస్తున్నారు. గత నాలుగైదు రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఓ ప్రైవేట్ సంస్థ భారీ మిషనరీతో సుమారు ఆరు వందల అడుగుల వరకు డ్రిల్లింగ్ వేసి శాంపిల్స్ తీసుకున్నారు. వ్యవసాయ బోర్ల పేరుతో సంస్థలు ఈ డ్రిల్లింగ్ చేస్తున్నాయి. ఈ డ్రిల్లింగ్ పై స్పందించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అక్కడి శాంపిల్స్ సేకరణకు అడ్డుపడడంతో సంస్థ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మొత్తం జిల్లాలో మూడు చోట్ల ఈ శాంపిల్స్ సేకరించారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలన్నీ అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రభుత్వం తీరుపై మండిపడ్డాయి.

ఒకపక్క తెలంగాణ ప్రభుత్వం తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో చట్టం చేయగా ఏపీ ప్రభుత్వం మాత్రం తవ్వకాలను చూస్తూ ఉండిపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. ఇప్పటికే సేవ్ నల్లమల, సేవ్ ఆళ్లగడ్డ పేరుతో అఖిలప్రియ ఓ ఉద్యమాన్ని మొదలుపెట్టగా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో యురేనియం తవ్వకాలపై ఉద్యమాన్ని మొదలుపెట్టేందుకు కమ్యూనిస్టులు సిద్ధమవుతున్నారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా నోరు మెదపడం లేదు. ప్రతిపక్షాలు చేసే విమర్శలు అయనను వినిపించడం లేదో.. అయన వరకు ఆరోపణలు వెళ్లడం లేదో కానీ అయన మాత్రం కీప్ సైలెంట్ అంటున్నారు.

సొంత పార్టీ నేతలు.. ప్రభుత్వం నేతలు ఆయనకు ఎలాగూ చెప్పడం లేదు. కనీసం మీడియా అయినా ప్రతిపక్షాల వాయిస్ ఆయనకు వినిపిద్దామంటే.. ఆయన చెప్పింది విని రాసుకు వెళ్లే వాళ్ళకి మాత్రమే అయన అవకాశం ఇస్తున్నారు.. ఆ ఛానెల్స్ కి మాత్రమే అక్కడి నుండి పిలుపు వస్తుంది. తుమ్మలపల్లి పరిశ్రమ బాధితులకు తీసుకున్న చర్యలేంటి.. ఆళ్లగడ్డ తవ్వకాలేంటి.. రాయలసీమలో యురేనియం కలకలం ఏంటి అన్న దానిపై మంత్రులను అడిగితే.. తాము తవ్వకాలకు వ్యతిరేకం.. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అనుమతులిస్తే తాము వ్యతిరేకిస్తున్నాం అని యధావిధిగా సమాధానం వస్తుంది. కానీ రాష్ట్రంలో మాత్రం యధావిధిగా ఆయా సంస్థలు చేయాల్సింది చేసుకుపోతున్నారు. ప్రతిపక్షాలు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. సీఎం మాత్రం కీప్ సైలెంట్ అంతే!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle