newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

సీనియర్ జర్నలిస్ట్ రాఘవాచారి ఇకలేరు...ప్రముఖుల నివాళి

28-10-201928-10-2019 11:59:14 IST
Updated On 28-10-2019 11:59:08 ISTUpdated On 28-10-20192019-10-28T06:29:14.751Z28-10-2019 2019-10-28T06:22:55.539Z - 2019-10-28T06:29:08.711Z - 28-10-2019

సీనియర్ జర్నలిస్ట్ రాఘవాచారి ఇకలేరు...ప్రముఖుల నివాళి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాలాంధ్ర పూర్వ సంపాదకులు చక్రవర్తుల రాఘవాచారి ఇకలేరు. అనారోగ్యంలో బాధపడుతున్న రాఘవాచారి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు.  రాఘవాచారి 1972 నుంచి విశాలాంధ్ర ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. విశాలాంధ్ర ఎడిటర్‌గా మూడు దశాబ్దాలు పనిచేశారు. జర్నలిజంలో ఉన్నత విలువలకు ఆయన పట్టం కట్టారు. 

రాఘవాచారి మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. రాఘవాచారి కుటుంబానికి వారు ప్రగాడ సానుభూతి తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సీపీఐ నేత నారాయణ గుర్తు చేసుకున్నారు. రాఘవాచారి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి . విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

రాఘవచారి విలువ ఆధారిత జర్నలిజాన్ని విశ్వసించారని జగన్ కొనియాడారు. రాఘవాచారి రచనలలో విలువ ఆధారిత జర్నలిజం ప్రతిబింబిస్తుందని, ఆయన రచనలు యువ తరాలకు ప్రేరణగా నిలిచాయని జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

విశాలాంధ్ర మాజీ సంపాదకులుగా జర్నలిజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం రాఘవాచారి జీవితాంతం కట్టుబడి ఉన్నారని ఆయన సేవలను చంద్రబాబు కొనియాడారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాఘవాచారి జీవితం ఆదర్శప్రాయమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా ఆయన సేవలు అందించారని కేసీఆర్ పేర్కొన్నారు.

సీపీఐ నేత రామకృష్ణ, విశాలాంధ్ర ఉద్యోగులు, తెలంగాణ జనసమితి నేత కోదండరాం రాఘవచారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రాఘవాచారి స్వస్థలం వరంగల్‌ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. 1939 సెప్టెంబరు 10వ తేదీన ఆయన జన్మించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా సేవలందించారు. విలువలకు జీవితాంతం కట్టుబడిన కమ్యూనిస్టుగా విజ్ఞానఖనిగా రాఘవాచారికి పేరుంది. 

‘‘సీనియర్ పాత్రికేయులు, పత్రికా రంగ విలువలకు కట్టుబడి జీవించిన విశాలాంధ్ర మాజీ సంపాదకులు, సి.రాఘవాచారి గారి మృతి బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి’’ అని రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. ఏపీ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు కామ్రేడ్  రాఘవాచారి మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు అన్నారు. రాఘవచారి కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతిని వ్యక్తం చేశారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle