newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

సీబీఐకి చెమటలు.. ఓ తెలుగోడి ఆటలు

03-12-201803-12-2018 14:15:59 IST
Updated On 03-12-2018 14:01:24 ISTUpdated On 03-12-20182018-12-03T08:45:59.765Z03-12-2018 2018-12-03T08:31:24.623Z - 2018-12-03T08:31:24.628Z - 03-12-2018

సీబీఐకి చెమటలు.. ఓ తెలుగోడి ఆటలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీబీఐ విశ్వసనీయత ప్రశ్నార్థకం అయిన వేళ ఒక తెలుగు వ్యక్తి పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అసలు ఆ సంక్షోభానికి తెలుగు వ్యక్తే ప్రధాన కారణం అంటారు. సీబీఐ అధికారులకే లంచం ఇవ్వజూపారన్న కేసులో వ్యాపారి సానా సతీష్ బాబు ఆస్తులపై దాడులు కూడా జరిగాయి. ఓ కేసులో సీబీఐ అత్యున్నత అధికారిగా ఉన్న రాకేష్‌ ఆస్తానా మధ్యవర్తి ద్వారా రూ.5 కోట్లు లంచం అడిగారంటూ చేసిన ఆరోపణ ఇప్పుడు సీబీఐని ఓ కుదుపు కుదిపింది. మాంసం ఎగుమతిదారుడు మొయిన్ ఖురేషీ పన్ను ఎగవేత కేసులో ఊరట కలిగించేందుకు సతీష్ బాబు సిబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానాకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ వ్యాపారిగా అందరికీ తెలిసిన సాన సతీశ్‌బాబు ప్రస్థానంలో ఎన్నో కీలక ఘట్టాలున్నాయి. సతీష్ బాబు ఫిర్యాదుతోనే సీబీఐ అడిషనల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా, డీఎస్పీ దేవేంద్ర కుమార్‌ల వ్యవహారం బయటికొచ్చింది. తనకు రక్షణ కల్పించాలంటూ ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.  ఇరవైయేళ్ల క్రితం సాధారణ చిరుద్యోగిగా ఉన్న 46 ఏళ్ళ సతీష్ బాబు వెనుక ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? వివాదాలు ఎలా చుట్టుముట్టాయి? అసలు సతీష్ ఉత్థానపతనాల వెనుక ఏం జరిగిందో తెలుసుకోవడం ఎంతో అవసరం.  

సబ్ ఇంజనీర్ నుంచి 25 కంపెనీలకు డైరెక్టర్ 

డిప్లమో పూర్తిచేసిన సతీశ్‌‌బాబుకు కారుణ్య నియామకం కింద విద్యుత్ శాఖలో సబ్‌-ఇంజినీరుగా ఉద్యోగం వచ్చింది. విధి నిర్వహణలో లంచం అడిగారన్న కేసులో సతీష్ బాబుని కొన్నాళ్ళు సస్పెండ్ కూడా చేశారు. ఉద్యోగిగా ఉన్నప్పటినుంచి సతీష్ బాబుది బిజినెస్ మైండ్. ఎలాగైనా బిజినెస్ చేయాలని ఆలోచించాడు. స్థానిక రాజకీయనేతలతో పరిచయాలు పెంచుకున్నాడు. కాకినాడలో విధులు నిర్వహిస్తూ 2004లో లాంగ్ లీవ్ పెట్టి, 2005లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అనంతరం కాంట్రాక్టర్‌గా మారి అనేక వ్యాపారాలను నిర్వహించారు. పద్నాలుగేళ్ల కిందటే హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు.శ్రీనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే తన వ్యాపారం ప్రారంభించాడు. వీఐపీలు ఈయన ఫ్లాట్‌కి వచ్చి వెళ్ళేవారని చెబుతారు. సానా సతీష్ బాబుకు క్రికెట్ అంటే ఇష్టం. స్కూలు కాలేజ్ రోజుల్లోనే ఆయన క్రికెట్ బాగా ఆడేవారని సన్నిహితులు చెబుతున్నారు. ఆ ఆట కారణంగానే ఎంతోమంది పరిచయం కలిగింది. ప్రఖ్యాత క్రికెటర్‌, రాజమండ్రికి చెందిన వి.చాముండేశ్వరీనాథ్‌ వంటి ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలతో ఆల్‌ ఇండియా క్రికెట్‌ అసోసియేషన్‌ మ్యూజియం కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించాడు. సచిన్ టెండూల్కర్, ఇతర క్రికెటర్లకు చాముండేశ్వరి నాథ్ ద్వారా బహుమతులు కూడా ఇచ్చేవాడని తెలుస్తోంది. గతంలో తూర్పుగోదావరి జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శిగానూ వ్యవహరించిన సతీశ్‌ ఏంచేశారనేదానిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. సీబీఐ కేసులో భాగంగా సానా సతీష్ బాబు ఆస్తులతో పాటు ఆయన బంధువుల ఆస్తులపై సీబీఐ అధికారులు ఫోకస్ పెట్టారు. కాకినాడలోని సతీష్ బాబు ఆస్తులతో పాటు పెద్దాపురం, సామర్లకోటల్లోని ఆయన బంధువుల ఇళ్లలో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. 

సతీష్ బాబు హైదరాబాద్‌ శివారులోని హయత్‌నగర్‌లో ఓ భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుని ప్రారంభించాడు. ఈ ప్రాజెక్టు 400 ఎకరాల పైమాటే. ప్రాజెక్టు దగ్గరికి యమహా బైక్ మీద వచ్చే సతీష్... ఈ ప్రాజెక్టు కారణంగా ఆడి ఎ4 కారుకి అనతికాలంలోనే ఎదిగిపోయాడు. వివాదాలున్న ఈ భూమిని అతి తక్కువ ధరకు కొని భారీధరలకు అమ్మేశాడు. తర్వాత సతీష్ బాబు ఫిలింనగర్‌లో ఇంటిని రెంట్‌కి తీసుకున్నాడు. ఫిలింనగర్ పేరు చెబితే అక్కడ కీలక అధికారులు, సినిమా ప్రముఖులు, వీఐపీలకు ఆవాసం. సతీష్ బాబు వీరందరితో పరిచయాలు పెంచుకున్నాడు. ఢిల్లీ స్థాయిలోనూ సతీష్ లాబీయింగ్ చేసేవాడని చెబుతారు. లండన్. దుబాయ్, అమెరికా వంటి దేశాలు కూడా చుట్టేసి వచ్చారు. 2005 నుంచి 2013 వరకూ సతీష్ బాబు అనేక ప్రాజెక్టుల్లో ప్రత్యక్షంగా, పరోక్ష పాత్ర ఉంది. ఎక్స్‌ట్రీం స్పోర్ట్స్ బార్, నోవాటెల్ హోటల్ సమీపంలోని నైట్ క్లబ్ ఎక్సెస్ సతీష్ బాబుదే. తర్వాత ఈ క్లబ్‌ని ది క్లబ్ అని పేరు పెట్టారు. ఈ ప్రాపర్టీని ప్లే బాయ్‌కి లీజకిచ్చేశాడు. వీటితో పాటు ఇల్లియాస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆరెంజ్ క్లినిక్స్, మ్యాట్రిక్స్ నేచురల్ రిపోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్.. ఇలా ఒకటేమిటి ఎన్నో కంపెనీల వెనుక సతీష్ బాబు హస్తం ఉంది. వివిధ రాజకీయపార్టీల నేతలతో కూడా సానా సతీష్ బాబుకు మంచి పరిచయాలు ఉన్నాయి.  హైదరాబాద్ గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన విల్లా సతీష్ బాబు పేరుమీద ఉంది. 

ఓ టీడీపీ నేత సహకారంతో దుబాయిలో ఓ లిక్కర్ కంపెనీ ప్రారంభించి.. కాకినాడ నుంచి కొంతమందిని ఎంపికచేసి అక్కడికి పంపించాడు.  హిందీ, ఇంగ్లీష్ సరిగా రాకున్నా, మాటకారి కాకపోయినా.. రాజకీయనాయకుల ప్రోత్సాహం, అండదండలతో కోట్లకు పడగలెత్తాడు. వైఎస్ హయాంలో ఏపీలో సంచలనం సృష్టించిన వాన్ పిక్ ప్రాజెక్టు వ్యవహారంలో కూడా ఈ సతీష్ బాబు చాలా కీలకంగా వ్యవహరించాడు. నిమ్మగడ్డ ప్రసాద్ కు సన్నిహితంగా ఉండేవాడని చెబుతారు. అప్పటి సీఎం వైఎస్, ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద జరిగే సమావేశాలకు కూడా ఆయన హాజరయ్యేవాడు. వాన్ పిక్ ప్రాజెక్టులో కూడా సాన సతీష్ బాబుకు కొంత వాటా ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. రెండు ఓడరేవులు, భారీ పారిశ్రామిక వాడ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏకంగా 28 వేల ఎకరాలను వాన్ పిక్‌కు అప్పగించటానికి రెడీ అవటంపై అప్పట్లోనే  తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాత జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు కావటంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. ప్రస్తుతం సతీష్ బాబు సాన మ్యాట్రిక్స్ న్యాచురల్ రిసోర్సస్ ప్రైవేటె లిమిటెడ్ తోపాటు..పలు కంపెనీల్లో డైరక్టర్ గా ఉన్నారు. ఇందులో నిమ్మగడ్డ ప్రకాష్ కూడా మరో డైరక్టర్. కాకినాడ సమీపంలో ఉప్పుటేరుకు అవతల ఇంద్రపాలెం అనే గ్రామంలో మేడలైన్‌ డెవలపర్స్ పేరుతో ప్రైవేటుగా సాగిన భూసమీకరణ వ్యవహారంలో ఆయన పాత్రపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ నిర్మిస్తున్న ప్రైవేటు వంతెనకు అనుమతులు ఎలా వచ్చాయి? దీని వెనుక ఎవరున్నారు అనేదానిపై క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఈ వంతెన కారణంగా ఈ భూముల ధరలు భారీగా పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ వెంచర్‌లో ప్రముఖులు కూడా  ప్లాట్లు కొనుగోలు చేశారు. పెరిగిన పరిచయాలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లకు పడగలెత్తి 25కు పైగా కంపెనీల్లో సతీష్ బాబు డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఓ గ్యాస్ కంపెనీ డీల్ కూడా కుదుర్చుకున్నాడు. కానీ అది రద్దయింది. అనేక కంపెనీల పేరుతో భారీగా రుణాలు కూడా తీసుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle