newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

సీతమ్మ బడ్జెట్లో అక్షర సిరిమల్లె చెట్టు

05-07-201905-07-2019 17:21:49 IST
Updated On 06-07-2019 12:05:32 ISTUpdated On 06-07-20192019-07-05T11:51:49.511Z05-07-2019 2019-07-05T11:46:25.515Z - 2019-07-06T06:35:32.246Z - 06-07-2019

 సీతమ్మ బడ్జెట్లో అక్షర సిరిమల్లె చెట్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆర్థిక వార్షిక నివేదికే బడ్జెట్. అందులో ఏం తేడా లేదు. కాకపోతే, బడ్జెట్ ప్రసంగం అంటే కేవలం ఏవో కొన్ని గణాంకాలతో కూడిన నిధుల కేటాయింపుల పత్రం అని అనుకోవడమే సరికాదు. అది ప్రభుత్వాల దశ దిశ నిర్దేశ దార్శనిక పత్రం. ఆర్థిక రంగ నిపుణుల సహకారంతో కేంద్ర మంత్రి చేసే కసరత్తుకు ‘ప్రతి’ రూపమే బడ్జెట్ అని కూడా అనుకోడానికి లేదు. అక్షరం అక్షరం ఆలోచించి ఏర్చి కూర్చి తెచ్చి వాక్యాలలో పొందికగా పేర్చి ప్రసంగం మొత్తాన్ని ఆద్యంతం అందంగా, ఆకర్షణీయంగా మలచాలి. 

పది పర్యాయాలు మొరార్జీదేశాయ్, తొమ్మిదిసార్లు చిదంబరం, ఎనిమిదిసార్లు ప్రణబ్ ముఖర్జీ, 7 పర్యాయాలు యశ్వంత్ సిన్హా, యశ్వంత్ రావు చవాన్, సీడీ దేశ్‌ముఖ్, మన్మోహన్ సింగ్, 6 సార్లు టీటీ కృష్ణమాచారి.. ఇలా పాతికమందికి పైగా ఆర్థిక మంత్రులు సభలో చేసిన బడ్జెట్ ప్రసంగాలు ఒక్కొక్కటీ ఒక్కొక్క ప్రత్యేక ప్రతిగా నిలిచిపోయేవే. అందులో మహానుభావుల మహితోక్తులు, సూక్తులు-సుభాషితాలు, స్ఫూర్తిదాయక వాక్యాలు కచ్చితంగా ఉంటాయి.

తాజాగా నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగంలోనూ కొన్ని మెరుపులు వున్నాయి. తెలుగింటి కోడలైన సీతమ్మ అమితా విద్యావరేణ్యురాలిగా ఖ్యాతి గడించిన మహిళ. ఆమె చదవని గ్రంధం లేదు. హైదరాబాద్‌లో సీతారామన్ దంపతులు ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న ఇంటికి వెళితే శిల్పారామంలా అగుపించే ఆ ఇంటి పైభాగం అరల్లో వేల కొలది పుస్తకాలు కనిపిస్తాయి.
Image may contain: 1 person, closeup

తను చదువుకున్న అనేక గ్రంధాల్లోని కొన్ని మంచి ముత్యాల్లాంటి మాటల్ని సీతారామన్ తన 2019-20 బడ్జెట్ ప్రసంగంలో సందర్భానుసారం చక్కగా ఉపయోగించుకున్నారు. చాణక్య నీతి సూత్రాలు, ఉర్దూ కవితాపంక్తులు, సంఘ సంస్కర్త బసవేశ్వరుని వచనాలను ప్రస్తావించారు. పనిలో పనిగా తమిళ సంగం యుగంలోని ఒక కథను కూడా ప్రస్తావించారు.

ముఖ్యంగా ‘కాయకవ కైలాస’ అనే స్ఫూర్తిదాయక వాక్యం సీతారామన్ ప్రసంగంలో అందరినీ ఆకట్టుకుంది. ఉద్యోగ బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో చెబుతూ బసవేశ్వరుడు సమాజానికి కొన్ని సూచనలు చేశాడు. ‘మనం ఏ ఉద్యోగంలో ఉన్నామో దానిపై మనస్సు పెట్టి బాధ్యతలు నిర్వహించాలని బోధించాడు. మనం ఎంచుకున్న ఉద్యోగాన్ని నిబద్ధతతో చేయాలని సూచించాడు.

దసోహ.. అంటే మనం సంపాదించుకున్నదానిలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలని చాటాడు. 12 వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుని బోధనలు ఆనాడు ఒక సామాజిక విప్లవానికి దారి తీశాయి. అన్ని రంగాల్ల్లో అందరూ అభివృద్ధి సాధించాలనే మహత్తరమైన ఆలోచనకు ఆ కాలంలోనే నాంది పలికిన బసవేశ్వరుణ్ణి గుర్తుచేస్తూ సీతారామన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

దేశంలోని దాదాపు 10 మిలియన్ల యువతకు నైపుణ్య అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందివ్వాలన్నదే బసవేశ్వరుని లక్ష్యాన్ని తన ప్రసంగంలో వివరించారు. బసవేశ్వరుని  బాటలో కేంద్ర ప్రభుత్వం కూడా ‘సబ్‌కా సాత్‌ సబ్‌ కా వికాస్‌’ లక్ష్యంగా పనిచేస్తోందని వెల్లడించారు. స్టాండప్‌ ఇండియాలో భాగంగా సమాజంలోని అందరూ గౌరవభావంతో జీవించేందుకు వీలుగా అట్టడుగు వర్గాల యువతకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. బసవేశ్వరుని బోధనల ప్రభావంతో  సమసమాజం కోసం కృషి చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు.

పిసిరన్‌డైయార్‌ అనే కవి పురననూరు అనే గ్రంథంలో అప్పటి పాండ్య రాజు అరివుడై నంబికి చెప్పిన ఒక తమిళ కథను కూడా సీతారామన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఒక చిన్న పొలంలో పండించిన ధాన్యం ఒక ఏనుగు ఆహారానికి సరిపోతుంది. అదే ఆ ఏనుగునే పొలంలోకి పంపిస్తే పొలాన్ని ధ్వంసంచేస్తుంది.. అంటూ పిసిరన్ చెప్పిన కథని సభలో వినిపించారు. తమ ప్రభుత్వం అలా చొరబడే విధానాలను అనుసరించబోదు అని పనిలో పనిగా స్పష్టం చేశారు.

Image may contain: one or more peopleపిసిరన్‌డైయార్‌ 

నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలనే నమ్మకం, విశ్వాసంతో పనిచేస్తామని చెబుతూ చాణక్య నీతి సూత్రాలను నిర్మలా సీతారామన్ ఈ సందర్భంలో వల్లె వేశారు.‘కార్య పురుష కరేన..లక్ష్యం సంపాదయతే’ అనేదే చాణక్య నీతి అని చెబుతూ, మానవ ప్రయత్నం నిర్దిష్టంగా ఉంటే ఎంతటి లక్ష్యాన్నయినా సాధించగలమని కేంద్ర మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో చాణక్య నీతి సూత్రాన్ని ఉటంకించారు.

Image may contain: 3 people

ఒక ఉర్దూ కవితను కూడా ఆమె తన ప్రసంగంలో వినిపించారు. మనసుంటే మార్గముంటుందని చెప్పడానికి, ‘యకీన్ హో తూ కోయి రాస్తా నికల్తా హై, హవా కి ఓట్ (రక్షణ) భీ లే కర్ చిరాగ్ జల్తా హై’ అంటూ ప్రముఖ ఉర్దూ కవి మంజూర్ హాష్మి రాసిన ఉర్దూ కవితను మంత్రి చదివి వినిపించారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle